Thursday, July 31, 2014
91 ఏళ్ళు + క్యాన్సర్ + నిధుల సేకరణ
ఒక పక్క క్యాన్సర్‌కు ట్రీట్‌మెంట్ తీసుకుంటూ.. 91 సంవత్సరాల వయసులో 42 కిలోమీటర్ల దూరాన్ని 7గంటల 7నిమిషాల 42 సెకండ్లలో పూర్తి చేశారు బామ్మగారు హారియట్ థాంప్సన్. పైగా ఇదేదో రికార్డు కోసం కాదు. ఈ వయసులోనూ సమాజానికి ఏదో ఒకటి చెయ్యాలన్న తపనే ఆమెను పరుగు తీయించింది. తన స్నేహితురాలు నిర్వహిస్తున్న లుకేమియా లింఫోమియా సొసైటీ కోసం నిధుల సేకరణకు బామ్మ పరుగు పెట్టి ఏకంగా 90 వేల డాలర్లను సొసైటీకి ఇచ్చి సత్తా చాటారావిడ. ఈ మారథాన్ పరుగుకు 4 వారాల ముందు హారియట్ 11 రోజుల పాటు రేడియేషన్ చికిత్స తీసుకున్నారు. దాని వల్ల రెండు కాళ్లకూ విపరీతంగా గాయాలయ్యాయి. వాటికి బ్యాండేజిలు కట్టుకుని మరీ పరుగు తీసింది మన బామ్మ. బామ్మగారి 55 ఏళ్ల కొడుకు బ్రెన్నెమన్ కూడా తల్లితో పరిగెత్తి, సాయం చేశాడు. ఇంత పెద్ద మారథాన్ పూర్తి చేసిన రెండో బామ్మగా అమెరికా చరిత్రలో రికార్డులకెక్కారు. అందరూ బామ్మ మాట బంగారు మాట అంటుంటారు... బామ్మ బాట కూడా బంగారు బాటేనని ఈ బామ్మగారు రుజువు చేశారు.
Monday, June 30, 2014
గ్రేస్‌కు ఇంజనీరింగ్ సీటొచ్చింది..
హిజ్రాలంటే ఏహ్య భావంతో చూసే సమాజం ఇది. కానీ, తమిళనాడులో గ్రేస్ బాను అనే హిజ్రా తనకు ఎదురైన అవహేళనల్ని తట్టుకుని ఇంజనీరింగ్ కాలేజీలో సీటు సంపాదించింది. అన్నా యూనివర్శిటీ కౌన్సిలింగ్ ద్వారా అరక్కోణంలోని శ్రీకృష్ణా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో ట్రిపుల్ ఇ (ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇంజనీరింగ్) కోర్సులో చోటు దక్కించుకుంది. పాలిటెక్నిక్‌లో గ్రేస్ 94 శాతం మార్కులతో సంపాదించింది. గ్రేస్ ట్రాన్స్‌జెండర్ కావడంతో ప్లస్ టూలో ఉండగానే తల్లిదండ్రులు వదిలేశారు. అప్పటి నుంచీ ఎంతో కష్టపడి ఇంజనీరింగ్ వరకూ వచ్చింది.
Saturday, May 31, 2014
చెట్టు కొడుకు..
మధ్యప్రదేశ్‌లో నివసించే శ్యామ్ లాల్ పతిదార్ తన కొడుక్కి ప్రతి ఏటా క్రమం తప్పకుండా పుట్టినరోజు వేడుక జరుపుతుంటాడు. కొడుకును ముద్దు పెట్టుకుని మురిసిపోతుంటాడు. ఇంట్లో తిండి గింజలు లేకపోయినా పట్టించుకోడు కానీ, తన చెట్టంత కొడుకు పుట్టినరోజున కేక్ కట్ చేసి, బుడగలు కట్టి నానా హడావుడి చేస్తాడు. ఇంతకీ ఆ కొడుకు అంత గొప్పవాడా.. అని మీరు అడగవచ్చు. అవును మరి. ఆ చెట్టంత కొడుకు మరెవరో కాదు. ఒక వేప చెట్టు. ఆ చెట్టునే తన కొడుకుగా భావించి పండుగ చేస్తుంటాడాయన. శామ్ లాల్‌ను అందరూ ఆదర్శంగా తీసుకుంటే పర్యావరణ సమస్యలే రావని మధ్యప్రదేశ్ అటవీ శాఖ అధికారులు ఆయన గురించి గొప్పగా చెబుతుంటారు.
Friday, January 31, 2014
పెన్షన్ ఇస్తున్నారుగా... పనిచేస్తా..
రిటైర్ అయిన తరువాత హాయిగా ఇంట్లో కూర్చుందామనుకోలేదు ఆ పెద్దాయన. ఇస్తున్న పెన్షన్‌కు తగిన పని చేస్తానంటూ మళ్ళీ ఆఫీసు బాటపట్టారు. తమిళనాడులోని శ్రీరంగంలో నివసిస్తున్న రిటైర్డ్ కమర్షియల్ ఇనస్పెక్టర్ వి గోపాలన్ గారి జీవితం ఇది. అక్కడికి 9 కిలోమీటర్ల దూరాన మన్నార్‌పురంలో పనిచేస్తుండేవారు. అయితే 2006లో రిటైర్ అయినప్పటికీ పెన్షన్ పేరిట డబ్బులిస్తున్నారు కనుక అందుక తగ్గ సేవలందిస్తానంటూ రోజూ సైకిల్‌పై అంతదూరం వెళ్ళి స్వచ్ఛందంగా సేవలందిస్తున్నారు. తన ఆరోగ్యం భేషుగ్గా ఉందంటూ మళ్ళీ సైకిలెక్కారాయన..
Saturday, November 30, 2013
అతనొక్కడే... ఒక చోట స్టూడెంట్.. మరోచోట హెడ్మాస్టర్
అతనే బాబర్ అలీ. 17 సంవత్సరాల ఈ కుర్రాడు 9 ఏళ్ళ వయసుకే ఉపాధ్యాయుడిగా అవతారమెత్తి అలా అలా ప్రధానోపాధ్యాయుడిగా బాధ్యతలు భుజానికెత్తుకుని ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. పశ్చిమ బెంగాల్‌లో ముర్షిదాబాద్ గ్రామానికి చెందిన అలీ బెర్హంపూర్‌లో ఉన్న కాసింబజార్ రాజ్ గోవింద సుందరి విద్యాపీఠ్‌లో ఒక పక్క ప్లస్ టూ చదువుకుంటూనే తన ఊళ్ళో పేదల కోసం తమ ఇంటి పెరడులో ఏర్పాటు చేసిన బడికి ప్రధానోపాధ్యాయుడిగా ఉన్నాడు. పెరడులో బడి అంటే ఏదో చిన్నదనుకునేరు. ఇక్కడ దాదాపు 800 మంది పేద విద్యార్థులకు అలీ ద్వారా విద్యాబుద్ధులందుతున్నాయి. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఈ బడికి గుర్తింపునిచ్చి ఇక్కడి విద్యార్థులకు నెల నెలా బియ్యం సరఫరా చేస్తోంది. బాబర్ అలీ సేవల్ని గుర్తించిన పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఇతనిని పురస్కారాలతో సత్కరించి ప్రోత్సహిస్తున్నాయి.
Saturday, August 31, 2013
సావిత్రికి చేప ప్రసాదం... సత్యమూర్తికి పరమానందం..
నాడు సత్యవ్రతుని కోసం భార్య సావిత్రి యముని వెంటపడి మాంగల్యాన్ని దక్కించుకుంటే... నేడు బిడ్డ సావిత్రి కోసం యజమాని సత్యమూర్తి తపనపడి చేప ప్రసాదం ఇప్పించాడు. అసలీ సావిత్రి ఎవరు?.. ఆమె చేప ప్రసాదం తింటే మాకేంటి?... అనుకుంటారేమో. మన మామూలు కళ్ళకు ఆమె ఒక కుక్కలా కనిపించవచ్చు గానీ హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలో నివసించే ఏసీ వ్యాపారి సత్యమూర్తికి మాత్రం సావిత్రి తన కన్నబిడ్డ లాంటిదే. ఈ మధ్యన నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో చేప ప్రసాద వితరణ జరిగినప్పుడు గర్భవతిగా ఉన్న సావిత్రికి కూడా ఈ ప్రసాదం ఇప్పించాలని అనుకున్నారాయన. తన కన్నబిడ్డ లాంటి సావిత్రి కనబోయే బిడ్డలు సైతం ఆరోగ్యంగా ఉండాలని తలచి చేప ప్రసాదం ఇప్పించారు. హైదరాబాద్‌లో ఈ ఏడాది బత్తిని సోదరుల చేప ప్రసాదం వితరణ సందర్భంగా ఈ అరుదైన ఘటన చోటు చేసుకుంది. బాగ్‌లింగంపల్లిలో ఉండే సత్యమూర్తి అనే అయ్యప్ప స్వామి భక్తుడు 'సావిత్రి'ని తన బండిపై నాంపల్లి గ్రౌండ్స్‌కు తీసుకువచ్చి 'చేప ప్రసాదాన్ని' తినిపించారు. అప్పటికి గర్భవతిగా ఉన్న సావిత్రి శాకాహారే అయినప్పటికీ మంచి ఆరోగ్యం కోసం చేప ప్రసాదం ఇప్పించినట్లు సత్యమూర్తి చెప్పారు. సావిత్రితో చేప ప్రసాదం తినిపించడానికి అక్కడున్న కార్యకర్తలు తొలుత ఇబ్బంది పడినప్పటికీ చివరకు ప్రసాదాన్ని విజయవంతంగా తినిపించారు. పద్ధతి ప్రకారం 45 రోజుల పాటు కచ్చితమైన పత్యం పాటించేలా చూస్తానన్నారు. 'సావిత్రి'ని కన్నబిడ్డలా చూసుకుంటానని, తనతో పాటే పూజల్లో పాల్గొంటుందని సత్యమూర్తి చెప్పారు. చేప ప్రసాదం గురించి బయట ఎన్ని వివాదాలున్నా... ఇక్కడ మాత్రం సావిత్రి పట్ల ఆ యజమానిలో గూడు కట్టుకుని ఉన్న ప్రేమకే పట్టం కడదాం...
Sunday, June 30, 2013
మామూలు బడిలో పెద్దాయన కూతురు
ఒక జిల్లా కలెక్టర్ తన కూతురిని కార్పోరేట్ స్కూల్‌లో కాక సర్కారు బడిలో చేర్పించారంటే నమ్ముతారా!.. తమిళనాడులోని ఈరోడ్ జిల్లాకు 2011లో కలెక్టర్‌గా పనిచేసిన ఆనంద్ కుమార్ తన ఆరేళ్ళ కూతురిని ప్రభుత్వ పాఠశాలలోనే చదివించాలని నిర్ణయించుకుని అలాగే చేశారు. తన కుమార్తె గోపికను కుమళంకుట్టై పంచాయితీ యూనియన్ ప్రాథమిక పాఠశాలలో రెండవవ తరగతిలో చేర్పించారు. ఈ జిల్లాలో చాలా పెద్ద కార్పోరేట్ బడులున్నా ఈ కలెక్టర్ మాత్రం తన కూతురిని ప్రభుత్వ బడిలో చేర్పించి ఎందరికో ఆదర్శంగా నిలబడ్డారు. తమిళనాడులో జరిగే ప్లస్ టూ, ఎస్‌ఎస్‌ఎల్‌సి పరీక్షలలో ఎక్కువ మార్కులు సాధించిన చాలామంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు చెందినవారే. ఇక్కడ ఇంకొక విషయమేమంటే తమిళనాడు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా అందించే యూనిఫాంనే గోపికకూ ఇప్పించారు తప్ప ఆమె కోసం కలెక్టర్ గారు మరింత నాణ్యమైన వస్త్రం తెప్పించి యూనిఫాం కుట్టించలేదు. అంతకు మించిన మరో సంగతేమిటంటే ఆమె తన బడిలో ఉచితంగా పెట్టే మధ్యాహ్న భోజనమే తిన్నది తప్ప ఇంటి నుంచి ప్రత్యేకంగా క్యారేజీ రాలేదు. గోపిక తల్లి ఒక డాక్టర్ అట. జిల్లాకు ఎంతో మేలు చేస్తున్న ఈ కలెక్టర్ గారిని ఆ తర్వాత రాజకీయులు బదిలీ చేయించారు.
Tuesday, April 30, 2013
'స్ఫూర్తిదాత.. శ్రీ మామయ్య
ఆయన అమెరికా వెళ్ళి ఆర్థిక శాస్త్రంలో ఎంఎ పట్టా పొందారు. బిజినెస్ స్కూల్‌లో బోధకుడిగానూ పనిచేశారు. వ్యాపార విలువల గురించి లోతైన అధ్యయనం చేసినా జీవితాన్ని మాత్రం మానవతా విలువలతోనే అల్లుకున్నారు. ఆయనే శ్రీవ్యాల్. 2004లో మాతృభూమికి తిరిగి వచ్చిన శ్రీవ్యాల్ బిజినెస్ స్కూల్ బోధకునిగా చేరినప్పుడు ఎదురైన కొన్ని అనుభవాల నుంచి పుట్టిందే "స్ఫూర్తి" ఫౌండేషన్. భావి భారత పౌరులను తీర్చిదిద్దే లక్ష్యంతో 2006లో హైదరాబాద్ చర్లపల్ల ప్రాంతంలో ఒక కిరాయి ఇంటిలో ముగ్గురు అనాథ బాలల కేరింతల నడుమ ఈ ఫౌండేషన్ ఆవిర్భవించింది. శ్రీవ్యాల్ స్నేహితులు, దాతల విరాళాలతో ప్రస్తుతం సుమారు 200 మంది చిన్నారులకు ఇక్కడ ఆశ్రయం కల్పించారు. తన భార్య వెంకటేశ్వరి తోడ్పాటుతో ఇక్కడి పిల్లలకు అన్నీ తామై వారి ఆలనా పాలనా చూసుకుంటున్నారు.
పిల్లలంతా శ్రీ మామయ్యగా పిల్చుకునే శ్రీవ్యాల్ సేవలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి దుండిగల్ వద్ద స్థలాన్ని కేటాయించింది. వీరి కోసం ఒక భవనాన్ని నిర్మించి ఇచ్చేందుకు జెజె మెహతా మెమోరియల్ ఫౌండేషన్ సుముఖత వ్యక్తం చేసింది. ఈ క్రమంలో పలు సాఫ్ట్‌వేర్ సంస్థలు "స్ఫూర్తి" బాలల కోసం అప్పుడప్పుడూ కార్యక్రమాల్ని చేపడుతున్నాయి. ఆ మధ్య అమెరికాలోని మేరీలాండ్ ఫస్ట్ లేడీ మేరీ క్యాథరీన్ కూడా ఈ ఫౌండేషన్‌కు వచ్చి అభినందనలు కూడా తెలిపారు.
"స్ఫూర్తి" బాలలందరికీ భోజనం, బస, వస్త్రాలు, కాన్వెంట్ చదువు ఉచితమే. 7వ తరగతి వరకూ అక్కడి ప్రయివేట్ పాఠశాలలోను, తర్వాత 10వ తరగతి వరకూ "అధ్య"లో వీరిని చదివిస్తారు. సంగీతంతో పాటు ఇక్కడ కేంబ్రిడ్జి ఇంటర్నేషనల్ పాఠ్యప్రణాళికను బోధిస్తారు.
ఈ స్ఫూర్తిని మనందరం అందిపుచ్చుకుందాం...

Wednesday, January 30, 2013
శివుని మెడలో ఒక పామే.. మరి రతీష్ దగ్గర ?..
పాముల నుంచి కాపాడుకోవడానికి వాటిని చంపాల్సిన పనిలేదని గొంతు చించుకుని అరుస్తుంటాడు రతీష్. విషపూరిత పాములతో ఎలా వ్యవహరించాలో కనిపించినవారికల్లా వివరిస్తుంటాడు. విషముండే పాములేవో.. విషం లేనివి ఏవో యువతరం, విద్యార్థుల్లో అవగాహన కల్గిస్తుంటాడు. అంతెందుకు, వాటి కోసం కోయంబత్తూరు సమీపాన ఇడయారుపాలెంలోని తన ఇంటిని ఏకంగా సర్ప గృహంగా మార్చేశాడు. ఏ పాముకు ప్రమాదం వాటిల్లినా అది రతీష్ సర్పగృహానికి వచ్చి చేరాల్సిందే..
తన ప్రాంతంలోని సుమారు 250 కిలోమీటర్ల పరిధిలో ప్రజల దురవగాహన వల్ల, రోడ్డు ప్రమాదాల కారణంగా ప్రతిరోజూ కనీసం 10 పాములు చనిపోతున్నాయని రతీష్ అంచనా. రోడ్డు ప్రమాదాల్లో తోకలు తెగి, శరీరాలకు గాయాలైన దాదాపు యాభైకి పైగా పాములకు ఇతను తన సర్పగృహంలో సేవలందిస్తున్నాడు. అవి కోలుకోగానే అడవుల్లోనూ, కొండల్లోనూ విడిచిపెడుతుంటాడు. పాములకు ఎవరైనా హానికల్గిస్తున్నారని తెలిస్తే సహించడు. వారి ఎదురుగానే ఆ సర్పాలతో మైత్రిని ఏర్పరుచుకుని అబ్బురపరుస్తాడు.
ఆపదలో ఉన్న సర్పాలకు సేవలందించడం కోసం ఏడుగురితో ఒక బృందాన్ని కూడా రతీష్ సిద్ధం చేసుకున్నాడు. ఎక్కడైనా, ఎప్పుడైనా పాములకు ముప్పు వాటిల్లినట్లు సమాచారం రాగానే ఈ బృందం అక్కడ వాలిపోతుంది. సర్పసేవలో తరిస్తుంది.

Friday, November 30, 2012
పంచానన్ పడూయ్.. ఎందరికి తెలుసు ?
రేపటి కోసం అంటూ ఒక్క పైసా దాచుకోకుండా తాను జీవితాంతం గడించిన జీతంలో 90 శాతం మొత్తాన్ని పశ్చిమ బెంగాల్లోని 685 పాఠశాలలకు విరాళంగా ఇచ్చిన ధన్యజీవి, విద్యాదాత శ్రీ పంచానన్ పడూయ్. హౌరాలోని డోమ్‌జడ్ ప్రాంతానికి చెందిన ఈ ఉపాధ్యాయుడు. ఏడేళ్ళ వయసులోనే తండ్రిని కోల్పోయి, ఉన్న పొలం కాస్తా కరవు కోరల్లో చిక్కుకోవడంతో ఈ కుటుంబం నిరుపేదగా మారింది. తన తల్లి మట్టికుండల్లో చాలీచాలని బియ్యాన్ని వండిపెట్టేదట. సాయం పొందే అవకాశమేలేకపోయింది. పశువులు కాశారు, గడ్డి కోశారు. డబ్బున్నవారిళ్ళల్లో బట్టలుతికారు. చీరెలు అమ్మారు. జౌళి మిల్లులో పనిచేశారు. ఈ క్రమంలో రాత్రి వేళ చదువుకుని బికాం పాసయ్యారు. రాహ్రాలోని శ్రీ రామకృష్ణ మిషన్ ద్వారా పీజీ పూర్తి చేశారు. చివరికి హిందీ పండితునిగా ఉద్యోగంలో స్థిరపడ్డారు.
ఒకప్పుడు తనకే గనుక ఉద్యోగం వస్తే ఆర్థిక ఇక్కట్లతో చదువుకోలేకపోయిన వారికి ధన సహాయం చేయాలని ఆ రోజుల్లోనే నిశ్చయం చేసుకున్నారు. ఈ సంకల్పాన్ని నెరవేర్చుకోవడం కోసం పెళ్ళికి దూరంగా ఉండాలని కూడా ఒట్టు పెట్టుకున్నారు శ్రీ పడూయ్. తన ఇంట్లో వెలుగు కోసం లాంతరు, కొవ్వొత్తులూ ఉపయోగించుకుంటూ కరెంట్ వాడకాన్ని సైతం పక్కనపెట్టారు. ఎందుకంటే కరెంటు బిల్లుకయ్యే ఖర్చుతో మరో విద్యార్థికి సాయం చెయ్యచ్చు కదా అంటారాయన. బిగ్డే స్కూలులో 28 సంవత్సరాలు పనిచేసి 1997లో పదవీ విరమణ చేసిన తర్వాత మూడేళ్ళకు రాష్ట్ర ప్రభుత్వం ఈయన్ని ఉత్తమ ఉపాధ్యాయునిగా గుర్తించి గౌరవించింది.

Saturday, September 01, 2012
భర్త నుంచి భార్యను రక్షించిన డ్రైవర్...
కలకత్తాలో ఒక ఇల్లాలిని వ్యభిచారకూపంలో పడేయాలనుకున్న భర్త నుంచి ఆమెను ఒక టాక్సీ డ్రైవర్ కాపాడాడు. శ్యామ్ లాల్ సొరెన్ అనే వ్యక్తి తన భార్యతో కలసి ఒక షేర్ టాక్సి ఎక్కాడు. భార్యను వెనుక సీట్లో కూర్చోబెట్టి ముందు సీట్లో ఉన్న డ్రైవర్ పక్కన తాను కూర్చున్నాడు. ఆ షేర్ టాక్సీలో ఉన్న మిగతా ప్రయాణీకులందరూ దిగిపోయాక కలకత్తాలో అమ్మాయిలను అమ్మడానికి సరైన చోటేదని డ్రైవర్ చెవిలో మెల్లగా అడిగాడు. అక్కడికి తీసుకెళితే 250 రూపాయలిస్తానని ఆశపెట్టాడు. శ్యామ్ లాల్ తీరుతో విస్తుపోయిన ఆ డ్రైవర్ మరేమీ మాట్లాడకుండా ఆ మహా నగరంలోని వీధుల గుండా తీసుకెళుతూ సెక్రెటేరియట్ దగ్గర ఆపాడు. అక్కడున్న పోలీసుల్ని పిలిచి శ్యామ్ లాల్ పన్నాగం గురించి చెప్పాడు. పోలీసులు డ్రైవర్‌తో పాటు శ్యామ్ లాల్, అతని భార్యను పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు. మూడు నెలల కిందటే పెళ్ళి చేసుకున్న శ్యామ్ లాల్‌కు ఏమైందో తెలియదు గానీ తన భార్యను అత్తారించికి తీసుకెళుతున్నట్లు నమ్మించి వ్యభిచార కూపంలోకి నెట్టాలని చూశాడు. కానీ టాక్సీ డ్రైవర్ మంచితనంతో ఈ ఘోరం తప్పింది. సాధారణంగా ఇలాంటి విషయాల్లో టాక్సీ డ్రైవర్లు, ఆటో డ్రైవర్ల పైన ఆరోపణలు వస్తుంటాయి. తామంతా అలాంటివారం కాదని ఈ టాక్సీ డ్రైవర్ నిరూపించాడు.
Tuesday, July 31, 2012
రోగాలున్నా డబ్బులు తిరిగిచ్చేశారు..
అక్రమార్జన, అవినీతి కలసి ప్రళయ రుద్రతాండవం చేస్తున్న రోజులివి. వ్యక్తులను.. సామాజిక వాతావరణాన్నీ అనారోగ్యం పట్టి పీడిస్తున్న పరిస్థితులివి. అలాంటి తరుణంలో 89 సంవత్సరాల రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ అధికారి చార్లెస్ విలియమ్స్ అనే ఆయన తన నిజాయితీని చాటి చెప్పి స్ఫూర్తిగా నిలిచారు. ప్రస్తుతం మైసూరులో నివసిస్తున్న ఈయన అనారోగ్యంతో తీవ్రంగా బాధపడుతున్నప్పటికీ తన పెన్షన్ అకౌంట్‌లో తనకు రావలసిన మొత్తంకంటే ఎక్కువగా జమ అయిన డబ్బును తిరిగిచ్చేశారు.
విలియమ్స్ గారు మన దేశానికి స్వాతంత్ర్యం రాక మునుపే రాయల్ ఎయిర్ ఫోర్స్ ఉద్యోగిగా చేరారు. పలు యుద్ధాల్లో పాల్గొని ఎన్నో చారిత్రక అనుభవాల గూడుగా ఉన్నారు. పదవీ విరమణ తర్వాత తనకు రావలసిన పెన్షన్ మొత్తంలో పొరపాట్లు చోటు చేసుకున్నట్లు గ్రహించిన విలియమ్స్ స్థానిక సైనిక సంక్షేమం, రీసెటిల్మెంట్ బోర్డు వారిని కలుసుకున్నప్పటికీ ఫలితం లేకపోయింది. చివరికి మైసూరులోని వెకరె ఎక్స్ సర్వీస్‌మెన్ ట్రస్ట్ అధ్యక్షుడు ఎం ఎన్ సుబ్రమణిని సంప్రదించారు. చివరికి మంగళూరులోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్‌కు చెందిన సెంట్రలైజ్డ్ పెన్షన్ ప్రాసెసింగ్ యూనిట్ నుంచి ఎక్కువ మొత్తం విలియమ్స్ పెన్షన్ ఖాతాలో పడినట్లు లెక్కల్లో తేలింది.
తనకు అర్హత లేనప్పటికీ fixed medical allowance కింద ప్రతి నెలా రూ.300 చొప్పున అదనపు మొత్తంగా ఖాతాలో 2007 నుంచీ రూ.15,200 జమ అయినట్లు గ్రహించిన విలియమ్స్ ఈ మొత్తాన్ని తిరిగిచ్చేయాలని నిర్ణయించుకున్నారు. నిజానికి కంటి సమస్య, గుండెకు ఆపరేషన్ కోసం ప్రస్తుతం ఆయన ఒకటిన్నర లక్ష రూపాయల సాయం కోసం ఎదురు చూస్తున్నారు. తనకు ఇబ్బందులున్నప్పటికీ దేశ ఖజానాపై భారం మోపకూడదన్న నైతికతతో ఆయన స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూరు వారికి లేఖ పంపి తనపై ఆర్థిక భారం పడకుండా ఈ డబ్బును సులభ వాయిదాల్లో వెనక్కి తీసుకోవలసిందిగా కోరారు.
ఈ ఉదంతం ద్వారా మనం తెలుసుకోవలసిన నీతి ఏమిటో చెప్పనక్కరలేదనుకుంటా...
Saturday, June 30, 2012
రూపాయికే బీజా...పూర్ ఫీడింగ్
ఒక్క రూపాయిస్తే నాలుగు జొన్న రొట్టెలు, వాటికి సరిపడా కూర. ఎంతమంది వచ్చినా ఇదే రేటు అక్కడ. ఇంతకుముందు 50 పైసలకే ఇదంతా ఇచ్చేవారట. 50 పైసలు కనుమరుగైపోవడంతో ఈ ధరను రూపాయికి పెంచారు. ఆ రూపాయి కూడా ఇవ్వలేనివారికి ఉచితంగానే ఈ రొట్టెలు, కూర ఇస్తారు. ఇంతకీ ఈ దృశ్యం ఎక్కడిదనుకుంటున్నారా ? కర్ణాటకలోని బీజాపూర్ పట్టణంలోని కబ్‌రాజీ బజార్‌లో ఉన్న హేమంత్ నగర్ దుకాణం వద్ద ఒక చేత్తో రూపాయి.. మరో చేత్తో విరిగిన పళ్ళెమో లేక పాలిథిన్ కవరో పట్టుకుని మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల మధ్య సమయంలో పేదలు వరుసలో నిల్చుని ఉంటారు.
ఇది దాదాపు నలభై సంవత్సరాలుగా కొనసాగుతున్న సేవ. అప్పట్లో హేమంత్ తండ్రిగారు కేవలం 10 పైసలకే పేదల కోసం ఈ సేవను ప్రారంభించారట. అప్పటి 10 పైసలుకానివ్వండి.. ఇప్పటి రూపాయి కానివ్వండి. ఈ మొత్తం సొమ్ముకు మరి కొంత డబ్బు చేర్చి వంటవారికి, రొట్టెల కోసం పిండి ఆడే మిల్లువారికి ఇస్తుంటారు. హేమంత్ కుటుంబం చేస్తున్న ఈ సేవ గురించి తెలిసినవారు ఈ సేవలో భాగస్వాములై ఎంతో కొంత సొమ్మును విరాళంగా ఇస్తుంటారు. కొందరైతే జొన్నలు, కూరగాయలు ఇస్తుంటారు. దాతలెవరైనా 08352 250114 ద్వారా హేమంత్ నహర్‌ను సంప్రదించవచ్చు.
Wednesday, May 30, 2012
పదేళ్ళ కుర్రాడు.. ప్లెయిన్ ఐస్‌క్రీం చాలన్నాడు..
ఈ సంఘటన అమెరికాలో జరిగింది. ఆ రోజుల్లో సన్‌డా ఐస్‌క్రీం వెల ఒకొక్కటి యాభై సెంట్లు. ఆ రోజుల్లో పిల్లలకు ఇది మహా ప్రాణమట. పెన్సిల్వేనియా రాష్ట్రంలోని హేరిస్‌బర్గ్ అనే ఊరిలో ఎప్పుటూ కిటకిటలాడే ఒక ఐస్‌క్రీం పార్లర్‌లోకి పదేళ్ళ కుర్రాడొకడు అడుగుపెట్టి టేబుల్ ముందు కూర్చున్నాడు. వెయిట్రెస్ వచ్చి గ్లాస్ మంచినీరు ఇచ్చి నిలబడింది...
ఐస్‌క్రీం సన్‌డా ఎంత ?.. అడిగాడు ఆ అబ్బాయి.
యాభై సెంట్లు.. చెప్పిందామె.
ఆ అబ్బాయి తన జేబులో ఉన్న నాణేల్ని లెక్కబెట్టుకుంటూ మళ్ళీ అడిగాడు.
మామూలు ఐస్‌క్రీం ఎంత ?..
అక్కడ చాలామంది కస్టమర్లు ఉండటంతో "ముప్ఫై ఐదు సెంట్లు.." అని విసుగ్గా చెప్పింది ఆ వెయిట్రెస్.
పిల్లవాడు తన దగ్గరున్న నాణేలన్నిటినీ లెక్కబెట్టుకుని చివరికి ఒక ప్లెయిన్ ఐస్‌క్రీం తెమ్మని అడిగాడు.
ఆమె ఐస్‌క్రీంతో పాటు బిల్ కూడా తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టేసి వెళ్ళింది. ఈ పిల్లవాడు దాన్ని తినేసి కౌంటర్‌లో డబ్బు చెల్లించి వెళ్ళిపోయాడు. కాసేపటికి ఈ వెయిట్రెస్ ఆ ఖాళీ కప్ తీసుకెళ్ళడానికి ఈ అబ్బాయి కూర్చున్న టేబుల్ దగ్గరికి వచ్చింది. ఖాళీ కప్ పక్కనే రెండు నికెల్స్, ఐదు పెన్నీ నాణేలు.. మొత్తం 15 పెన్నీలు కూడా కనిపించాయి. వెయిట్రెస్‌కు టిప్ ఇవ్వడం కోసం పిల్లలు ఎంతో ఇష్టపడే సన్‌డా ఐస్‌క్రీం వద్దనుకుని మరీ ఈ పిల్లవాడు మామూలు ఐస్‌క్రీం ఆర్డర్ చేసినట్లు ఆమె గ్రహించడానికి ఎంతోసేపు పట్టలేదు.
సౌజన్యం: శ్రీ మల్లాది కృష్ణమూర్తిగారు...
Saturday, March 31, 2012
పుస్తకాల డాక్టర్..
వైద్యుడి కోసం రోగులు ఎదురు చూస్తుంటారు. ముల్లంగి వెంకట రమణారెడ్డి కోసం పుస్తకాలు ఎదురు చూస్తుంటాయి. ఎందుకంటే చెదలుపట్టి, కుట్లు ఊడి, రేపోమాపో గాలికెగిరిపోయే పరిస్థితుల్లో ఉన్న వేలాది పుస్తకాలకు ఊపిరిపోసి పునర్జన్మనిచ్చారు ఈ విశాఖ వాసి. తన సైకిల్ పై నగరంలోని గ్రంథాలయాల్ని సందర్శించి అక్కడ అట్టలు విడిపోయి, చిరిగిపోయి, కుట్లు తెగిన పుస్తకాలను పట్టుకెళ్ళి బాగుచేసి చదువరుల కోసం సిద్ధం చేస్తుంటారాయన. పుస్తకాలకు జీవంపోయడమేగాక పలు గ్రంథాలయాలకు ఎన్నెన్నో పుస్తకాల్ని తన స్వంత ఖర్చుతో సమకూర్చారు. తెలుగులో తొలి కార్టూనిస్ట్ అయిన తలిశెట్టి రామారావు గురించి పరిశోధన చేశారు. పుస్తకాలను కేవలం చదవడానికే పరిమితం కాకుండా, వాటి ద్వారా సముపార్జించిన జ్ఞానాన్ని ఆచరణలో పెట్టిన ధన్యజీవి ఈయన. 55 ఏళ్ళ కిందటే బాల వితంతువు అయిన తన మామయ్య కుమార్తెను వివాహం చేసుకుని ఆదర్శంగా నిలిచారు. పుస్తకాలనే కాదు సమాజాన్ని సైతం సంస్కరించే వైద్యుడయ్యారు రమణారెడ్డి.
Wednesday, February 29, 2012
శ్రీనివాసాచార్యులు.. హృదయం చలువపందిరి
సికింద్రాబాద్ అడిక్‌మెట్ వేదపాఠశాలలో గురువు, హబ్సిగూడ రామాలయం పూజారి శ్రీ గట్టు శ్రీనివాసాచార్యులు. సత్గ్రంథ పఠనంతో మనస్సును, వాటి నుంచి నేర్చుకున్న మంచిని సత్కార్యాచరణ ద్వారా అమలు చేయడం ద్వారా దేవుడిచ్చిన శరీరాన్ని పునీతం చేసుకున్నారాయన. మండువేసవిలో నగరంలోని వివిధ ప్రాంతాలకు బస్సుల్లో వచ్చిపోయేవారికి సూర్య(ప్ర)తాపం నుంచి ఉపశమనం కల్గిస్తూ ఎన్నో పందిళ్ళు స్వంత ఖర్చుతో వేయించారాయన.
"మానవ సేవే మాధవ సేవ" అని తండ్రి వెంకట నరసింహాచార్యులు చేసిన బోధననే శ్రీనివాసాచార్యులు తన బాటగా ఎంచుకున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల్లోని రాంనగర్, ఉప్పల్, అంబర్‌పేట్, మెట్టుగూ, చిరుగానగర్, నాగోలు, హిమాయత్ నగర్ తదితర ప్రాంతాల్లో ఈయన పాదచారులు, బాటసారులు, ప్రయాణీకుల కోసం పలు తాత్కాలిక చలువ పందిళ్ళు వేయించారు. ఆచార్యులుగారి ఈ చలువ పందిరి సేవలో ఆటో రవి, తడికెల బాలయ్య, మల్లేష్ అనేవారు తగినంత చేయూతనిస్తున్నారట.
ఒక్కో చలువ పందిరి వేయడానికి సుమారు రూ.వెయ్యి వరకూ ఖర్చవుతున్నదని, ఎవరైనా తనతో ముందుకొస్తే ఈ సేవను మరింత ఉధృతంగా చేద్దామని పిలుపు ఇస్తున్నారాయన. మిత్రులారా స్పందిస్తారుగా..

Friday, December 30, 2011
చెట్టు కాదు గోడనే పడగొట్టండి...
ఫ్రెంచ్ మొరాకోలో దర్శకుడు హెన్రీ తన "ది బ్లాక్ రోజ్" సినిమా తీస్తున్న రోజులవి. ఆ ప్రాంతంలో హథవే కెయిడ్ ఇబ్రహీం అనే వ్యక్తికి చెందిన ఒక అద్భుతమైన ప్యాలెస్ ఉంది. అందులో తన సినిమా షూటింగ్ కోసం ఇబ్రహీం అనుమతి కోసం హెన్రీ వచ్చాడు. తన ప్యాలెస్‌లో షూటింగ్ చేసుకోమని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే, ప్యాలెస్ ఆవరణలోకి కెమెరాలు, క్రేన్‌లు, భారీ లైట్లు, ఇతర సామాను తీసుకురావడానికి చెట్లు అడ్డు వస్తున్నాయి. ఇక ఆ చెట్లు కొట్టించడానికి అంగీకరించాలంటూ ఇబ్రహీంని కలిశాడు హెన్రీ.
చెట్లు కొట్టించవద్దు. కావాలంటే గోడ పడగొట్టుకోండి.. అన్నాడు ప్యాలెస్ యజమాని ఇబ్రహీం
చెట్లు కొట్టించడం చాలా తక్కువ ఖర్చుతో అయిపోతుంది. గోడ కూల్చడం, మళ్లీ కట్టించడం చాలా ఖర్చు వ్యవహారం కదా.. అన్నాడు దర్శకుడు హెన్రీ..
నాకున్న డబ్బుతో అలాంటి గోడలు ఎన్నయినా క్షణాల్లో కట్టిస్తాను. కానీ, చెట్లు పడగొడితే తిరిగి మొలిపించే శక్తి నాకు లేదు.. అంటూ గోడను కూల్చడానికే మొగ్గు చూపాడు పర్యావరణ ప్రేమికుడైన ఇబ్రహీం...
భారత పాలకులారా.. మీకు అర్థమయిందనుకుంటాను.
సౌజన్యం: శ్రీ మల్లాదిగారు..

Thursday, December 01, 2011
డాక్యుమెంటరీల పోలీస్..
గుంటూరు జిల్లా డిసిఆర్‌బిలో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ కొట్టె శ్రీహరి స్టయిలే వేరు. సమాజంలో జరుగుతున్న నేరాలపట్ల ప్రజలకు అవగాహన కల్పించి వారిని అప్రమత్తం చేయడానికి వినూత్న శైలిని ఎంచుకున్నారీయన. రకరకాల నేరాలపై డాక్యుమెంటరీలు నిర్మించి వాటిని ప్రదర్శించడం ద్వారా శ్రీహరి పౌరుల్ని అప్రమత్తం చేస్తుంటారు. ఈక్రమంలోనే 2007 పౌరులారా పారాహుషార్, 2009లో బతుకు బతికించు అనే రెండు లఘు చిత్రాలు నిర్మించి నేరాల నిరోధానికి తన వంతు సేవలందిస్తున్నారు. నకిలీ బాబాలు, వ్యసనాలు, గొలుసు దొంగలు, ప్రేమ మోసాలు, దురలవాట్లు, ర్యాగింగ్, బిస్కెట్ గ్యాంగులు లాంటివి ఈయన నిర్మించే లఘు చిత్రాల ఇతివృత్తంగా ఉంటాయి. జర్నలిజంలో ఎం.ఎ చేసిన శ్రీహరి తన ఈ లఘుచిత్రాలకు గాను 2001లో హైదరాబాద్ పోలీస్ డ్యూటీ మీట్‌లో బంగారు పతకాన్ని కూడా సాధించారు.
Monday, October 10, 2011
బ్లాగుతో బాగుపడిన జీవితం..
బ్లాగులు, ఇంటర్నెట్, చాటింగ్, బజ్.. ఈ పదాలు వింటూనే ఇవేమిటర్రా బాబూ అంటూ ముఖం చిట్లించుకునే ఒక వర్గానికి కనువిప్పు కల్గించాడు ఒక బ్లాగర్. అపూర్వ మానవత్వాన్ని ప్రదర్శించి బ్లాగులు తల్చుకుంటే జీవితాల్ని బాగుచేయవచ్చని నిరూపించాడు. అతనే కేరళకు చెందిన బ్లాగర్ సనల్ శశిధరన్. ఇతను తన బ్లాగు sanathanan.blogspot.com ద్వారా షరి అనే మహిళ ఆపరేషన్ కోసం లక్షలాది రూపాయల విరాళాలు సమకూర్చి సాయపడ్డాడు. ఆ వైనం ఏమిటంటే..
షరి, అనిల్ కుమార్ దంపతులు కేరళలోని కొల్లం పట్టణంలో నివసిస్తుంటారు. లుకేమియా వ్యాధితో బాధపడుతున్న షరికి తిరువనంతపురం ప్రాంతీయ క్యాన్సర్ చికిత్సా కేంద్రంలో వైద్యం చేయిస్తూ వచ్చారు. ఈమెకు కీమోథెరపీ, బోన్ మారో ట్రాన్స్‌ప్లాంటేషన్ కూడా జరగాల్సి ఉందని, ఇందుకోసం దాదాపుగా రూ.15 లక్షల మొత్తం అవసరమవుతుందని వైద్యులు చెప్పారు.
ఈ దంపతుల సమస్య గురించి తెలుసుకున్న శశిధరన్ తన బ్లాగ్ ద్వారా వీరి పరిస్థితిని Google buzz, Blogosphere, Facebook తదితరాల ద్వారా సైబర్‌వాసుల దృష్టికి తీసుకువచ్చాడు. సైబర్ మోసాలు మారుమోగుతున్న ప్రస్తుత తరుణంలో ఈ దంపతుల వాస్తవ స్థితిగతులకు సాక్ష్యంగా మెడికల్ రిపోర్ట్‌లు, వీరి కుటుంబ సభ్యుల ఫోటో, ఫోన్ నెంబర్, అనిల్ కుమార్ బ్యాంక్ ఖాతా వివరాలు తన బ్లాగ్ ద్వారా వెల్లడించాడు.
శశిధరన్ నిజాయితీని గమనించిన పలువురు బ్లాగర్లు వెంటనే స్పందించగా ఆ నోటా ఈ నోటా ఈ వార్త పాకి వందలాదిగా సాయమందించేందుకు ముందుకు వచ్చారు. వీరి ద్వారా సమకూరిన డబ్బు వివరాల్ని గూగుల్ స్ప్రెడ్ షీట్ ద్వారా ఎప్పటికప్పుడు అందరికీ తెలియజేసి పారదర్శకంగా మంచిపనిని నిర్వహించాడు.

Saturday, October 08, 2011
ఏమి రాజండీ... అధికారం ఉండదని తెలిసీ..
ఒక దేశానికి రాజంటే.. మందీమార్బలం, హద్దుల్లేని అధికారం, కోరుకున్నదల్లా క్షణాల్లో సమకూరే విలాసవంతమైన జీవితం. ఇలాంటి జీవితాన్ని తమంత తాముగా త్యాగం చెయ్యడానికి ఎవరైనా ముందుకొచ్చారా ?.. త్రేతాయుగంలో శ్రీరాముడు, తర్వాత బుద్ధ భగవానుడు తప్ప మరెవరూ గుర్తుకురావడం లేదు కదూ.. ఈ దివ్య పురుషుల జీవితాన్నే స్ఫూర్తిగా తీసుకుని వారి బాటలోనే నడిచాడు భూటాన్ దేశ రాజు జిగ్మే సింగ్యే వాంగ్‌చుక్.
భూటాన్‌లో తమ వంశం అధికారంలో ఉన్న రాచరిక వ్యవస్థ కంటే ప్రజాస్వామ్యమే ప్రజలకు మేలు చేస్తుందని నమ్మిన జిగ్మే సింగ్యే వాంగ్‌చుక్ 2008 కల్లా మహారాజు హోదాను వదులుకోవడానికి సిద్ధమని ముందే ప్రకటించాడు. తన ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవడానికిగాను 34 సూత్రాల రాజ్యాంగాన్ని రూపొందించి దీనిని ప్రతి ఇంటికీ పంపి ప్రజాభిప్రాయాన్ని సేకరించారు.
ఈ రాజ్యాంగం అమలులోకి వస్తే భూటాన్ రాజుకున్న అధికారాలన్నీ రద్దవుతాయి. మూడింట రెండొంతుల మంది పార్లమెంట్ సభ్యులు అంగీకరిస్తే రాజును తొలగించే అధికారాన్ని పార్లమెంట్‌కే ఉండేలా రాజ్యాంగాన్ని తయారు చేశారు జిగ్మే సింగ్యే వాంగ్‌చుక్. చివరికి 2006లో తన మహారాజుగా తప్పుకుని కుమారుడు జిగ్మే గేసర్ నంగ్యేల్ వాంగ్‌చుక్‌కు పాలనా బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడీయన తండ్రి ఆశయాలకు అనుగుణంగా భూటాన్ దేశాన్ని ప్రజాస్వామ్యం దిశగా నడిపిస్తూ ఎన్నికల చట్టాలు, భూసంస్కరణల అమలుకోసం పార్లమంట్‌లో జరిగిన చర్చలకు నేతృత్వం వహించారు.
పదవుల కోసం పాకులాడే నేటి రాజకీయ నాయకులు జిగ్మే సింగ్యే వాంగ్‌చుక్ గారి దగ్గర పనివారిగా చేరినా బాగుపడతారంటారా?..
ఈ రాజుగారి మరో గొప్పతనం ఏమిటంటే.. తాను అధికారంలో ఉన్నప్పుడు ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం పొగతాగడాన్ని నిషేధించాలని నిర్ణయించుకున్నారు. అయితే తనకూ ఈ అలవాటు ఉండటంతో పూర్తిగా దాని నుంచి బయటపడి అప్పుడు భూటాన్‌లో పొగతాగడంపై నిషేధం విధించారు.

Thursday, October 06, 2011
మాట నిలుపుకున్న జైలు వార్డర్
ఇచ్చిన మాట నిలబెట్టుకునే వారి సంఖ్య నానాటికీ క్షీణిస్తున్న నేటి తరుణంలో మాటకు కట్టుబడి మంచితనానికి ప్రతిరూపమై ఉన్న నాగభూషణం (55) లాంటి కొద్దిమందిని స్మరించుకోవలసిన బాధ్యత మనందరిదీను. ఇక ఆయనిచ్చిన మాటేమిటో.. దానిని ఎలా నెరవేర్చారో తెలుసుకోండి.
నాగభూషణంగారి గురించి నాకు తెలిసే సరికి ఆయన కడప సెంట్రల్ జైల్ వార్డర్‌గా పనిచేస్తున్నారు. 2003లో ఆయన విశాఖపట్టణం సెంట్రల్ జైల్‌లో పనిచేస్తున్నప్పుడు ఒక హత్యకేసులో జీవితఖైదు శిక్షకు గురైన దువ్వూరు రాజారావు అనే వ్యక్తి ఈ జైలుకు వచ్చాడు. రాజారావు కొడుకు దువ్వూరు నేతాజీ ఆ సమయంలో 10వ తరగతి ఫస్ట్ క్లాస్‌లో పాస్ అయ్యాడు. కొడుక్కి మంచి జీవితం ఇవ్వలేక తాను జైలుకు వచ్చానన్న బెంగతో రాజారావు తన వ్యథను జైల్ సూపరింటెండెంట్‌కు మొరపెట్టుకున్నాడు. ఆ సూపరింటెండెంట్‌గారు ఖైదీ రాజారావు కొడుకు నేతాజీకి సాయపడమని జైల్ వార్డర్‌గా ఉన్న నాగభూషణానికి చెప్పారు.
తన ఉన్నతాధికారి ఆదేశాల్ని శిలాశాసనంగా భావించిన వార్డర్ నాగభూషణం తన ఖైదీ రాజారావు కొడుకు నేతాజీ బాధ్యతల్ని పూర్తిగా నెత్తిన వేసుకున్నారు. సుమారు ఎనిమిదేళ్ళపాటు దాతల సాయం తీసుకుని నేతాజీ చదువు కొనసాగించేలా చేయూతనిచ్చారు. తన వంతుగా నేతాజీ కూడా కష్టపడి చదువుకుని ఇంటర్మీడియెట్ నుంచి ఎమ్మెస్సీ (ఆర్గానిక్ కెమిస్ట్రీ) వరకూ ఫస్ట్ క్లాస్‌లోనే పాస్ అయ్యి, ఒక ఆదర్శ విద్యార్థిగా నిలబడ్డాడు.
నేతాజీ చదువు కొనసాగించిన ఎనిమిదేళ్ళ కాలంలో వార్డర్ నాగభూషణం విశాఖపట్టణం నుంచి నెల్లూరు, తర్వాత కడప సెంట్రల్ జైల్‌కు బదిలీ అయ్యారు. అయితే ఎక్కడకెళ్ళినా నేతాజీ చదువు బాధ్యతను మాత్రం విస్మరించలేదాయన. అతనికి డబ్బు, వస్తువుల కొరత రాకుండా అండగా నిలిచారు. కాలేజీకి వెళ్ళడానికి సైకిల్ కూడా కొనిపెట్టారు. పోలీసుల వ్యవహారశైలి పట్ల నేటి సమాజంలో కొంత చిన్నచూపు ఉన్నప్పటికీ నాగభూషణం లాంటి ఎందరో ఆ శాఖలో మానవత్వానికి భూషణాల్లా ఉన్నారని తెలుసుకోవాల్సి ఉంది.
నాగభూషణం వ్యక్తిత్వాన్ని పరికిస్తే, స్వతహాగా గాయకుడు మాత్రమేగాక ఉత్తమ సామాజిక కార్యకర్తగా 1984 నుంచీ పలు పురస్కారాలు అందుకున్నారు. ఇప్పటివరకూ వివిధ సంస్థల నుంచి 17 వరకూ ప్రశంసాపత్రాలు పొందారు. అయితే, ఖైదీ రాజారావు కొడుకు నేతాజీ సమాజంలో ఉన్నత స్థానానికి ఎదగడమే తనకు అత్యంత సంతృప్తినిచ్చిందని చెప్పారాయన. ఇక నేతాజీ కూడా దేశ పౌరునిగా బాధ్యతల్ని నిర్వర్తించాలని మాత్రమే ఆకాంక్షించారు.

ఆదర్శ జంట గ్రామాలు.. కడప జిల్లా ప్రత్యేకం
జంట నగరాల పేర్లు విన్నాం గానీ ఈ జంట గ్రామాల కథేమిటా అనుకుంటున్నారు కదూ..! జంట నగరాలైన హైదరాబాద్, సికింద్రాబాద్నగరాలు ఒకదానికొకటి ఎంత ఆదర్శంగా ఉన్నాయో మనకు తెలీదుగానీ.. కడప జిల్లాలోని "ఎగువ కంచరపల్లి", "దిగువ కంచరపల్లి"జంట గ్రామాలు మాత్రం గత 50 ఏళ్లుగా మద్యపానం, పొగతాగడం లాంటి దురలవాట్లకు దూరంగా ఉంటూ ఈ జిల్లాకు "ఫ్యాక్షన్"ముద్రేమిటా? అని ముక్కున వేలేసుకునేలా చేస్తున్నాయి.
ఈ జంట గ్రామాల్లో ఉన్న దాదాపు 200 కుటుంబాలు భారతీయ సంప్రదాయ విలువల్ని ఆచరిస్తూ భవిష్యత్ తరాలకు వీటినేకానుకలుగా అందిస్తున్నాయి. 50 ఏళ్ళ క్రిందటే అప్పటి గ్రామ పెద్దలు ఊరి ప్రజలచేత దురలవాట్లకు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞచేయించడమేగాక ఈ ప్రతిన ఏ మాత్రం సడలకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు.
వ్యవసాయాన్నే ప్రధాన వృత్తిగా చేసుకున్న ఈ గ్రామాల్లో అగ్గిపెట్టె దొరుకుతుందిగానీ చుట్ట, బీడీ, సిగరెట్ కనిపించవు. బయటి ఊళ్ళనుంచి వచ్చే వారికి సైతం ఇవే నియమాలు వర్తిస్తాయి. తేడా వచ్చిందో "బొబ్బిలి బ్రహ్మన్న", "మర్యాద రామన్న"ల సమక్షంలో రచ్చబండ పంచాయితీలు, శిక్షలు తప్పవు.

మంచితనపు సిరులు... సిరియా పౌరులు
సిరియాలోని నియంత ప్రభుత్వం తమ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటున్న పౌరులపై కత్తిగట్టింది. ప్రత్యేకించి యువతులపై "రేప్" ఆయుధాన్ని ప్రయోగిస్తోంది. దీంతో జీవితకాలపు అవమానభారాన్ని మోయలేక కుంగిపోతున్న ఈ బాధితురాళ్ళను పెళ్ళి చేసుకుని అండగా నిలుస్తామని సిరియా యువకులు ముందుకొచ్చి తమలోని నిజమైన మానవత్వాన్ని చాటుకున్నారు.
సిరియాలోని క్రూర ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన షబియా మిలిషియా వర్గం ఆ దేశ మహిళలపై అత్యాచారాలకు ఒడిగడుతుండటంతో గౌరవంగా బతుకుతున్న కుటుంబాలు ఈ మహళలను పరువు హత్యలకు గురిచేస్తున్నాయి. సిరియా - టర్కీ సరిహద్దులో ఉన్న Jisr al-Shughur లాంటి పలు పట్టణాల్లో వేధింపులు, అత్యాచారాలకు గురైన 10 వేలమందికి పైగా సిరియా యువతులు టర్కీలోని శరణార్థి శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్నారు.
ఈ దారుణమైన పరిణామాల మధ్య సుమేరియా పట్టణంలో రేప్‌కు గురైన నలుగురు అక్కాచెల్లెళ్ళు టర్కీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. షుగౌర్ ప్రాంతానికి చెందిన ఇబ్రహీం కాయిస్ అనే వ్యక్తి ఇచ్చిన స్ఫూర్తితో మరికొందరు యువకులు ఇలాంటి యువతుల తెలుసుకుని కొత్త జీవితాన్ని అందించడానికి ముందుకొచ్చారు.
సిరియాలో ప్రభుత్వ అకృత్యాల గురించి ఇంతకంటే ఎక్కువ రాయలేను. ఆక్కడి పరిస్థితులపై మీకు ఆసక్తి ఉంటే ఈ లింక్ పైన క్లిక్ చేసి తెలుసుకోండి..

ఊరు కొత్తకర్ర.. అంధులకు ఊతకర్ర
విద్యల నగరంగా భాసిల్లుతున్న విజయనగరం జిల్లా మెరకముడిదాం మండలం కొర్ల పంచాయితీ పరిధిలోని కొత్తకర్ర గ్రామం అంధులకు ఊతకర్రగా మారింది. ఎందుకంటే ఈ గ్రామంలోని దాదాపు 100కు పైగా కుటుంబాలకు చెందిన సుమారు 400 మంది తమ మరణానంతరం నేత్రదానం చేయడానికి నిశ్చయించుకున్నారు. ఈ మేరకు వీరంతా సమ్మతి పత్రాలపై సంతకాలు చేసి "మానవీయత" అనే స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు గోవిందరాజులుకు వాటిని అందజేశారు. తమ మరణానంతరం కూడా మరెందరికో తమ అవయువాలు ఉపయోగపడతాయనేది తమకు ఎంతో ఆనందం కల్గించే విషయమని గ్రామవాసులు పేర్కొన్నారు.
విజయనగరం జిల్లాకే చెందిన పెదనాదిపల్లి, ఏనుగువలస (గరివిడి మండలం) గ్రామస్థులు కూడా ఇదే విధంగా నేత్రదానానికి ముందుకు వచ్చి మానవత్వాన్ని చాటుకున్నారు.
విజయనగరం జిల్లాకే చెందిన పెదనాదిపల్లి, ఏనుగువలస (గరివిడి మండలం) గ్రామస్థులు కూడా ఇదే విధంగా నేత్రదానానికి ముందుకు వచ్చి మానవత్వాన్ని చాటుకున్నారు.
సర్కారు బడిలో కలెక్టర్ కూతురు..
గుమస్తాలు సైతం తమ పిల్లల్ని కార్పోరేట్ బడుల్లో ఇంగ్లీష్ చదువులు చదివించాలని కలలు కంటున్న రోజులివి. అంతెందుకూ ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసేవారి పిల్లలు కూడా కార్పోరేట్ బడుల్లోనే కంప్యూటర్ కీబోర్డులపై వేళ్ళు టకటకలాడిస్తుంటారు. ఇలాంటి ఈ రోజుల్లో తమిళనాడు రాష్ట్రం ఈరోడ్ జిల్లా కలెక్టర్ ఆర్ ఆనందకుమార్ మాత్రం తన కూతుర్ని ప్రభుత్వ పాఠశాలలోనే చదివించాలని నిర్ణయం తీసుకుని అమలు చేసి ఎందరో అమ్మానాన్నలకు ఆశ్చర్యం కల్గించి ఆదర్శంగా నిలిచారు. ఈయన తన ఆరేళ్ళ కూతురు గోపికను కుమళంకుట్టై పంచాయితీ యూనియన్ ప్రైమరీ పాఠశాలలో రెండవ తరగతిలో చేర్చారు.
జిల్లాలో ఎన్నో "గొప్ప" ప్రయివేట్ పాఠశాలలున్నప్పటికీ, కలెక్టర్ ఆనందకుమార్ తన కుమార్తెను ప్రభుత్వ పాఠశాలలో చేర్చడం చాలా ఆనందం కల్గించిందని ప్రధానోపాధ్యాయిని ఎస్.రాణి సంతోషపడ్డారు. జిల్లా ముఖ్య విద్యాధికారి ఈ పరిణామంపై స్పందిస్తూ తమ ప్రభుత్వ బడులలో కార్పోరేట్ విద్యకు దీటుగా విద్యార్థుల్ని తీర్చిదిద్దుతున్నామని, కంప్యూటర్లను వినియోగించడంతోపాటు ప్రాయోగికంగా విద్యనందిస్తున్నామని చెప్పారు. ఈ పరిస్థితుల మధ్య కలెక్టర్ కుమార్తె సైతం ప్రభుత్వ పాఠశాలలో చేరడం ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు.
నిజానికి తమిళనాడులో జరిగిన ప్లస్ 2, ఎస్ఎస్ఎల్‌సి పరీక్షలలో అత్యధిక మార్కులు సాధించిన పలువురు విద్యార్థులు ప్రభుత్వ పాఠశాల నుంచి వచ్చినవారే. మరి మన రాష్ట్రం ఎప్పుడు మారుతుందో..

వీరి పేరు ప్రకాశం.. మానవతకు నివాసం
విజయనగరం జిల్లా రామభద్రపురం మండలం కొట్టక్కి గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు ప్రకాశరావు మానవత్వానికి మారుపేరుగా నిలిచి ఉపాధ్యాయ వృత్తికే వన్నె తెచ్చారు. చుట్టుపక్కల గ్రామాల్లోని పాఠశాలల్లో మహాత్మా గాంధీ విగ్రహాల్ని తన స్వంత ఖర్చుతో నెలకొల్పి మహాత్ముని ఆదర్శాలను చాటి చెబుతుంటారు. ఇంతవరకూ ఈయన చేతుల మీదుగా 125కు పైగా గాంధీ విగ్రహాల్ని ఏర్పాటు చేయించారు. విగ్రహాల ఏర్పాటుకే పరిమితం కాకుండా పేద కుటుంబాలకు సైతం చేదోడువాదోడుగా నిలిచి వారిళ్ళల్లో పెళ్ళిళ్ళు, శుభకార్యాలకు ప్రకాశరావుగారు తన వంతు చేయూతనిస్తుంటారు. సేవా కార్యక్రమాలు, విద్యార్థులకు ఉచితంగా పుస్తకాల పంపిణీ ఇవన్నీ ఈ మా...స్టార్ గారికి నిత్యకృత్యాలే..
పేరుకే అంధులు.. సేద్యంలో వీరులు
వరంగల్ జిల్లా నెక్కొండ మండలం రెడ్లవాడకు వెళ్ళి ఆ ఊరిలో ఆదర్శ జీవనం గడుపుతున్న రామనాథం, దశరథం సోదరుల్ని మనిషి జన్మ ఎత్తిన ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా కలుసుకోవాల్సిందే. 60 ఏళ్ళ పైబడిన ఈ ఇద్దరూ గుడ్డివారే. అయినప్పటికీ ఒకరికొకరు తోడుగా గత 35 సంవత్సరాలుగా రామలక్ష్మణుల్లా కలసిమెలసి వ్యవసాయం చేసుకుంటూ దిగుబడిలో ఆదర్శరైతులకే ఆదర్శంగా నిలుస్తున్నారు. తమ పొలంలోని సుమారు 30 గుంటల్లో ధాన్యం, పత్తి, పసుపు పంటలు వేసి మంచి దిగుబడి సాధించారు. పొలానికి నీరు పట్టడం, నాగలితో దున్నడం, బర్రెల్ని తోలుకెళ్ళడం, బస్తాల్లో ధాన్యం నింపడం, పొద్దుపోయాక మోటారు వేయడం లాంటి పనుల్ని చిన్నవయసులోనే తండ్రి ద్వారా నేర్చుకున్నారు. వీరికి ఎనిమిదేళ్ళ వయసున్నప్పుడు జ్వరం వచ్చింది. సరైన వైద్యం అందక దృష్టిని కోల్పోయారు. కళ్ళు లేకపోయినా చేతి వేళ్ళతో లోతు కొలిచి పంటకు ఇంకెంత నీరు కావాలో చెప్పగల సామర్థ్యం వీరి సొంతం. మరి ప్రభుత్వం వీరికి ఆదర్శ రైతు పురస్కారాల్ని ఎప్పుడిస్తుందో కదా..
Saturday, January 22, 2011
దాసరి భూమయ్య... మామూలు SI కాదు
ఒకప్పుడు రాజులు, మంత్రులు మారు వేషాల్లో రాజ్య సంచారం చేసి ప్రజా సంక్షేమం గురించి తెలుసుకునేవారట. ఎక్కడైనా లోపాలు, నేరాలు వారి దృష్టికి వస్తే పరిస్థితిని చక్కదిద్ది సమాజాన్ని గాడిలో పెట్టేవారట. ఇలాంటి వాటి గురించి మనం కథల్లోనే తెలుసుకున్నాం గానీ... నేటి కాలంలోనూ అలాంటివారున్నారన్న విషయాన్ని మీ దృష్టికి తీసుకురాదలిచాను. కరీంనగర్ జిల్లాలోని వెల్గటూరులో పోలీస్ సబ్ ఇనస్పెక్టర్‌గా పనిచేస్తున్న దాసరి భూమయ్యగారే ఆ వ్యక్తి. ఈయన్ని నేరుగా కలుసుకోవాలంటే కాస్త కష్టం కావచ్చు. ఎందుకంటే నేరాలకు పాల్పడే వ్యక్తులపై నిఘాపెట్టి, వారిని కటకటాల వెనక్కి నెట్టే క్రమంలో భూమయ్యగారు ఆటో డ్రైవర్‌గా, సైకిల్ మీద సామాన్లు అమ్ముకునే వ్యక్తిగా లేదా మరో రూపంలోనో తిరుగుతూ ఉంటారు.
భూమయ్యగారి విజయాల్ని గమనిస్తే... ఎన్నోమార్లు సాధారణ ప్రయాణీకుడిలా ఆటోల్లో ప్రయాణించి, పరిమితికి మించిన ప్రయాణీకులతో ప్రమాదకరంగా బండి నడుపుతూ వారి ప్రాణాలతో చెలగాటమాడే ఆటో డ్రైవర్ల భరతం పట్టారు. పత్తి విత్తనాలు కొంటానంటూ ఒక చోటికెళ్ళి నకిలీ విత్తనాలు అంటగట్టే వ్యాపారులను కోర్టు మెట్లెక్కించారు.
భూమయ్యగారు 2006లో బసంత్‌నగర్‌లో ఎస్ఐగా పనిచేసేటప్పుడు ఒక భూస్వామికి చెందిన భూమిలో కొందరు ఎర్ర జెండాలు పాతిపెట్టారు. ప్రభుత్వం సాయంతో వాటిని పీకించడమేగాక, ఆ భూస్వామిని ఒప్పించి కామన్‌పూర్, మంథని మార్గంలోని 80 శాతం మంది పేదలకు అధికారికంగా పంపిణీ చేయించారు. జీవితంలో ఒక కొత్తకోణాన్ని చూచిన ఆ పేదలంతా ఒక కాలనీ కట్టుకుని దానికి "దాసరి భూమయ్య కాలని" అని పేరు పెట్టుకున్నారు. అక్కడ భూమయ్యగారి ఛాయాచిత్రం కూడా కనిపిస్తుంది.

Thursday, December 23, 2010
బాజా మోత... లక్షల దాత...
మీరెప్పుడైనా అమృత్‌సర్ వెళ్ళి ఉంటే... మునాడీవాలా (బాజా మోగించే వ్యక్తి) ఉరఫ్ రామ్ లాల్ భల్లా గురించి చిల్లర దుకాణాలవారు, రిక్షావాలాల్ని అడిగి చూడండి. మెడలో బాజా మోగిస్తూ వీధుల వెంట ఏళ్ళ తరబడి తిరిగి తిరిగి స్వచ్ఛంద దాతలందరి నుంచీ విరాళాలు సేకరించి దాదాపు 20 లక్షల వరకూ (ఇంకా ఎక్కువ కావచ్చు...) దానం చేశారు. ఎవరికి దానం చేశారండీ అంటే... ఉగ్రవాద బాధితులు, అనాధలు, 1984లో జరిగిన సిక్కు వ్యతిరేక దాడుల బాధితులు ఇలా ఎవరున్నా వారందరికీ అందేలా చందాలు పోగేశారు. అమరుల కుటుంబాలకు చేయూతనిచ్చే లక్ష్యంతో సమాచార్ గ్రూపు వార్తాపత్రికల సంస్థ ఏర్పాటు చేసిన "షహీద్ పరివార్ నిధి"కి మన మునాడీవాలాగారు ఒక్కరే 1996 నాటికి 12 లక్షలిచ్చారు. ఆ నిధికి అంత మొత్తం ఇచ్చిన అతి పెద్ద దాత ఈయనే కావడం గమనార్హం. వీరి విరాళాల్లో కొంత మొత్తం ముంబై పేలుళ్ళ బాధితులకు, ఆంధ్రప్రదేశ్ తుఫాను బాధితులకూ అందింది.
1947లో జరిగిన దేశ విభజన కాలంలో లాహోర్ నుంచి అమృత్‌సర్‌కు వలస వచ్చిన రామ్ లాల్ భల్లా స్వాతంత్ర సమరయోధుడు, సామాజిక కార్యకర్త. నెల నెలా తనకు లభించే సమరయోధుల పింఛన్ మొత్తంలో కొంత భాగాన్ని కూడా తన విరాళాలకు జత చేసేవారు. తలపై అమృత్‌సర్ సంప్రదాయ టోపీ పెట్టుకుని, భుజానికి సంచీ, మెడలో బాజా తగిలించుకుని దానిని మోగిస్తూ అమృత్‌సర్ వీధుల్లో "వినండి స్నేహితులారా... వితంతువులు, అనాధలకోసం రామ్ లాల్ భల్లా లాహోర్‌వాలా మిమ్మల్ని చందాలు అడుగుతున్నాడు" అని నినదిస్తూ ముందుకు సాగిపోయేవారు. ఆయన గొంతు వినగానే ఆ వీధులగుండా వెళ్ళేవారు, దుకాణదార్లు, రిక్షావాలాలు సైతం స్పందించి ఎంతో కొంత మొత్తం భల్లాగారి సంచీలో వేస్తుండేవారు. 1986 నుంచి భల్లాగారు ఈ ఉద్యమాన్ని చేపట్టగా తనకు 105 ఏళ్ళు నిండిన తర్వాత కూడా ఈ సేవ కొనసాగించారు. ఈయన చందాలు ఎన్నెన్నో జీవితాల్లో కొత్తకోణాల్ని పూయించాయి.

Sunday, December 12, 2010
వృద్ధులు పాటించారు... డాక్టర్ అనుసరించారు
తమిళనాడులోని తిరునెల్వేలికి చెందిన వృద్ధ దంపతులు ఎస్ ఎస్ పళనియప్పన్ (80), మీనమ్మాళ్ (74) ఒక రోజున తిరునెల్వేలి వైద్య కళాశాల ఆసుపత్రికి వచ్చారు. మరణానంతరం అవయువదానంగా తమ దేహాల్ని ఈ ఆసుపత్రి వైద్య కళాశాల విద్యార్థుల పరిశోధనల నిమిత్తం సమర్పిస్తూ తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన పత్రాల్ని ఆసుపత్రి డీన్‌కు అందజేశారు.
పళనియప్పన్ గతంలో శంకరన్ కోవిల్ గ్రామంలో మెడికల్ స్టోర్ ఆపీసర్‌గా పనిచేసేవారు. మరణానంతరం వైద్య పరిశోధనల కోసం తమ దేహాల్ని దానంగా ఇవ్వాలని 40 ఏళ్ళ కిందటే నిర్ణయం తీసుకున్నామన్నారు. ఆయన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జీవితకాల సభ్యునిగానూ ఉన్నారు. అవయువదాన ప్రాధాన్యత గురించి తన భార్యతో చర్చించినప్పుడు ఆమెకూడా ఇందుకు సంతోషంగా ఒప్పుకుందని పళనియప్పన్ తెలిపారు. వీరి అభిమతాన్ని కుటుంబ సభ్యులంతా ఏ మాత్రం ప్రశ్నించక గౌరవించారట. ప్రచారం కోసం కాకుండా... అవయువదానం దిశగా మరిందరిని ప్రోత్సహించాలన్న ఆశయంతో తాము ఈ పని చేశామని వివరించారు.
ఇక పళనియప్పన్, మీనమ్మాళ్ దంపతుల ఔదార్యంతో చలించిపోయిన ఆసుపత్రి డీన్ ఎస్ రామగురు సైతం అప్పటికప్పుడే నిర్ణయం తీసుకుని తాను కూడా వారితోబాటే తమ ఆసుపత్రికి తన దేహాన్నీ మరణానంతరం అప్పగించేలా పత్రాలు సమర్పించేశారు. మరణించిన వ్యక్తుల నేత్రాలు, మూత్రపిండాలు, కాలేయం లాంటి అవయువాలు మరెందరికో జీవితాన్నిస్తాయని, సమాజంలో అవగాహన లేకపోవడంతో ఎందరో రోగులు వేదన చెందుతుండటం గురించి తనకు తెలుసని పేర్కొంటూ రామగురు ఆ వృద్ధుల్ని అనుసరించారు.

Monday, November 29, 2010
వైద్యం చేసి పాలబాకీ తీర్చిన డాక్టర్...
అమెరికాలోని ఉత్తర పెన్సిల్వేనియాలో ఓ రోజు ఓ పేదపిల్లవాడు ఇంటింటికి వెళ్ళి సామాను అమ్ముతున్నాడు. అలా అమ్మితే అతనికి వచ్చే కమీషన్‌తో స్కూలు ఫీజు కట్టుకోవాలి. అతను ఇంట్లోంచి బయలుదేరి చాలాసేపవడమే కాక చాలా దూరం వచ్చేశాడు. అతనికి బాగా ఆకలిగా వుంది. జేబులో చూసుకుంటే అయిదు పెన్నీల నాణెం మాత్రమే వుంది.
తనకి ఆకలిగా వుందని, తినడానికి ఏదైనా పెట్టమని అడుగుదామనుకుని ఆ కుర్రాడు ఓ ఇంటి తలుపు తట్టాడు. ఓ యువతి తలుపు తీసి అతని వంక ఏం కావాలన్నట్టుగా చూసింది. భోజనం అడగడానికి సిగ్గుపడడంతో ఆ పిల్లవాడు తనకి దాహంగా వుందని కొద్దిగా మంచినీళ్ళు ఇవ్వమని అడిగాడు.
ఆ యువతి అతన్ని లోపలికి ఆహ్వానించి ఓ గ్లాసు నిండా చిక్కని పాలు ఇచ్చి తాగమని నవ్వుతూ చెప్పింది.
పాలు మొత్తం తాగాక ఆ కుర్రాడు అడిగాడు. ఈ పాలకి నేను మీకు ఎంతివ్వాలి?...
నీకు బాగా ఆకలిగా వుందని నాకు తెలుసు కాబట్టి నువ్వడగకపోయినా నా అంతట నేనే నీకు పాలు ఇచ్చాను. కనుక ఏం ఇవ్వక్కర్లేదు.. చిరునవ్వుతో చెప్పిందా యువతి.
ఏదీ ఉచితంగా తీసుకోవద్దని మా అమ్మ నాకు చెప్పింది. అందుకని మీకు నేను నా హృదయంలోంచి కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను.. అని చెప్పి ఆ కుర్రాడు వెళ్ళిపోయాడు.
కొన్ని సంవత్సరాల తర్వాత ఆ యువతికి జబ్బు చేసింది. ఆ గ్రామంలోని డాక్టర్లకి ఆమె రోగం గురించి అర్ధం కాకపోవడంతో దగ్గరే వున్న ఓ పట్టణంలోని హాస్పటల్‌కి ఆమెని పంపిచారు. ఆ హాస్పటల్లో పనిచేసే డాక్టర్ హావార్డ్ కెల్లీ అనే డాక్టర్‌కి ఆమె కేస్ అప్పగించారు. కేస్ షీట్ అందుకున్న ఆ డాక్టర్‌కి ఆమె స్వగ్రామం పేరు చూడగానే ఆసక్తి కలిగింది. వెంటనే వార్డులోకి వెళ్ళి రోగిని చూశాడు. వెంటనే గుర్తుపట్టాడు. తను చిన్నపిల్లవాడుగా వుండగా ఆకలిగొన్న ఓ మధ్యాహ్నం తనకి పాలు ఇచ్చి కడుపునింపిన యువతే ఆవిడ.
ఆ రోజునుంచి కెల్లీ ఆవిడకి ప్రత్యేక శ్రద్ధతో చికిత్స చేశారు. కొద్ది రోజుల్లోనే ఆవిడ జబ్బు నయం అయి హాస్పటల్ నుంచి డిశ్చార్జి అయింది. డాక్టర్ హావార్డ్ కెల్లీ కోరిక ప్రకారం అకౌంట్సు విభాగం వాళ్ళు ఆవిడ మెడికల్ బిల్‌ని ముందుగా ఆయన దగ్గరికి పంపారు. తర్వాత ఆవిడకి పంపారు.
ఎంత బిల్లు చెల్లించాలో అనే భయంతో ఆవిడ దానివంక చూసింది. బిల్లు మీద పెద్దక్షరాల్లో రాసిన పదాలు, కింద సంతకం చూసిందావిడ.
పెయిడ్ ఇన్ ఫుల్ విత్ ఒన్ గ్లాస్ ఆఫ్ మిల్క్... అన్న వాక్యాల కింద డాక్టర్ హావార్డ్ సంతకం వుంది.
అమెరికాలో సుప్రసిద్ధ వైద్యుడైన డాక్టర్ హావార్డ్ కెల్లీ (1858 - 1943) వైద్య ప్రపంచానికే ఆదర్శప్రాయుడు.
సౌజన్యం: శ్రీ మల్లాదిగారు

Tuesday, October 26, 2010
అంకవికలుడు... పేదల కంటి జోడు
విజయవాడలోని అరుండేల్ పేటలో ఆప్టికల్ షాపు నడిపే 50 ఏళ్ళ మహ్మద్ అయూబ్ ఖాన్ అంటే పేదలపాలిటి కంటి చూపుగా మెలగుతూ సేవలందిస్తున్నారు. తన 12వ ఏట బడికి వెళుతున్నప్పుడు జరిగిన ప్రమాదంలో కుడికాలు పోగొట్టుకున్న ఈయన జైపూర్ కాలుతో నడుస్తున్నారు. ఆ ప్రమాదం జరిగినప్పుడు తన వద్ద 2,000 రూపాయలు ఉండి ఉంటే ఆ కాలు పోకుండా రక్షించుకునేవాడినని అంటుంటారాయన. అప్పట్లో ఆయనకు డబ్బులేనందువల్ల చికిత్స పొందలేక కాలు పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఈ సంఘటనే ఈయన జీవితాన్ని మలుపుతిప్పింది. తర్వాతికాలంలో జీవితంలో స్థిరపడి ఆప్టికల్ షాపు పెట్టుకున్నారు. తాను సైతం ఇతరులకు చేయూతనివ్వగలనన్న విశ్వాసం చేకూరాక నేత్ర సమస్యలతో బాధపడే పేదలకు అండగా ఉంటూ వస్తున్నారు అయూబ్. ఈయన సేవలు ఏమిటంటే....
కంటి సమస్యలున్న పేదవారి నుంచి ఎలాంటి రుసుమూ తీసుకోకుండా ఆయూబ్ పరీక్షలు చేయిస్తారు. వారికి ఉచితంగా కంటి అద్దాలు సమకూర్చుతారు. తన వద్దకు వచ్చినవారి ఆర్థిక పరిస్థితిని బట్టి ఫ్రేమ్‌కు మాత్రం డబ్బు తీసుకుంటారు. వారు ఇవ్వలేకుంటే అదీ పుచ్చుకోరు. అయూబ్ సేవలకు ఆయన కుమారులు చేయూతనిస్తుంటారు. ఈ ఉచిత కంటి పరీక్షలు, కళ్ళద్దాల పంపిణీ గురించి నగరంలోని ముఖ్య కూడళ్ళలో ప్రచారం చేస్తూ కరపత్రాలు పంచుతుంటారు.
ప్రస్తుతం ఎందరో నిరుపేదలు కంటి సమస్యలతో బాధపడుతున్నారని, ముఖ్యంగా వృద్ధులైన పేదవారి కళ్ళద్దాలు విరిగిపోయి ఉన్నప్పటికీ (ఏనాడో కొనుక్కున్నవి) డబ్బులేక వాటినే వాడుకుంటూ ఉంటారని, వాటికి పవర్ కూడా ఉండదని నేటి పరిస్థితిని అయూబ్ వివరించారు.

Tuesday, October 19, 2010
జ్ఞాననేత్రుని కలం నుంచి భీమాయణం
మధ్యప్రదేశ్‌కు చెందిన వేద పండితుడు, సంస్కృత ఉపాధ్యాయులైన ప్రభాకర్ జోషి వయసు 84 ఏళ్ళు. గ్లకోమా వ్యాధికారణంగా అంధత్వానికి గురైన జ్ఞాన నేత్రుడు. అయినప్పటికీ సుమారు తన 78 ఏళ్ళ వయసులో ఒక లక్ష్యాన్ని పెట్టుకుని సాధించారు. అదేమిటంటే... భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ జీవిత చరిత్రను సంస్కృతంలో రచించడం. 2004లో ఈ బృహత్కార్యాన్ని చేపట్టిన జోషీ మొత్తం 1,577 సంస్కృత శ్లోకాలతో 2010లో "భీమాయణం" పేరిట మన రాజ్యాంగ నిర్మాత జీవిత చరిత్రను పూర్తి చేశారు.
ఇక్కడొక ఆసక్తికరమైన అంశం ఏమిటంటే... డాక్టర్ అంబేద్కర్‌కు సంస్కృతం నేర్పించాలని ఆయన తండ్రి రాంజీకి ఎంతో కోరికగా ఉండేదట. అయితే, ఒకప్పుడు దళితులకు దూరంగా ఉన్న సంస్కృత భాషలో నేడు అంబేద్కర్ చరిత్ర వెలువడటం నిజంగా విశేషమే. ప్రతిష్ఠాత్మక "మహాకవి కాళిదాస్" అవార్డు గ్రహీత అయిన జోషీకి అట్టడుగు వర్గాల సంక్షేమం కోసం పాటుపడిన అంబేద్కర్ అంటే ఎంతో అభిమానం. అంబేద్కర్ చరిత్రను అధ్యయనం చేస్తున్నప్పుడు తెలుసుకున్న కొన్ని వాస్తవాల నుంచి జోషీ గారూ స్ఫూర్తి పొంది "భీమాయణం" రచనకు శ్రీకారం చుట్టారు.

Wednesday, September 29, 2010
జీవితాల్ని అల్లే వాసుదేవన్...
తమిళనాడులోని పుణ్యక్షేత్రమైన కాంచీపురానికి సమీపాన కోటైకాల్ వాసి వాసుదేవన్ (45). ఈయనకు నాలుగున్నరేళ్ళ వయసున్నప్పుడు మశూచి వ్యాధి సోకి కళ్ళుపోయాయి. అదీగాక పిన్న వయసులోనే అమ్మానాన్నలు మరణించారు. ఇక మిగిలిన ఏకైక తోడు తన చెల్లెలే. ఒక పక్క అంధత్వం, మరోపక్క పేదరికం, ఆ పైన చెల్లెలి పోషణ భారం. ఎలాగో శ్రమకోర్చి చెన్నై పూందమల్లి అంధుల పాఠశాలలో 10 తరగతి చదువుకున్నారు. పూర్తిగా కష్టాలు అల్లుకున్న తమ అన్నాచెల్లెళ్ళ జీవితాల్ని గడిపేందుకు వైరు కుర్చీల అల్లిక పని నేర్చుకున్నారు. సాధారణంగా ఇలాంటి కష్టాలు ఉన్నవారి జీవితాల్లో కనిపించే ఉమ్మడి దృశ్యం ఇదే. కానీ వాసుదేవన్ అక్కడితో ఆగిపోలేదు. తనకు ఈ మాత్రం జీవితాన్నిచ్చిన సమాజం కోసం తనవంతు ఏమైనా చెయ్యాలని సంకల్పించారు. దాంతో సామాజిక కార్యక్రమాల్లో పాల్గొని అక్షరాస్యత ఆవశ్యకతను తెలియజెప్పడం మొదలుపెట్టారు. ఖాళీగా ఉన్నప్పుడు సమీప గ్రామాల్లో తిరుగుతూ చదువుకోవాల్సిన అవసరం గురించి స్థానికులకు బోధిస్తుంటారు. పల్లె ప్రజలు వారి పిల్లల్ని చిన్నతనంలోనే పనులకు పంపిస్తుండటం వల్ల గ్రామీణ బాలలు చదువుకు, బాల్యానికి దూరమై జీవితాల్ని చిదిమేసుకోవడం వాసుదేవన్‌ను కలచివేసింది. అందుకనే వాళ్ళ జీవితాల్ని కూడా అల్లే పనిలో పడ్డారు. వాసుదేవన్ వల్ల ఎందరో బాలల జీవితాల్లో కొత్త కోణాలు ఉదయించాయి.
Friday, August 27, 2010
టీ ప్రిపరేషన్ టూ బ్లడ్ డొనేషన్
అతను టీ పోస్తాడు. రక్తం ధారపోస్తాడు. ఎలాగో తెలుసుకోండి...
ఒరిస్సా... కటక్ నగరం... బక్సీ బజార్. తెలతెలవారింది. అక్కడే ఉన్న ప్రకాశరావు టీ కొట్టు జనంతో కళకళలాడుతోంది. ఈ ఊళ్ళో మసాలా టీ అంటే ఎవరైనా ప్రకాశరావు కొట్టుకే రావాలి. సలసల కాగే టీ గ్లాసులు పట్టుకున్న జనంతో దుకాణం కళకళలాడుతున్నా... కాసులతో గల్లాపెట్టె గలగలమంటున్నా ఆ యజమానికింకా సంతృప్తి కలగలేదు. అంతలో ఒక ఫోనొచ్చింది. లుకేమియాతో బాధపడుతున్న ఏడేళ్ళ అబ్బాయికి రక్తం వెంటనే కావాలని దాని సారాంశం. "ఇదీ అసలైన పని" అంటూ రంగంలోకి దిగారు ప్రకాశరావు.
ప్రకాశరావుగారు తన ఫోనందుకుని మరో ఇద్దరికి ఫోన్ కొట్టారు. 15 నిమిషాల్లో ఇద్దరు కుర్రాళ్ళు అతని దగ్గరికొచ్చి అడ్రెస్ తీసుకుని రక్తం ఇవ్వడం కోసం రక్తనిధి (బ్లడ్ బ్యాంక్) కి వెళ్ళిపోయారు. ఆ కుర్రాళ్ళు ఎవరంటే... ప్రకాశరావు ఏర్పాటు చేసిన రక్తదాతల బృంద సభ్యులు. వీరిలో రకరకాల బ్లడ్ గ్రూపులున్న వ్యక్తులున్నారు. ప్రకాశరావు పిలుపు అందుకుని స్వచ్ఛందంగా ఈ బృందంలో చేరారు.
కటక్‌లోని ఎస్ సి బి వైద్యకళాశాల - ఆసుపత్రి (ఒరిస్సాలోని అతిపెద్ద వైద్య సంస్థ)కి వాళ్ళ వైద్యులకంటే ప్రకాశరావు చాలా ముఖ్యమైన వ్యక్తి. కనీసం ప్రతి 10 రోజులకొకమారు తన బృంద సభ్యుల ద్వారా రక్తమిప్పిస్తూ లెక్కకు మిక్కిలిగా రక్తం ధారపోసి వైద్యులకు, రోగులకు కావలసిన మనిషయ్యారు. తాను మాత్రమేగాక మరెందరినో రక్తదానం దిశగా ప్రేరేపించి, రకరకాల బ్లడ్ గ్రూపులున్న దాతల వివరాల్ని సేకరించి సేవ చేస్తున్న ప్రకాశరావును ఒక సంస్థగా చెప్పుకోవచ్చు.
అసలు ఇది ఎలా మొదలైందంటే... 1978లో ఒకసారి ప్రకాశరావు వెన్నెముకలో కణితి ఏర్పడినప్పుడు ఎస్ సి బి వైద్యకళాశాలలో చికిత్స పొందుతూ మూడు నెలలు అక్కడే ఉన్నారు. చికిత్సకు అవసరమైన రక్తం లేక చనిపోయేవారిని కళ్ళారా చూస్తూ... వారి బాధను తన బాధలా అనుభవించి ఇక తానుకూడా రంగంలోకి దిగాలన్న నిర్ణయానికి వచ్చేశారు. తర్వాత తాను కోలుకుని ఆ ఆసుపత్రి నుంచి బయటపడినప్పటికీ... రక్తదాతగా రోజూ అక్కడికెళ్ళి రోగులపాలిట రక్తదాతగా, ప్రాణదాతగా మారారాయన.
రక్తదానమొక్కటే ప్రకాశరావు వ్యాపకం కాదు. మురికివాడల చిన్నారుల కోసం ఒక పాఠశాల ఏర్పాటు చేసి వారికి ప్రాథమిక విద్యను అందిస్తున్నారు. టీ దుకాణం నుంచి ఆయనకు వచ్చే రోజువారీ ఆదాయం 500 రూపాయలు. అందులో 150 రూపాయలు ఈ పిల్లల చదువులు, అనాథలకోసం ఖర్చు చేస్తారు. ఈ సేవలో ప్రకాశరావు భార్యా పిల్లలు సైతం ఆయనకు చేదోడుగా ఉండటం తన జీవితంలోని మరో కొత్తకోణంగా ఆయన చెబుతారు.
టీ ప్రిపరేషన్ టూ బ్లడ్ డొనేషన్ అంటే... ఇదీ.

Monday, August 23, 2010
టవర్స్‌కు అందని ప్రేమ... లెవిస్‌పోర్ట్ ఆతిథ్యం
అమెరికాలో ట్విన్ టవర్స్‌ను నేలకూల్చిన భయానక ఉగ్రవాదదాడి జరిగిన సెప్టెంబర్ 11 (9/11) వ తేదీని మానవాళి ఏనాడు మర్చిపోలేదు. అయితే ఇదే రోజున అమెరికాలోని కొన్ని వేలమందికి "ప్రేమ"ను పంచి ఇచ్చిన సంఘటన జరిగింది. అదేంటో తెలుసుకుందాం. ఆ రోజున ఈ ఘోరం జరిగిన సమయంలో విదేశాల నుంచి వచ్చే విమానాలు అమెరికాలో దిగడానికి అనుమతివ్వలేదు. అమెరికాలో తిరుగుతున్న చాలా విమానాల్ని మధ్యలోనే ఎక్కడికక్కడ సమీప విమానాశ్రయాల్లో అప్పటికప్పుడే ప్రభుత్వం దింపించేసింది. ఈ క్రమంలో న్యూ ఫౌండ్‌లేండ్ వద్ద జేండర్ అనే చిన్న ఊరికి సమీపాన గల విమానాశ్రయంలో సుమారు 55 విమానాలు దిగి అక్కడే ఆగిపోయాయి. వాటన్నిటిలో కలిపి 10,500 మంది ప్రయాణీకులున్నారు. వీరంతా ఉన్నట్టుండి దిగిన జేండర్ గ్రామ ప్రజల సంఖ్య 10,400. ఆ ఉరి ప్రజల సంఖ్యకు సమానంగా ఉన్న విమాన ప్రయాణీకులకు తగినన్ని హొటళ్ళు, సదుపాయాలు ఆ ఊరిలో అంతగా లేవు. దాంతో డెల్టా ఎయిర్‌లైన్స్‌కు చెందిన కొందరు ప్రయాణీకుల్ని అక్కడికి 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న లెవిస్‌పోర్ట్ అనే మరో ఊరికి పంపారు.
ఈ అతిథుల కోసం లెవిస్‌పోర్ట్ గ్రామస్తులు స్కూళ్ళకు సెలవులిచ్చి, కమ్యూనిటీ హాళ్ళలో బస ఏర్పాటు చేశారు. విమానప్రయాణీకులందరిని సౌకర్యంగా ఉంచేందుకుగాను మంచాలు, స్లీపింగ్ బ్యాగ్స్, దిళ్ళు, దుప్పట్లు అందించారు. ఇంకా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నారంటే ముసలివారు, గర్భవతులు, రోగులకు ఆసుపత్రికి సమీపంలోను, ఆడవారికి తోడుగా ఆడవారే ఉండేలా, కుటుంబ సభ్యులంతా ఒకచోటే ఉండేలా బస ఏర్పాటు చేశారు. వీరికోసం రాత్రివేళల్లోనూ బేకరీలు, హోటళ్ళు తెరిపించారు. స్కూళ్ళలో ఉన్నవారికోసం లెవిస్‌పోర్ట్ ప్రజలు స్వయంగా వంట చేసిపెట్టారు. ఈ ప్రయాణీకులు అక్కడెన్నాళ్ళుంటారో తెలియదు. అయినా విసుగుచెందక వారికి కాలక్షేపం కోసం చుట్టుపక్కల అటవీ ప్రాంతాలకు ఎక్స్‌కర్షన్స్, పడవ ప్రయాణాలు ఏర్పాటు చేశారు.
అతిథులు లాండ్రి మేట్‌లకు వెళ్ళి దుస్తులు ఉతుక్కోవడానికి ఉచితంగా టోకెన్లు ఇచ్చారు. వీరికి ఇబ్బందులు కలుగకుండా స్కూల్ స్టూడెంట్స్‌ని స్వచ్ఛంద సేవకులుగా ఏర్పాటు చేశారు. మొత్తం మీద ఎలాంటి ఇబ్బందీ లేకుండా అన్నిరకాలుగా సాయం చేసారు. ఒక రెండుమూడు రోజులు గడిచాక విమానాలు ఒకొక్కటిగా వెళుతున్నాయి. ఏ ఒక్కరూ ఫ్లయిట్ మిస్ కాకుండా అందర్నీ జాగ్రత్తగా విమానాలు ఎక్కించారు.
ఇలా వెళుతున్న విమానాల్లో ఫ్రాంక్‌ఫర్ట్ విమానం ఒకటి. ఇందులోని ప్రయాణీకులంతా కలసి తమకు ఆతిథ్యమిచ్చిన లెవిస్‌పోర్ట్ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేయాలని నిర్ణయించుకున్నారు. వెంటనే డెల్టా 15 (తమ విమానం నెంబర్) ట్రస్ట్ పేరిట ఒక ఫండ్ ఏర్పాటు చేశారు. తాము బస చేసిన స్కూలు విద్యార్థులు కాలేజీలో చేరడానికి వీలుగా స్కాలర్‌షిప్ ఇచ్చే ఏర్పాటు చేశారు. ఈ ప్రతిపాదన చేసిన ఒక ప్రయాణీకుని కంపెనీ మరి కొంత మొత్తం సాయం చేసింది. ఈ సంగతి తెలిసిన డెల్టా ఎయిర్‌లైన్స్ సంస్థ ఇంకొంత మొత్తం చేర్చింది. ఈ చక్కని ఆలోచన గురించి పత్రికలు, టీవీల ద్వారా తెలుసుకున్న మిగిలిన విమానాల్లోని ప్రయాణీకులు తమ వంతుగా డబ్బు పంపారు. దీంతో ఒక పెద్ద ఫండ్ ఏర్పడి లెవిస్‌పోర్ట్ విద్యార్థులకు సాయం అందుతోంది. నేటికీ ఆనాటి విమాన ప్రయాణీకులు వారి పుట్టినరోజు, పెళ్ళిరోజుల్లో ఈ ఫండ్‌కు డబ్బు పంపుతూ చేయూతనిస్తూ విద్యార్థుల జీవితాల్లో కొత్తకోణాల్ని పూయిస్తున్నారు. కూలిన ట్విన్ టవర్స్ కంటే ఎత్తయిన కట్టడాలు ప్రపంచంలో ఎన్నో ఉండవచ్చుగాక... వాటన్నిటికీ అంతనంత ఎత్తయింది తమ ప్రేమ అని ఇరువురూ చాటారు.
సౌజన్యం: శ్రీ మల్లాదిగారు.

Monday, July 26, 2010
మొక్కలు మొక్కే మనిషి
ఖమ్మం జిల్లావాసి దరిపల్లి రామయ్య ఎప్పుడు కనిపిస్తాడా.. ఆయనకు ఎప్పుడు మొక్కుదామా అని చెట్లన్నీ ఎదురు చూస్తున్నాయి. ఆయన్ని తమ కొమ్మలతో కావలించుకుని.. స్పృశించి తరించాలని తరులన్నీ ఆశపడుతుంటాయి. అయన తన తలకు "వృక్షో రక్షతి రక్షితః" అన్న నినాదం రాసి ఉన్న ఒక చక్రంలాంటి అట్టను తలకు ధరించి, మొక్కలతో సైకిల్ మీద ఊరూరూ తిరుగుతూ వాటిని పెంచమని అందరికీ పంచుతూ ఉంటాడు. మొక్కలు, చెట్లు... వాటి ఉపయోగాలపై చిన్నప్పుడెప్పుడో తన గురువుగారు చెప్పిన పాఠాన్ని గుర్తుంచుకుని ఈ సత్కార్యానికి పూనుకున్నారు రామయ్యగారు. మొక్కలు పంచడమేగాక వాటిని గురించి వనసూక్తులు, పాటలు రచించి గానం చేస్తుంటారు. తన జీవితకాలంలో కనీసం కోటి మొక్కలు నాటాలన్నది ఆయన లక్ష్యం. రామయ్యగారి కోరిక నెరవేరాలని మనమంతా కోటి దేవతల్ని వేడుకుందాం. ఇక రామయ్యగారి భార్యామణి (పేరు తెలియదు) కూలి పని చేసుకుంటూ తన భర్త ఉన్నతాశయానికి అండగా నిలుస్తున్నారు.
Monday, May 31, 2010
అంగదాతా జయీభవ
వికలాంగుడైన గూడూరి నలినేష్ బాబు (45) గుంటూరు జిల్లా మందడం గ్రామవాసి. తనకు పాదాలు లేకపోయినా... తనలా పాదాల్లేని వేలాదిమందికి కృత్రిమ పాదాలందించి పాదదాతగా వారి జీవితాల పాలిట ప్రాణదాత అయ్యారు. నలినేష్ బాబుకు 12 ఏళ్ళ వయసున్నప్పుడు జరిగిన రోడ్డు ప్రమాదంలో రెండు కాళ్ళూ పోయాయి. నలినేష్ తల్లిదండ్రులు ఆయనకు కృత్రిమ పాదాలు అమర్చడం కోసం ఏటా జైపూర్ తీసుకెళ్ళి 7,000 రూపాయలకు పైగా ఖర్చుపెట్టేవారు.
తర్వాత వీరి కుటుంబం విజయవాడలో స్థిరపడింది. అక్కడే సిద్ధార్థ కాలేజీలో బీకాం పూర్తి చేసుకున్న నలినేష్‌కు ఒక ఆలోచన వచ్చింది. అదేమిటంటే... ఏటా జైపూర్ వెళ్ళి వేలాది రూపాయలు ఖర్చు పెట్టే బదులు తనే స్వయంగా కృత్రిమ పాదాల్ని తయారు చేసుకోవడం. వెంటనే జైపూర్ వెళ్ళి కృత్రిమ పాదాల తయారీలో 6 నెలలు శిక్షణ పొందారు.
అనంతరం భారత్ వికాస్ పరిషత్ అనే స్వచ్ఛంద సంస్థలో చేరిన నలినేష్ అక్కడ 'కృత్రిమ పాదాల పరిశోధన - అభివృద్ధి' విభాగంలో 15 ఏళ్ళు పనిచేశారు. ఇప్పుడాయన విజయనగరం జిల్లా కొత్తవలస మండలంలో మంగళం గ్రామంలో ఉన్న గురుదేవా ఛారిటబుల్ ట్రస్ట్ వైస్ ఛైర్మన్‌గా ఉన్నారు.
ఇంతవరకూ నలినేష్ సుమారు 17,000కు పైగా కృత్రిమ పాదాల్ని తయారు చేయగా వాటిని భారత్ వికాస్ పరిషత్ ద్వారా ఉచితంగా పంపిణీ చేశారు. ఇదే విధమైన సేవ గురుదేవా ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా కూడా జరిగింది. వికలాంగుల సౌకర్యం కోసం ఈ కృత్రిమ పాదాలకు ఇంటర్ లాక్ సిస్టంను పరిచయం చేసిన ఘనత ఈయనదే. అన్నట్టు... నలినేష్ కృత్రిమ పాదాలతో నడుస్తున్నవారిలో ఆయన చిన్ననాటి స్నేహితుడు అయూబ్ ఖాన్ కూడా ఉన్నారు.
అంగవికలురకు చేస్తున్న సేవలకుగాను నలినేష్‌ను రాష్ట్రపతి, ముఖ్యమంత్రుల చేతుల మీదుగా జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలెన్నో వరించాయి. కృత్రిమ పాదాలతో ఎందరినో నడిపిస్తూ వారి జీవితాల్లో కొత్తకోణాల్ని ఆవిష్కరిస్తున్న అంగదాతా జయీభవ... సుఖీభవ....

Friday, April 30, 2010
నరికినందుకు నాటే శిక్ష
సుందర్ వాసుదేవ అనే పెద్ద మనిషి తన చిన్న మనసుతో 2003లో తాజ్‌పూర్ అనే గ్రామంలో 42 పీపల్ చెట్లను నేలకూల్చాడు. ఆయన ఢిల్లీ నగర వాసి. వాసుదేవ చేసిన తప్పును తీవ్రంగా పరిగణించి ఆయనపై "వృక్ష పరిరక్షణ చట్టం" కింద కేసు పెట్టారు. మామూలుగా అయితే ఆయన చేసిన తప్పుకుగాను ఆ చట్టం నిబంధనల మేరకు జరిమానా విధిస్తారు. అయితే ఢిల్లీలోని ఒక న్యాయస్థానంలో ఈ కేసు విచారణకు వచ్చినప్పుడు న్యాయమూర్తి దేవేందర్ కుమార్ భిన్నమైన శిక్షను విధించారు. అదేంటంటే... నరికిన ఒక్కో చెట్టుకూ పరిహారంగా ఐదేసి మొక్కల చొప్పున నాటాలి. అంటే వాసుదేవ మొత్తం 210 మొక్కలు నాటాలన్నది ఈ శిక్ష సారాంశం. అంతేగాక ఆయన ప్రవర్తనపై నిఘా ఉంటుందని, ఆరునెలల పాటు పరిశీలనలో ఉంటారని తెలియజేసి ప్రొబేషన్ మీద విడిచిపెట్టారు. ప్రాణవాయువునిచ్చి మానవాళి ప్రాణాలు కాపాడే వృక్ష దేవతల్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పిన ఈ న్యాయమూర్తిగారు వనదేవతల జీవితాల్లో కొత్తకోణాలు పూయించిన పుణ్యమూర్తి.
Tuesday, March 30, 2010
కూలీల బండిలో అన్నమ్మూట
మీరెవరైనా కర్నూలు జిల్లాలో ఉన్న కృష్ణాపురం వెళితే అక్కడ ఓ పేద జంట కనిపిస్తుంది. వాళ్ళు బండి మీద రోజూ ఒక మూట పట్టుకెళుతుంటారు. ఎవరి కోసమో వెదుకుతుంటారు. అదేదో కూలిపని కోసం మోసుకెళ్ళే మూట అనుకుంటే మీరు పొరబడినట్లే... అదేమిటంటే... ఓ బండెడు అన్నం మూట. ఎవరికంటే, దారిలో ఏ జంతువు కనిపిస్తే దానికే. వీరు కొన్నేళ్ళుగా ఈ అన్నదాన యజ్ఞం చేస్తున్నారు. అన్నదాతా సుఖీభవ.
Saturday, February 27, 2010
కరెన్ చదువు మానలేదు...
ఇది చాలా రోజుల కిందటి సంగతి. అమెరికాలోని న్యూజెర్సీలో ఉన్న ప్రిన్స్‌టన్ అనే ఊరిలో ఒక ప్రాథమిక పాఠశాల ఉంది. అక్కడి విద్యార్థులంతా తమ బడిని అందంగా తీర్చిదిద్దుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. అందులో ఒకటి అందమైన పూల మొక్కల్ని నాటడం. ఇందుకోసం నిధులు సేకరించాలని నిర్ణయించారు. పిల్లలంతా వారి వారి ఇళ్ళలో చేసుకున్న ఆహారపదార్ధాల్ని అమ్మి నాలుగు వందల డాలర్లను పోగేశారు. ఇక మొక్కలు నాటడానికి రంగం సిద్ధమైంది. ఒక తేదీ నిర్ణయించి, ఆ రోజున విద్యార్థులు, వారి అమ్మానాన్నలు రావాలని పాఠశాల యాజమాన్యం అందరికీ కబురంపింది. అయితే, నిధుల సేకరణలో చురుగ్గా పాల్గొని ఎక్కువ మొత్తం సంపాదించడంలో ముందున్న నాలుగో తరగతి బాలిక కరెన్ మాత్రం ఈ కార్యక్రమానికి రాలేమని తన స్నేహితులకు చెప్పింది. అసలు సంగతి ఏమిటంటే, పాపం ఆ అమ్మాయి తండ్రికి ఉద్యోగం పోయింది. అద్దె ఇవ్వలేకపోవడంతో యజమానులు ఇల్లు ఖాళీ చెయ్యమన్నారు. దాంతో వారు ఊరు చివర తక్కువ ధరకు మరో చిన్న ఇంటికి మారాలనుకుంటున్నట్లు అందరికీ తెలిసింది. ఇంకా విచారకరమైన విషయం ఏమిటంటే చిన్నారి కరెన్ ఇక బడికి రాదని తెలిసింది. ఇది మరో షాక్...
కరెన్ తోటి బాలుడు క్రిస్ రంగంలోకి దిగాడు. మిగిలినవారందరితోనూ చర్చించాడు. బడిని అందంగా మార్చడానికి సేకరించిన డబ్బును కరెన్ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఉపయోగించాలని ప్రతిపాదించాడు. ఈ సంగతి పాఠశాల యాజమాన్యానికి తెలిసింది. సేకరించిన సొమ్ముకు మరో అంత మొత్తాన్ని కలిపి కరెన్ కుటుంబానికి చేయూతనివ్వాలని ఏకగ్రీవంగా నిర్ణయించారు. ఈ వార్త స్థానిక మీడియాకు తెలిసింది. ఇది పత్రికల్లో రావడంతో ఆ ఊరిలోని ధనవంతులు కొందరు మరికొంత సొమ్ము చేర్చి ఈ కుటుంబానికి ఇచ్చారు. అంతేకాకుండా కరెన్ తండ్రికి మరో ఉద్యోగం ఇప్పించారు. దాంతో కరెన్ కుటుంబం ఇల్లు ఖాళీ చెయ్యాల్సిన అవసరం గానీ, ఆమె చదువు మానాల్సిన అవసరంగానీ రాలేదు. ఆ తర్వాత ఆ బడిపిల్లల అమ్మానాన్నలు మరి కొంత సొమ్ము పోగుచేసి పాఠశాలను ముందుగా అనుకున్న ప్రకారం మంచి మొక్కలు నాటి అందంగా తయారు చేశారు. చూశారా... పిల్లల ఆదర్శంతో ఒక జీవితంలో కొత్తకోణం ఆవిష్కృతమైంది....

Tuesday, January 26, 2010
చూడలేని కామెంటేటర్...
జింబాబ్వేకు చెందిన డీన్ డు ప్లెసిస్‌కు ఒక తిరుగులేని సామర్థ్యముంది. అదేంటంటే... మ్యాచ్ చూడకుండానే కామెంట్రీ చెయ్యడం. కళ్లు లేకున్నా స్పందనలు, శబ్దాలను బట్టి క్రికెట్ పిచ్‌లో ఏం జరిగిందనేది పసిగట్టి కామెంట్రీ చేస్తాడు. ఇతని గురించి మరిన్ని వివరాలు సేకరిస్తాను.
Monday, December 28, 2009
నెత్తురు ఉడుకుతోంది... మా రక్తం తీసుకోండి
అస్సాం రాష్ట్రానికి 2008వ సంవత్సరం ఒక పీడకలలాంటిది. వరుస బాంబు దాడులతో ఈ ఈశాన్యరాష్ట్రం అతలాకుతలమైంది. అలాంటి ఒక సందర్భంలో జరిగిన భయానక బాంబుదాడి పెద్దసంఖ్యలో జనాన్ని క్షతగాత్రుల్ని చేసింది. వారి ప్రాణం నిలపడానికి కావలసినంత రక్తం లేక ఆసుపత్రులు సతమతమవుతున్నాయి. చూస్తూ చూస్తూ కళ్ళముందే ప్రాణాలు పోతుంటే తట్టుకోలేకపోయిన గౌహతి మెడికల్ కాలేజ్ హాస్పిటల్ సిబ్బందికి మనసు కకావికలమైంది పాపం. చివరికి మీడియా, ఎస్ఎంఎస్‌ల ద్వారా రక్తం కోసం వీలైనంతమందికి విజ్ఞప్తులు పంపారు. ఎవరైనా స్పందిస్తే బాగుంటుందని, ఒక వేళ స్పందించినా వారిచ్చే రక్తం సరిపోతుందో లేదోనన్న ఆందోళన.
మరికాసేపటికి ఉరుకులు పరుగుల మీద వేలాది మంది ఆసుపత్రికి తరలివచ్చారు. వారంతా బాంబు దాడి బాధితులేమోనని ఆసుపత్రి వర్గాలు హడలిపోయాయి. వచ్చింది బాధితులు కాదు. పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, స్వచ్చంద సంస్థలవారు, వ్యాపారులు, వినోదరంగాలకు చెందినవారు ముందుకొచ్చి మేమంటే మేమంటూ రక్తమివ్వడానికి ఉత్సాహం చూపారు. బాంబు దాడులతో మా నెత్తురు ఉడికిపోతోంది... మారక్తం తీసుకుని మావాళ్ళను కాపాడండి అని వారంతా ముక్తకంఠంతో స్పందించారు.
ఆ రోజున వారిచ్చిన రక్తంతో ఎందరో బాధితులు బతికిబట్టకట్టారు. బ్లడ్ బ్యాంకుల్లో అయితే ఇక రక్తం దాచే చోటు కూడా లేదు. దాంతో చాలామంది దాతల వివరాలు తీసుకుని అవసరమైతే కబురు చేస్తామని బలవంతంగా తిప్పిపంపారు. ప్రజల స్పందనతో గౌహతి మెడికల్ కాలేజ్ హాస్పిటల్ ప్రిన్సిపాల్ ఎం ఎం దేకా ఉద్వేగానికి లోనయ్యారు. ఇలాంటి ఐక్యత దేశమంతటా ఉండాలని తాను కోరుకుంటున్నానన్నారు. దాతల రక్తంతో పునర్జన్మ ఎత్తిన బాధితులు ఆ ప్రేమ దేవుళ్ళకు చేతులెత్తి మొక్కారు.

Wednesday, December 23, 2009
ఫోన్ చేస్తే రక్తమిస్తా....
మెదక్ జిల్లా సిద్దిపేట మండలం ప్రశాంతినగర్ వాసి అయిన వరాల ప్రశాంత్ కుమార్ ఎప్పుడూ 'బీ పాజిటివే'. మానవతా దృక్పథంతో స్వచ్ఛందంగా రక్తదానం చేస్తూ 'సంచార రక్తనిధి'గా ప్రశంసలందుకున్నాడు. అంతేకాదు, ఫోన్ చేస్తే చాలు స్పందిస్తానంటూ తన ఫోన్ నెంబర్లు సైతం బహిరంగంగా ప్రకటించాడు (9397675737, 9949453585). రాత్రి, పగలన్న తేడా లేకుండా అత్యవసర సమయాల్లోను, రక్తం కావాలని వచ్చే టీవీ ప్రకటనలకు స్పందించి రక్తమిచ్చి ఎన్నో ప్రాణాల్ని నిలబెట్టాడు. లెక్కలేనన్నిమార్లు రక్తమివ్వడమేగాక, రక్తదాన శిబిరాలు కూడా నిర్వహించాడీ నిజమైన దేశభక్తుడు. ఆర్తులపాలిటి వరాల మూట వరాల ప్రశాంత్ కుమార్.
Tuesday, December 22, 2009
అతను కూరొండుకోలేదు
చెన్నైలోని పులియంతోపు ప్రాంతంలో జూలై 25, 2006వ తేదీన జరిగిందీ ఘటన. ఉదయం 7.30 గంటల సమయంలో ఒక ఆటోడ్రైవర్ ఆ ప్రాంతం గుండా వెళుతున్నాడు. అప్పుడు దారిలో పడి ఉన్న ఒక గుడ్లగూబ చుట్టూ కొన్ని కాకులు చేరి దాన్ని పొడుస్తుండటం ఈ ఆటోడ్రైవర్ కంటబడింది. ఒక్కసారిగా బండికి బ్రేక్ వేసి దాన్ని కాకుల బారినుంచి కాపాడి అక్కడికి సమీపాన ఉన్న అగ్నిమాపక దళం సిబ్బందికి విషయం చెప్పాడు. వారు వెంటనే ఆ గుడ్లగూబకు ప్రాథమిక చికిత్స చేసి బ్లూక్రాస్‌కు తరలించారు. అదే దారిలో వెళుతున్న చాలామంది వాహనదారులు వింతగా చూస్తున్నారే తప్ప ఒక్కరూ దానిని కాపాడే ప్రయత్నం చెయ్యలేదని ఆటో డ్రైవర్ ఆవేదన వెలిబుచ్చాడు. అదే మరొకరైతే ఈ గుడ్ల'గూబ గుయ్యిమని'పించి కూర వండేసుకుంటారు. ఒకప్పుడు మనకు రోజూ కనిపించే పిచ్చుకలతోబాటు పలురకాల పక్షి జాతులు నానాటికి అంతరించిపోతూ పర్యావరణ సమతౌల్యం దెబ్బతింటున్నప్పటికీ చదువుకున్నవారెందరో పట్టించుకోవడంలేదు. వారందరికీ ఆదర్శప్రాయుడీ ఆటో డ్రైవర్ (క్షమించండి, ఇతని పేరు తెలుసుకోలేకపోయాను).
Sunday, December 20, 2009
మూగజీవాల వృద్ధాశ్రమం
మనుషుల్లో మానవత్వం మృగ్యమై మృగాలవుతున్న ఈ రోజుల్లో చెన్నైకి చెందిన 45 ఏళ్ళ అశోక్ మాత్రం మూగజీవాల శోకాన్ని పోగొట్టేందుకు నడుం బిగించారు. 10 సంవత్సరాల కిందట చెన్నైలోని ఇంజంబాక్కంలో "బెంజీస్ డాగ్ అకాడెమీని" ప్రారంభించి తొలుత శునక (కుక్కలు) సంరక్షణ, తర్వాత మార్జాల (పిల్లులు) సంరక్షణ కూడా ఆయన చేపట్టారు. అమ్మానాన్నలు ముసలివారైతే ఎలా వదిలించుకోవాలా అని చూసే ఈ కాలం కుర్రకారు లాంటివారు కాదు అశోక్. ఈ మూగజీవాలకు వయసు మీరినా ఇబ్బందులు ఎదురుకాకుండా "మూగజీవాల వృద్ధాశ్రమం" కూడా ఏర్పాటు చేశారు. అవి తనువు చాలిస్తే వాటి అంత్యక్రియల కోసం ప్రత్యేకంగా స్మశానవాటికను కూడా ఏర్పాటు చేశారాయన. ఈ మూగజీవాలకు అన్నంపెట్టి, వైద్యసేవలందించి ఆదరించడమేగాక వాటికి వివిధ అంశాల్లో తర్ఫీదునిప్పిస్తుంటారు. అందువల్ల అవి తెలుగు, తమిళ సినిమాల్లోను, వాణిజ్య ప్రకటనల్లోనూ కనిపిస్తుంటాయి. అశోక్ జీవకారుణ్యం గురించిన స్థానికులు ఎప్పుడైనా బయటి ఊళ్ళకు వెళ్ళాల్సి వస్తే వారి జంతువుల్ని కొంతకాలం అశోక్ సంరక్షణలో ఉంచి వెళుతుంటారు. తన సేవలకు చెన్నైలో స్థలం చాలకపోవడంతో సమీపానగల ప్రముఖ పర్యాటకకేంద్రం మహాబలిపురంలో మరో విశ్రాంతి కేంద్రం ఏర్పాటుకు సిద్ధమయ్యారు. ఈ సేవలో ఆయన కుటుంబం తోడ్పాటు కూడా ఉంది.
అంధుని పంట పండింది
సకల అంగాలూ సక్రమంగానే పనిచేస్తున్నా కాలం కలసిరాలేదని కలత చెందే మందమతులకు అతను కనువిప్పు కల్గిస్తున్నాడు. నిరాశ, నిస్పృహలకు లోనైన వారికి ఈ అంధుని జీవితం ఒక గుణపాఠం. కృష్ణాజిల్లా ముదినేపల్లి మండలం, చిగురుకోటకు చెందిన భట్రాజు చిననాగేశ్వరరావు కళ్ళముందు ఎప్పుడూ కారు చీకట్లే. ఒకరి తోడు లేకుండా తన జీవితం గడపలేని ప్రతికూల పరిస్థితుల్లో ఇతను వ్యవసాయంలో అధిక దిగుబడులు సాధిస్తూ తన కుటుంబానికి ఆసరాగా నిలిచాడు. పుట్టుకతోనే కళ్ళులేని చిననాగేశ్వరరావు బ్రెయిలీ లిపి నేర్చుకున్నాడు. ఒకనాడు తన తండ్రితో బాటు పొలానికి వెళ్ళివస్తూ ఇతను కూడా సేద్యంపై ఆసక్తి పెంచుకున్నాడు. కళ్ళు లేకున్నా కూలీలతో పనులు చేయిస్తూ దిగుబడుల్లో సాటి రైతులకంటే ముందున్నాడు. తనకు స్వంతంగా ఉన్న భూమితోపాటు ఇంకొంత భూమిని కౌలుకు సాగుచేసి మంచి 'ఫలసాయం' పొందాడు. ఒకప్పుడు చేపల చెరువుల నిర్వహణలో నష్టం రావడంతో తన భూములమ్మి అప్పులు తీర్చాల్సి వచ్చినప్పటికీ దిగులుపడక మొక్కవోని దీక్షతో జీవితంలో ముందుగు సాగాడు చిననాగేశ్వరరావు.
Saturday, December 19, 2009
గొల్లనాగయ్య మూలికావైద్యం
మహబూబ్‌నగర్ జిల్లా చర్లపల్లికి చెందిన గొల్ల నాగయ్య కోసం ఆయన ఇంటివద్ద ప్రతిరోజూ వందల సంఖ్యలో జనం నిరీక్షిస్తుంటారు. మూలికావైద్యం, మేకపాలతో మందులివ్వడం ఈయన ప్రత్యేకత. ఏ మాత్రం డబ్బు ఆశించకుండా గత 30 ఏళ్ళ నుంచీ ఆయన ఈ సేవలందిస్తున్నారు. విశేషమేంటంటే... పెద్ద ఆసుపత్రుల్లో పనిచేసే నర్స్‌లు, ఇతర సిబ్బంది కూడా ఇక్కడికి వచ్చి ఆయన వైద్య సేవలందుకుంటుంటారు. గొల్ల నాగయ్య కుమారులు కూడా తండ్రి బాటనే అనుసరిస్తూ రోగులకు స్వాంతన కల్గిస్తున్నారు. రోగుల సౌకర్యార్థం వారు తమ స్తోమత మేరకు ఒక రేకుల షెడ్ కూడా ఏర్పాటు చేసి ధన్వంతరి ఆశీస్సులు అందుకుంటున్నారు. గొల్ల నాగయ్య వైద్యం ఎన్నో జీవితాల్లో కొత్త కోణాలు పూయించింది. అన్నట్టు మరిచిపోయా... ఈయన వైద్య సేవలు మూగజీవాలకు కూడా అందుతున్నాయ్.
వికలాంగుని చేపలవేట...
ప్రకాశం జిల్లాలో కొత్తపట్నం సమీపానగల కె పల్లెపాలెం వాసి ఏసురత్నం. కాళ్ళులేని ఈ మత్స్యకారుడు తన ఇంట్లో పెద్దకొడుకు. ఈ వికలాంగుని చేపలవేటతోనే ఆ ఇంటికి పూటగడుస్తుంది. ముసలివారైన అమ్మానాన్నలు, అత్తింటివారి కట్నం వేధింపులతో తిరిగివచ్చిన సోదరి, మరో చెల్లెలు, ఒక తమ్ముణ్ణి ఇతను పోషిస్తున్నాడు. వీరుగాక మరో ఇద్దరు అక్కచెల్లెళ్ళకు తానే పెళ్ళిళ్ళు చేసి పంపాడు. కాళ్ళులేక తాను వికలాంగుడై ఉన్నప్పటికీ అతి కష్టం మీద తోటి జాలర్ల సాయంతో పడవ నడుపుకుంటూ చేపలకోసం నడి సముద్రంలోకి వెళ్ళోస్తాడితను. తీరనికష్టాలతో ఇతని కుటుంబమూ నడి సంద్రంలోనే ఉంది. అతని గుండె మాత్రం ఆత్మస్థైర్యపు అలలతో కదలాడుతూనే ఉంది. ప్రభుత్వ సాయం ఆశించక తన కుటుంబాన్ని తానే పోషించుకుంటున్న ఈ ఏసురత్నం... ఏ అమ్మానాన్నలకైనా నిజమైన పుత్రరత్నమే...
Friday, November 27, 2009
బ్యాంక్ మేనేజర్ జలయజ్ఞం
కర్ణాటక రాష్ట్రానికి చెందిన డాక్టర్ దేవరాజ్ అక్కడ మైసూర్ స్టేట్ బ్యాంక్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్నారు. దేశంలోని 30 నదుల అనుసంధానం, 50 వేలకు పైగా కుంటలకు జీవం పొయ్యడం లక్ష్యంగా కన్యాకుమారి నుంచి న్యూఢిల్లీ వరకూ కొన్నేళ్ళ కిందట పాదయాత్ర చేపట్టారాయన. ఇందుకోసం తన ఉద్యోగానికి 9 నెలల పాటు సెలవు పెట్టి తన యాత్రలో భాగంగా 2006లో ఆయన హైదరాబాద్ కూడా వచ్చారు. అప్పటికి ఆయన 1500 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేశారు. తన పాదయాత్రలో భాగంగా ఆయన పలు విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో సదస్సులు నిర్వహించి నదులను అనుసంధానించాల్సిన అవసరంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈయన చేపట్టిన ఈ జలయజ్ఞం స్ఫూర్తిని రాజకీయ నాయకులు కూడా అందిపుచ్చుకోవాలి.
Thursday, November 26, 2009
సేవకుడు బాలసుబ్రహ్మణ్యన్
తమిళనాడులో దక్షిణాది కుంభమేళాగా గుర్తింపు పొందిన మహామాఘం ఉత్సవం అంటే అందరికీ గుర్తుకొస్తారు 95 ఏళ్ల పైబడిన బాలసుబ్రహ్మణ్యన్. ఇంత పెద్దవయసులోనూ ఆయన తన బాధ్యతను మర్చిపోలేదు. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ ఉత్సవాలలో సేవ చెయ్యడం కోసం పెద్ద ఎత్తున స్వచ్ఛంద సేవకులతో సన్నద్ధులవుతారు బాలసుబ్రహ్మణ్యన్. 1932 నుంచి ఈ సేవాయజ్ఞాన్ని తలపెట్టి 1944, 1956, 1968, 1980, 1992 సంవత్సరాల్లోనూ... తర్వాత 2004లో 95 ఏళ్ళ వయసులోనూ స్వచ్ఛంద సేవకుల బృందానికి నేతృత్వం వహించి తన బాధ్యతను నిర్వర్తించారాయన. స్కాట్స్ అండ్ గైడ్స్‌తో సుదీర్ఘకాల సాన్నిహిత్యం కలిగి ఉన్న బాలసుబ్రహ్మణ్యాన్ని తమిళనాడు ప్రభుత్వం నాగపట్టణం జిల్లాకు శాశ్వత కమిషనర్‌గా నియమించింది. న్యాయశాస్త్రపట్టభద్రుడైన ఈ సేవకుడు క్రైస్తవుల ఆరాధ్యదైవమైన వేలాంకన్నిమాత ఉత్సవానికి కూడా స్వచ్ఛంద సేవకులను తీసుకెళ్ళారు. అక్కడ రోటరీ క్లబ్ అధ్యక్షునిగా, వినియోగదారుల మండలిలోను, ఉచిత న్యాయసహాయ సంఘంలోను సభ్యునిగా సేవలందించారు. నాగపట్టణం సెయింట్ జాన్స్ అంబులెన్స్ కార్యదర్శిగా కూడా పనిచేశారు.
Thursday, October 29, 2009
యమధర్మరాజా ఎంటర్‌ప్రైజెస్
పాన్ షాపులు, చిల్లర దుకాణాల్లో ఎక్కవగా అమ్ముడయ్యేవి బీడీలు, సిగరెట్లు, కిళ్ళీలు. చెన్నైలోని మందవెలి ప్రాంతంలో చిల్లర కొట్టు నడుపుకుంటున్న శివశంకర్ అనే దుకాణదారుడు ఇవేమీ అమ్మడు. కానీ ఆయన దుకాణం ముందు ఒక బోర్డ్ మాత్రం దర్శనమిస్తుంది. దానిపైన తమిళంలో రాసి ఉన్న ప్రకటనకు తెలుగు అనువాదం ఇది...
బంపర్ బహుమతులు
రోజూ క్రమం తప్పక బీడీలు, సిగరెట్లు తాగేవారికి మా యమధర్మరాజ ఎంటర్‌ప్రైజెస్ అందించే అద్భుతమైన బహుమతులు.
మొదటి బహుమతి - గుండె జబ్బు
రెండవ బహుమతి - పక్షవాతం
మూడవ బహుమతి - టీబీ
వారం వారం కానుక - ఆర్థిక సమస్యలు
శాశ్వత కానుక - మనోవేదన
బంపర్ బహుమతి - క్యాన్సర్...
ఇవి చాలా... ఇంకా కావాలా ?

కళాకారుడు... సేవాతత్పరుడు
అతను ఒక సాధారణ తోటమాని కొడుకు. పేరు ప్రభాకరన్ (25). తమిళనాడులోని తన స్వస్థలమైన ముత్తుక్కాడులో తన 12వ సంవత్సరం నుంచీ సంప్రదాయ కళలైన తప్పెట, సిలంబాట్టం (కర్రసాము), గరగాట్టం, ఒయిలాట్టం, దేవరాట్టం లాంటివి నేర్చుకుని అమెరికా, బెల్జియం, స్పెయిన్, నెదర్లాండ్స్, హాలెండ్ తదితర దేశాల్లో ఎన్నెన్నో ప్రదర్శనలు ఇచ్చాడు. అతను కేవలం ప్రదర్శనలకే పరిమితం కాలేదు. ప్రదర్శనల ద్వారా వచ్చే డబ్బుతో వికలాంగులకు చేయూతనిస్తుంటాడు. తనను ఇంతవాడిని చేసిన సంప్రదాయ కళల పునరుద్ధరణకు తోడ్పడుతుంటాడు. కళాకారులు ఎలా జీవించాలో చెప్పే పాఠమై నిలిచాడు. రుద్రవీణ సినిమాలో చిరంజీవిలాగా...
Tuesday, September 29, 2009
కండ(డా)క్టర్
బస్సులో టిక్కెట్ల గురించేకాదు, ప్రయాణీకుల ఆరోగ్యపు ఇక్కట్ల గురించి కూడా తెలుసు ఆ కండక్టర్ గారికి. కడప జిల్లా బద్వేల్ ఆర్టీసీ డిపోలో కండక్టర్‌గా పనిచేసే వెంకటేశ్వర్లు తన ప్రవృత్తిగా వనమూలిగా వైద్యాన్ని ఎంచుకున్నారు. పేదలకు ఉచితంగా వనమూలికా వైద్యం చేస్తుంటారు. తన ఇంటి పెరట్లోనే ఔషధ మొక్కలు పెంచుతూ చిన్నతనం నుంచే మూలికల పట్ల మంచి అవగాహన పెంచుకున్నారు. ఆది, మంగళవారాలు ఈయనకు సెలవుదినాలు కావడంతో తన భార్య తోడ్పాటుతో ఇంటివద్దే మందులు తయారు చేసి స్థానికులకు వైద్యపరమైన చేయూతనిస్తున్నారు.
బాలింతలారా మొక్కలతో రండి
పండంటి బిడ్డను ప్రసవించేందుకు ఆ ఆసుపత్రికి వెళ్ళే ఏ గర్భిణి అయినా ఒక మొక్కను చేతబట్టుకుని మాత్రమే ఆ మెట్లెక్కాలి. అటు పర్యావరణ పరిరక్షణ, ఇటు రోగుల ఉల్లాసం లక్ష్యంగా ఆ ఆసుపత్రి వైద్యులు పెట్టిన నిబంధన అది. దీనిని కనులారా గాంచాలనుకుంటే తమిళనాడులోని మదురై జిల్లా రాజ్‌కూర్‌లో ఉన్న ప్రభుత్వాసుపత్రికి వెళ్ళాలి. ఇక్కడున్న ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ప్రసవానికి వచ్చే ప్రతి బాలింతా ఒక మొక్కను నాటాలని ఆసుపత్రి సిబ్బంది ఒక వినూత్న పథకం ప్రవేశపెట్టారు. ఫలితంగా ఈ ఆసుపత్రికి "మొక్కల ఆసుపత్రి" అనే పేరు వచ్చేసింది. అంతేకాదు, ఉచిత వైద్య సేవలపై అవగాహన కల్పించే ఈ ఆసుపత్రి వైద్యురాలి సెల్ నెంబర్ ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరికీ తెలుసు. అందువల్ల వారు ఎప్పుడైనా తమ ఆరోగ్య సమస్యలపై ఏ సమయంలోనైనా వైద్యురాలిని సంప్రదించవచ్చు. ప్రభుత్వ సిబ్బంది నిర్లక్ష్యానికి మారుపేరని తరచూ విమర్శలు వెల్లువెత్తే నేటి పరిస్థితుల మధ్య ఒక ప్రభుత్వాసుపత్రి సిబ్బంది ప్రజల మేలు కోరి ఇలాంటి పథకాన్ని ప్రవేశపెట్టడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమైంది.
Friday, August 14, 2009
మిస్టర్, మీరు జీససా?
కొన్నేళ్ళ కిందట న్యూయార్క్‌లో జరిగిన ఒక రీజియనల్ సేల్స్ కన్వెన్షన్‌కి షికాగో నగరం నుంచి కొందరు సేల్స్‌మెన్ హాజరయ్యారు. అదయ్యాక తిరిగి షికాగోకి వెళ్ళడానికి వారంతా వేన్‌లో ఎయిర్‌పోర్ట్‌కు బయలుదేరారు. ట్రాఫిక్ రద్దీ వల్ల వారు ఎయిర్‌పోర్ట్‌కి ఆలస్యంగా చేరుకున్నారు. ఫైనల్ బోర్డింగ్ కాల్ ప్రకటన కూడా వారు విని హడావిడిగా ఒక చేత్తో ఎయిర్ బ్యాగ్, మరొక చేత్తో టికెట్ పట్టుకుని లోనికి పరుగులు తీశారు. ఆ కంగారులో అక్కడున్న ఏపిల్స్ స్టాండ్‌కి వారిలో ఒకరి కాలు తగిలి ఆ పళ్ళన్నీ నేలపై చెల్లాచెదురుగా పడ్డాయి. సెల్స్‌మెన్ అంతా వెనక్కి తిరిగి చూడనైనా చూడకుండా కౌంటర్ వైపునకు పరిగెత్తారు. ఒక్కరు తప్ప.
అతను ఆగి తన మిత్రుల్లో ఒకరితో గట్టిగా చెప్పాడు. "ఫ్రాన్సిస్. షికాగో చేరగానే నువ్వు మా ఆవిడకు ఫోన్ చేసి నేను తర్వాతి ఫ్లయిట్‌లో వస్తున్నానని చెప్పు"
ఆ ఏపిల్ స్టాండ్ మేనేజ్ చేసే 16 ఏళ్ళ పిల్ల సన్నగా ఏడుస్తూ నేలపై పడిన పళ్ళు ఏరుకుంటోంది.
విమానంలో మిత్రులతో పాటు వెళ్ళకుండా ఆగిన ఆ వ్యక్తి గట్టిగా ఊపిరి తీసుకుని వదిలి, నేలపై చెల్లాచెదురుగా పడిన ఆఖరి ఏపిల్ కూడా ఏరి స్టాండ్‌లో ఉంచి చెప్పాడు. "ఏడవక. అన్నీ ఏరాను. దెబ్బ తిన్నవి వేరే ఉంచాను."
ఏడుస్తున్న ఆమె చేతిలో నలభై డాలర్ల నోట్లని ఉంచి చెప్పాడతను. "తీసుకో. ఇది నీకు జరిగిన నష్టానికి సరిపడే పరిహారం. నువ్వు దీని యజమానికి జవాబుదారీ అని నాకు తెలుసు."
ఆమె అతన్ని తడిమి చూస్తూ "మిస్టర్ మీరు జీససా?" అని అడిగింది.
ఆమె అతన్ని భావించినట్లుగా, మనల్ని ఎవరైనా దేవుడు అనుకునేలా, జీవితంలో ఒక్కసారైనా అలా నిస్వార్ధంగా ప్రవర్తించి ఉంటామా?

Wednesday, August 12, 2009
అంధ(ద)మైన దత్తత
సంతానం లేనివారెవరైనా దత్తత తీసుకోవాలని నిర్ణయించుకుంటే ఏం చేస్తారు? మొదట తమ మతం, తర్వాత తమ కులం, ఆ తర్వాత తమ బంధువులు లేదా స్నేహితుల కుటుంబాల్లోంచి ఎవర్నైనా దత్తత తీసుకోవాలని చూస్తారు. ఏమీ కాకుంటే అనాథ శరణాలయాలకే చివరిగా వెళ్ళేది. దత్తతగా తీసుకోదలచిన బిడ్డ ఆరోగ్యం సంగతి మరీ ముఖ్యంగా చూసుకుంటారు. ఇక అంగవైకల్యం ఉన్న పిల్లలంటే దత్తత మాట దేవుడెరుగంటూ అలాంటివాళ్ళు వద్దని ఆమడ దూరం పరుగు తీస్తారు. కానీ అమెరికాకు చెందిన అంధుడు జాన్‌కర్ల్ ఫీజ్, మేరీ దంపతులు మాత్రం దేశదేశాల్లో వెతికి వెతికి చివరికి మన దేశంలో అంధ బాలుడైన నాలుగేళ్ళ జ్యోతిని ఈ ఏడాది జూన్‌లో దత్తత తీసుకున్నారు. ఒరిస్సాలోని ప్రముఖ పట్టణం కటక్‌లో ఉన్న "వసుంధర" చైల్డ్ హెల్ప్‌లైన్‌లో ఈ కారుణ్యపూరిత సంఘటన చోటుచేసుకుంది. అంగవికలురైనవారు మరెవరినైనా దత్తత తీసుకుంటే ఆ బిడ్డ తమకు ఆసరాగా ఉండాలని భావిస్తారు. కానీ, అంధుడైన జాన్‌కర్ల్ తనలాంటి మరొక అంధుడిని దత్తత చేసుకోవడం అందర్నీ విస్మయపరిచింది. ఇందుకు కారణమేంటని అతన్ని అడిగితే.... అంధుడిగా పుట్టి తాను అనుభవిస్తున్న బాధలు మరొకరికి కలుగకుండా చూడాలనే భావనతో అంధ బాలుణ్ణి పెంచుకోదలచినట్లు చెప్పాడు. స్వశక్తితో కంప్యూటర్ సంస్థ యజమానిగా ఎదిగిన జాన్‌కర్ల్ భార్య మేరీ అమెరికాలోని ఒక అంధ విద్యార్థుల పాఠశాలలో ఉపాధ్యాయినిగా సేవలందిస్తున్నారు. ఇక జ్యోతి ఎవరంటే, కటక్‌లోని జగత్‌పూర్‌లో ఉన్న ఒక ప్రయివేట్ ఆసుపత్రిలో పుట్టాడు. పుట్టుకతోనే ఈ బాలుడు అంధుడు కావడంతో అతని తల్లిదండ్రులు ఇతన్ని రోడ్డుపైనే విడిచిపెట్టారు. అక్కడి నుంచి ఈ అబ్బాయి "వసుంధర" చైల్డ్ హెల్ప్‌లైన్‌కు చేరాడు.
Tuesday, July 21, 2009
దైవకార్యం కోసం పడవ మాయం
18వ శతాబ్దంలో సెయింట్ కొలంబియాకు 12 మంది మత ప్రచారకులను ఐరిష్ క్రైస్తవ మిషనరీ అప్పగించి అందరినీ ఉత్తర స్కాట్లాండ్‌కు పంపింది. అయితే, ఉత్తర స్కాట్లాండ్‌లోని పిక్ట్స్ అనే తెగకు చెందినవారు ఈ క్రైస్తవ మత ప్రచారకుల పాలిట యమకింకరుల్లా మారారు. ఈ సంగతి తెలిసీ ఇక్కడకు వచ్చిన కొలంబియా, ఆ మత ప్రచారకులు పడవ దిగిన వెంటనే ఆ పడవను తగలబెట్టేశారు. రాబోయే ప్రమాదాలకు భయపడి ఎప్పుడైనా తాము ఇదే మార్గంలో పడవ ఎక్కి వెనక్కి వెళ్ళిపోవచ్చనే ఆలోచన రాకుండా, వచ్చినా ఆ అవకాశం లేకుండా కేవలం క్రైస్తవ మత ప్రచారమనే దైవకార్యం కోసం కట్టుబడి వారు తమ పడవను తామే తగులబెట్టుకున్నారు. తర్వాత స్కాట్లాండ్‌లో క్రైస్తవ మతం పాతుకుపోవడంలో వీరంతా అత్యంత కీలకపాత్ర పోషించారు.
మనం నమ్మిన దైవం కోసం దైవ కార్యం చెయ్యడానికి ప్రాణాలివ్వడానికి సిద్ధపడితే అన్నీ అనుకూలిస్తాయని ఈ ఘటన నిరూపించింది.
సౌజన్యం: గౌరవనీయులు శ్రీ మల్లాదిగారు.
మనం నమ్మిన దైవం కోసం దైవ కార్యం చెయ్యడానికి ప్రాణాలివ్వడానికి సిద్ధపడితే అన్నీ అనుకూలిస్తాయని ఈ ఘటన నిరూపించింది.
సౌజన్యం: గౌరవనీయులు శ్రీ మల్లాదిగారు.
Monday, July 20, 2009
ప్రాణం పోతుందనుకుని రక్తమిచ్చాడు....
కెనడాలోని ఒంటరియో ప్రావిన్స్‌లో ఉన్న లిజ్ అనే టీనేజర్ ఒక అరుదైన, ప్రమాదకరమైన జబ్బుతో బాధపడుతోంది. ఆమె రోగానికి మందులేదు. ఆ రోగం వచ్చి తగ్గిన ఎవరి రక్తమైనా ఆమెకి ఎక్కిస్తే, అందులోని యాంటీబాడీస్ పనిచేసి ఆమె రోగం తగ్గవచ్చని వైద్యులు నిర్ధారణకు వచ్చారు. ఆసుపత్రి కంప్యూటర్‌లోని రికార్డ్‌లను పరిశీలిస్తే కొద్ది కాలం కిందట మైఖేల్ అనే ఆరేళ్ళ బాలుడికి ఇదే రోగం వచ్చి తగ్గినట్లు వైద్యులకు తెలిసింది. వారు వెంటనే మైఖేల్ అమ్మానాన్నలతో మాట్లాడారు. ఒక ప్రాణం కాపాడటం కోసం రక్త మార్పిడి చెయ్యడానికి ఒప్పుకున్నారు. ఆరేళ్ళ చిన్నారి మైఖేల్‌ని ఒక రోజున ఆసుపత్రికి తీసుకువచ్చారు. రక్త మార్పిడి ఎలా జరుగుతుందో మైఖేల్‌కు వివరించిన వైద్యులు లిజ్ కోసం రక్తమివ్వడానికి అంగీకారమేనా అని అతన్ని అడిగారు. లిజ్ బతకడానికి రక్తం ఇస్తానని చిన్నారి మైఖేల్ చెప్పాడు.
రక్త మార్పిడి జరుగుతోంది. తన ఒంట్లోని రక్తం లిజ్ ఒంట్లోకి ఎక్కడం మైఖేల్ చూశాడు. కాసేపయ్యాక మైఖేల్ ముఖం పాలిపోయింది. ఏడుపు మొదలు పెట్టాడు. నొప్పిగా ఉందా అని ఒక వైద్యుడు అడిగినప్పుడు ఏమీ లేదని జవాబిచ్చాడు.
""నేను ఇక ఎంతసేపట్లో చనిపోతాను?'' అని మైఖేల్ అడిగాడు.
చిన్నపిల్లవాడైన మైఖేల్ తనకు వైద్యులు చెప్పింది సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాడు. తన ఒంట్లోని రక్తం మొత్తం లిజ్‌కు ఎక్కిస్తారని, దాంతో తాను చచ్చిపోతానన్న అభిప్రాయంతో మైఖేల్ ఉన్నాడు.
""నువ్వు చనిపోవు. రక్తం అంతా తీసుకోం. కొంచమే తీసుకుంటాం'' అని మైఖేల్‌కు చెప్పాడు వైద్యుడు.
అయితే, తన రక్తం మొత్తం తీసేసి లిజ్‌కు ఎక్కిస్తారని, అందువల్ల లిజ్ బతుకుతుందని, అప్పుడు తాను మరణిస్తానని అనుకుని కూడా మైఖేల్ రక్తమివ్వడానికి ముందుకు రావడం ఆసుపత్రిలో అందర్నీ ఆశ్చర్య చకితుల్ని చేసింది. రక్తమార్పిడి జరిగాక మైఖేల్ ఇంటికి వెళుతుంటే అందరూ అతన్ని ఆరాధన భావంతో మెచ్చుకుని వీడ్కోలిచ్చారు.

Saturday, June 20, 2009
గవురుమెంటు డాట్రారు
గవురుమెంటు డాట్రారు అని మన పల్లెవాసులు అమాయకంగా పిలుచుకునే ఒక గవర్నమెంట్ డాక్టర్ గారికి కర్తవ్యం పట్ల ఉన్న నిబద్ధత ఎంత విలువైన ఫలితాన్ని ఇచ్చిందో తెలియజెప్పే ఘటన ఇది. జస్టిస్ చౌదరి సినిమాలో ఎన్టీ రామారావు, కర్తవ్యం సినిమాలో విజయశాంతి చట్టానికి, న్యాయానికి ఎంత విలువనిచ్చారో తన వద్దకు వచ్చే రోగుల ప్రాణాలకు అంతకంటే ఎక్కువ విలువనిచ్చి కర్తవ్య పాలన చేశారు పశ్చిమ బెంగాల్‌కు చెందిన డాక్టర్ జ్యోతిర్మయి దత్తా. వృత్తిపట్ల దత్తాగారికి ఉన్న అంకితభావం చూస్తే మన తెలుగు సినిమాలు డాక్టర్ ఆనంద్, డాక్టర్ చక్రవర్తి చిత్రాల్లో రోగుల పట్ల ఆదరణ కనబరచిన ఎన్టీ రామారావు, అక్కినేని తప్పక గుర్తుకు వస్తారు. కాకుంటే దత్తా జీవితంలో డ్యూయెట్లుండవు అంతే...
గవురుమెంటు డాట్రారు అనగానే తమ వద్దకు వచ్చే రోగులకు రంగునీళ్ళు, నాలుగు తెల్ల మాత్రలు ఇచ్చే రకం అనే అభిప్రాయం జనంలో ఉంది. డాక్టర్ జ్యోతిర్మయి దత్తా అలాకాదు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఓపెన్ యూనివర్శిటీ బిఎ విద్యార్థి అయిన దుర్గాపూర్ నివాసి సంజొయ్ పుట్టుకతోనే కంటిచూపునకు దూరమై తాను గుడ్డివాడినని ధృవపత్రం తీసుకోవడం కోసం నేషనల్ మెడికల్ కాలేజి డాక్టర్ అయిన జ్యోతిర్మయి దత్తా వద్దకు వచ్చాడు. కొందరు డాక్టర్లు ఎంతో కొంత లంచం ఆ చేత్తో పుచ్చుకుని ఈ చేత్తో ధృవపత్రం ఇచ్చేస్తారు. దత్తా అలా చెయ్యకుండా 22 ఏళ్ళ సంజొయ్‌ని పరీక్ష చేశారు. సంజొయ్‌కు పుట్టుక నుంచే కంట్లో శుక్లాలున్నాయి. కంటిపై ఏదైనా బలమైన కాంతిపుంజం పడినప్పుడు కొంత అనుభూతి కలుగుతుంది. ఇతను "స్టిములస్ డిప్రైవేషన్ అమోలైపియా" అనే సమస్యతో బాధపడుతున్నట్లు తెలుసుకున్న డాక్టర్ అతనికి శస్త్రచికిత్స చేస్తే తప్పక చూపు వస్తుందని గ్రహించి ఆ విషయాన్నే సంజొయ్‌కు చెప్పారు.
జీవితంలో 22 ఏళ్ళ కాలం చూపులేకుండా గడిపిన సంజొయ్ తనకు చూపు వచ్చే అవకాశాలున్నాయని తెలిసి ఆనందంగా శస్త్రచికిత్సకు ఒప్పుకున్నాడు. దీంతో ఇతనికి పలు పరీక్షలు చేసి ఈ ఏడాది మార్చి 14, ఏప్రిల్ 7 తేదీల్లో రెండు కళ్ళకూ శస్త్రచికిత్స చేశారు. కనుగుడ్డు కదలికలు అపసవ్యంగా ఉండటంతో అవి కూడా సరిచేశారు. కుడి కంట్లో ఉన్న సున్నం నిల్వలు తొలగించారు. మొదటి ఆపరేషన్ జరిగిన ఒక రోజు గడిచాక ఎడమ కంటి కట్టు తీసేసినప్పుడు కంటిపై చాలా బలమైన కాంతిపుంజం పడిన అనుభూతికి అతను లోనయ్యాడు. ఆ విషయాన్నే అతను డాక్టర్‌కు చెప్పాడు. దత్తా వెంటనే ఆ కన్ను తెరవమని సూచించారు. జీవితంలో మొదటిసారిగా తన సాటి మనిషిని చూశాడు సంజొయ్.
వైద్యులూ దత్తాను ఆదర్శంగా తీసుకుంటే అంతా మిమ్మల్ని వైద్యనారాయణులని కొలుస్తారని మర్చిపోకండి.

Sunday, June 14, 2009
బుద్ధి చెప్పే బాంద్రా బ్యానర్
ముంబై నగరంలోని సబర్బన్ బాంద్రా ప్రాంతంలో నగల వ్యాపారం చేసుకునే వర్తకుడు కిశోర్ వాల్‌చంద్ జైన్. అందమైన ఆభరణాలను తళతళ మెరిసేలా తయారు చేసి ఖాతాదార్ల మెప్పు పొందడంలో దిట్ట ఈ వ్యాపారి. నగలు మాత్రం తళతళలాడితే సరిపోతుందా? సుందరమైన ఆ నగలు ధరించే తన ఖాతాదారుల మానసిక సౌందర్యం తనకెంతో ముఖ్యం అంటాడీయన. అందుకే తన దుకాణం బయట మంచి సందేశాలతో కనిపించే బ్యానర్‌ను గత 10 ఏళ్ళకు పైగా ప్రదర్శిస్తూ వస్తున్నారు వాల్‌చంద్ జైన్ గారు. సమాజంలో సామాజిక స్పృహను పెంపొందించడం ఈ బ్యానర్ ప్రత్యేకత . దేశంలో జరిగే ఉగ్రవాద దాడులు, అధికారుల అవినీతి చర్యలు, రాజకీయ నాయకుల పట్ల అసహ్యంతో వారిపై జరిగే బూటు దాడులు వంటివన్నీ ఇక్కడ బ్యానర్ ఐటెమ్స్‌గా మనకు కనిపిస్తాయి. ఇలాంటి పరిణామాలే ఆయుధాలుగా వాల్‌చంద్ గారి బ్యానర్ నేతలపై వ్యంగ్యాస్త్రాలు సంధించి వారి డొల్లతనాన్ని బట్టబయలు చేస్తూ సిగ్గుపడేలా చేస్తుంది. తమ దుకాణంలోని నగల అమ్మకాలతో వచ్చే లాభాల్ని మిగిలిన వ్యాపారుల్లాగా అనుభవించడంతో సరిపెట్టుకోని వాల్‌చంద్ గారు సమాజం పట్ల తన బాధ్యతను బ్యానర్ సందేశాల రూపంలో నెరవేర్చుతున్నారు. బంగారు నగల్లాగే ఈయన మనసుకూడా భలే మెరిసిపోతుంది కదూ...
Saturday, May 30, 2009
అక్కడ బొబ్బిలి బ్రహ్మన్న లేడు...
ఆస్తి గొడవలొస్తే అన్నదమ్ములే కత్తులు దూసుకునే రోజులివి. డబ్బు విషయంలో తేడాలొస్తే మిత్రులే శత్రువులవుతున్న సమాజమిది. కుల, మత, జాతి, ప్రాంత విభేదాలతో రగిలిపోతున్న ఈ పరిస్థితుల్లో మధ్యప్రదేశ్‌లోని వామన్‌ఖేడ్ గ్రామం గురించి మనం తప్పనిసరిగా చెప్పుకోవాలి. రాష్ట్రపతి ప్రశంసలు సైతం పొందిన ఈ గ్రామం ఎన్నోసార్లు ఆదర్శగ్రామంగా పురస్కారం అందుకుంది. ఈ ఊరిలో మహిళలకు సమానహక్కులున్నాయి. వేడుకలను అందరూ కలసికట్టుగా నిర్వహించుకుంటారు. ఈర్ష్య, అసూయలకు చోటు లేదిక్కడ. రాథోడ్ వంశానికి చెందినవారే ఇక్కడ ఎక్కువగా ఉన్నప్పటికీ అన్ని వర్గాల వారికీ ప్రేమాభిమానాలు సరిసమానం. ఏ ఒక్కరికి సహాయం కావాలన్నా, మరే అవసరమున్నా సత్వరం వారికి చేయూత లభిస్తుంది. ఈ గ్రామ స్త్రీలు వారిళ్ళకు చాలావరకూ తాళాలు వెయ్యరు. కొత్తవారెవరైనా ఈ గ్రామంలోకి అడుగుపెడితే వారి అవసరాన్ని వెంటనే గుర్తించి కావలసిన పనులు చేసిపెట్టి మర్యాదతో సాగనంపుతారు. ఆ మధ్య ఎప్పుడో ఒక వేడుక సందర్భంగా రెండు వర్గాలవారు కేవలం తూలనాడుకున్నందుకు వారిని వెలివేశారు. భారత శిక్షాస్మృతి పరిధిలోకి వచ్చే ఒక్క నేరం కూడా ఈ గ్రామంలో చోటు చేసుకోలేదు. అందువల్లే పోలీసులు కూడా అడుగుపెట్టలేదు. అంతేగాని బొబ్బిలి బ్రహ్మన్న సినిమాలోలాగా ఆ ఊరు పెద్ద కృష్ణంరాజు పరిపాలనలో లేదు. అక్కడంతా మర్యాద రామన్నలే...
Friday, May 15, 2009
భార్యకోసం కొండను తవ్విన దశరథ్ మాన్జీ
ప్రభుత్వాధికార్ల గుండెల్ని కరిగించడం కన్నా కఠిన శిలల్ని కదిలించడమే తేలిక అని అతను గ్రహించాడు. అర్థాంగి అంటే నిజమైన అర్థం ఎందరికి తెలుసన్నది చెప్పలేం కానీ బీహార్‌కు చెందిన దశరథ్ మాన్జీ జీవితం మాత్రం దీనికి సరైన నిర్వచనమన్నది సూర్యచంద్రులు కనిపిస్తున్నంత నిజం. అతను తన భార్య కోసం 22 సంవత్సరాలు కష్టపడి కొండను తవ్వి బాట ఏర్పరిచాడు. ఇది పూర్తయ్యేనాటికి ఆమె ప్రాణాలతో లేకపోయినా అతని గ్రామస్థుల పాలిట వరమైంది. అదేంటో తెలుసుకుందాం...
బీహార్‌లోని వజీర్‌గంజ్ సమీపాన గల గహ్‌లోర్ ఘాటీ గ్రామానికి చెందిన దశరథ్ మాన్జీ అత్యంత నిరుపేద. ముసాహర్ జాతి (ఎలుకల బొరియల్లో దొరికే ధాన్యాన్ని తిని జీవించే జాతి)కి చెందిన ఈయనంటే మాత్రం ఆ ప్రాంతం వారికి అత్యంత గౌరవం ఉంది. ఈయన్ని దశరథ్ బాబా అని కూడా పిలుస్తారు. 1962లో దశరథ్ భార్య ఫగుణీ ఈయన కోసం పొలానికి భోజనం తీసుకువస్తుండగా కిందపడిపోతే ఆమె చెయ్యి విరిగిపోయింది. వైద్యం కోసం ఊరిలో సదుపాయాలు లేవు. ఊరికి అడ్డుగా ఉన్న కొండను చుట్టి 30 కిలోమీటర్లు ప్రయాణించి గయకు వెళ్ళాల్సిందే. ఈ సంఘటనతో కొండను తవ్వి బాట ఏర్పరచాలన్న సంకల్పానికి ఆయనలో బీజం పడింది. 300 అడుగుల ఎత్తు, 1.5 కిలోమీటర్ వెడల్పున్న ఈ పర్వతాన్ని తవ్వి దారి ఏర్పరచడం అంత సులభం కాదని అందరికీ తెలుసు.
కొండను తవ్వి దారి ఏర్పరచాలనుకుంటున్నట్లు తన వారికి చెప్పగానే అందరూ వేళాకోళం చేశారు. వ్యతిరేకత వ్యక్తమైంది. అదేం పట్టించుకోని దశరథ్ తన మేకలు, ఇతర ఆస్తులు అమ్మి కొండ తవ్వడానికి పనికివచ్చే గడ్డపార, సమ్మెట, ఇతర వస్తువులు కొన్నాడు. ఇది గమనించిన వారు దశరథ్‌ను పిచ్చివాళ్ళ కేటగిరిలో వేసేశారు. సరిగ్గా ఇదే సమయంలో దశరథ్ భార్య జబ్బు పడగా ఆసుపత్రికి తీసుకెళుతున్న సమయంలో ఆమె ప్రాణాలు విడిచింది. దీంతో కొండను తవ్వితీరాలన్న ఆలోచన వజ్ర సంకల్పంగా మారింది. కొండను తవ్వడానికి రోజూ తన ఇంటి నుంచి వెళ్ళి రావడానికి ఆలస్యం అవుతుందని భావించిన ధశరథ్ కొండ దగ్గరే గుడిసె కట్టుకుని శాశ్వత నివాసం ఏర్పరుచుకున్నాడు.
అది మొదలు 22 సంవత్సరాల పాటు ఏ ఒక్కరి సాయం లేకుండా రేయింబవళ్ళు శ్రమించి 1984లో 16 అడుగుల వెడల్పుతో చక్కని దారి సిద్ధం చేశాడు. దీంతో గహ్‌లోర్ ఘాటీ ప్రజల కష్టాలు గట్టెక్కాయి. ఇప్పుడు వైద్యం కోసం చాలా తక్కువ సమయంలో గమ్యం చేరుకోగలుగుతున్నారు. కొండను తవ్వి ఎలుకలు పట్టే ఈ రోజుల్లో చోటు చేసుకున్న అద్భుతం ఇది.
దశరథ్ జీవించి ఉండగా గుర్తింపు రాలేదుగానీ, 2007లో ఆగస్ట్ 17న ఢిల్లీలోని ఎయిమ్స్‌లో ఆయన తన 78వ ఏట మరణించినప్పుడు మాత్రం ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. ఆయన నిర్మించిన ఆ బాటకు "దశరథ్ మాన్జీ మార్గ్" అనే పేరు పెట్టారు. గహ్‌లోర్ ఘాటీలో ఈయన పేరిట ఆసుపత్రి నిర్మాణానికి కూడా రంగం సిద్ధమైంది.
ఇది కేవలం ప్రభుత్వాధికార్లు మాత్రమేకాదు, సమస్యల బారినపడి ఎదుటివాడు ఏడుస్తున్నా మనకెందుకులే అని మిన్నకుండే తోలుమందం ప్రజలందరూ దశరథ్ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి, మరెన్నో జీవితాల్లో కొత్త కోణాలు పూయాలి....

Sunday, May 10, 2009
గుంటూరు గాంధీజీకీ జై
శ్రమదానం అన్న పదం వినగానే... మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుగారు ప్రవేశపెట్టిందేగా అనెయ్యకండి. ఆయనకంటే ముందే శ్రమదానానికి నిజమైన నిర్వచనమిచ్చి 40 ఏళ్ళకు పైగా శ్రమనే దానం చేస్తూ "గుంటూరు గాంధీ"గా పేరు పొందారు వట్టికూటి వెంకట సుబ్బయ్యగారు. గుంటురు జిల్లాలోని పొన్నూరు మండలం దొప్పలపూడి గ్రామంలో 1916, అక్టోబర్ 28న (గాంధీ పుట్టిన నెలలోనే) జన్మించిన ఈయన తన జీవితాన్ని స్వచ్ఛంద సేవకే అంకితం చేశారు. మురికి కాల్వలు, రోడ్లు... చివరికి శ్మశానాలను సైతం శుభ్రం చేస్తూ కనిపిస్తుంటారు. ఈయన సేవలను గుర్తించి ఆ మధ్య మహాత్మాగాంధీ 125వ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లో ఈ గుంటూరు గాంధీ గారికి సత్కారం కూడా చేశారు.
Monday, May 04, 2009
తువాలు విసిరే సవాలు
ఆ దేశం పేరు తువాలు. జనాభా కాస్త అటూ ఇటూగా ఒక 12000 మంది ఉండవచ్చు. అక్కడ స్వతంత్రంగా పత్రికా వ్యవస్థ లేకున్నప్పటికీ సామాన్యుల నుంచి సెల్‌లోని ఖైదీ వరకూ అందరినీ సంతృప్తిగా ఉంచే మానవహక్కుల వ్యవస్థ పటిష్ఠంగా ఉంది. బాలలను హింసించిన పరిణామాలు కానరావు. పలు దేశాల్లో మానవహక్కుల అమలు గురించి 2002లో అమెరికా విదేశాంగశాఖ ఒక నివేదిక రూపొందించింది. ఈ తువాలు దేశంలో ఒక్క తప్పునైనా పట్టుకునేందుకు ఆ శాఖ విశ్వప్రయత్నం చేసి విఫలమైంది. ఫిజీకి ఉత్తరంగా ఉన్న ఈ దేశంలో మహిళలపై నేరాలు జరగడం చాలా చాలా అరుదు. తువాలులోని ప్రభుత్వం ప్రజల హక్కుల్ని పూర్తిగా గౌరవిస్తుంది. ఇక్కడేమిటంటే పెద్దలు చెప్పిన మాట చట్టంతో సమానంగా అమలవుతుంది. నివేదిక 2002లో రూపొందించినప్పటికీ ఈ రోజుకు సైతం ఇది మానవహక్కుల పాలిట భూలోక స్వర్గమే. మానవహక్కుల పరిరక్షణలో తువాలు విసిరే సవాలుకు జవాబెక్కడుంది చెప్పండి?
Sunday, April 26, 2009
అంబలి దాతా సుఖీభవ
మండే ఎండల్లో అలసిపోయినవారి సేద తీర్చేందుకు సుమారు 29 ఏళ్ళ కిందట ఒక తల్లి ప్రారంభించిన సేవా యజ్ఞాన్ని ఆమె కుమారుడు నేటికీ కొనసాగిస్తూ పలువురికి ఆదర్శప్రాయుడై నిలిచాడు. హైదరాబాద్‌కు చెందిన సరోజ దాదాపు 3 దశాబ్దాల కిందట ఉచిత అంబలి కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కేంద్రం ప్రతి ఏటా ఏప్రిల్ నెలలో ప్రారంభమై వేసవికాలం అంతా రాగులతో చేసిన అంబలిని ఉచితంగా అందిస్తూ మృగశిర కార్తె రోజు వరకూ కొనసాగి మిఠాయిల పంపకంతో ముగుస్తుంది. ఈ కేంద్రాన్ని ప్రారంభించిన సరోజ ఆ తర్వాత మరణించినప్పటికీ ఆమె కుమారుడు, ఎలక్ట్రీషియన్ అయిన ప్రభాకర్ తన భార్య కృష్ణవేణితో కలసి ఈ సేవను కొనసాగిస్తున్నారు. తాజాగా ఈ ఏడాది హైదరాబాద్ చిక్కడపల్లి డివిజన్‌లోని బాగ్‌లింగంపల్లి ఎల్ఐజి కాలనీలో ఈ కేంద్రం తలుపులు తెరుచుకున్నాయి. ఈ సేవకు చేయూతనిచ్చేందుకు పలువురు ముందుకు వచ్చినప్పటికీ ప్రభాకర్ సున్నితంగా తిరస్కరించి తన స్వంత ఖర్చుతో ప్రతి సంవత్సరం దీనిని నిర్వహిస్తున్నారు. ఈ వేసవి కాలమంతా ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ దాహార్తులు, ఆకలిగొన్నవారికి ఇక్కడ అంబలి సిద్ధంగా ఉంటుంది.
Monday, April 20, 2009
పెద్దలు ఓటేస్తే పిల్లలకు స్టార్
ప్రజాస్వామ్యంలో ఓటుకున్న విలువ ఏమిటన్నది నిజంగా గ్రహించిన పాఠశాల ఇది. హైదరాబాద్ నగరం చింతల్‌లో ఉన్న సెయింట్ మార్టిన్ హైస్కూల్ యాజమాన్యం తనకున్న పరిధిలో పౌరులను ఓటు వేసే దిశగా చైతన్యపరిచేందుకు ఓ మంచి పథకం వేసింది. తన పాఠశాలలోని విద్యార్థుల తల్లిదండ్రులు తమ బాధ్యత గుర్తెరిగి ఓటు వేస్తే వారి పిల్లల రిపోర్ట్ కార్డ్‌లో సదరు విద్యార్థికి ప్రత్యేక గౌరవం ఇస్తూ బోనస్ స్టార్ కేటాయిస్తామని ప్రకటించింది. అంతేగాకుండా ఆ విద్యార్థి తల్లిదండ్రులను ఉత్తమ పౌరులుగా గుర్తిస్తామని కూడా వెల్లడించింది. ఈ బోనస్ స్టార్ ద్వారా ప్రత్యేక గౌరవం పొందడానికి ఆ పిల్లలు తమ అమ్మానాన్నలతో ఓటు వేయించడంతో పాటు తాము ఉత్తమ పౌరుల బిడ్డలమన్న గుర్తింపు కూడా పొందుతారు. ఈ పిల్లల తల్లిదండ్రులు ఓటు వేసినట్లు రుజువు చేసుకోవడానికి ఈ నెల 25న స్వయంగా పాఠశాలకు వచ్చి తమ వేలిపై ఉన్న ఇంకు మార్కును పాఠశాల ఉపాధ్యాయులకు చూపించాల్సి ఉంటుంది. ప్రజాస్వామ్య విలువలను కాపాడే నేతలు అధికారంలోకి వస్తేనే దేశం బాగుపడుతుందని, ఇది జరగాలంటే పౌరులు పెద్ద సంఖ్యలో ముందుకు వచ్చి ఓటు వెయ్యాలన్నది ఈ పాఠశాల గుర్తించిన వాస్తవం.
Saturday, March 28, 2009
ఒక ఏస్ప్రిన్ మాత్రల సీసా...
కొన్నేళ్ళ క్రితం అమెరికాలో మేథ్యూ లిసగే అనే మూడో క్లాసు చదివే విద్యార్థి తనుండే నగరంలోని ఆకలిగొన్న బీదవారి కోసం ఏదైనా చేయాలనుకున్నాడు. దాంతో అతను "హేమ్స్ ఫర్ ది హంగ్రీ " అనే కార్యక్రమాన్ని ఆరంభించాడు. అది ఆరంభించిన నాలుగో ఏడు "హేమ్స్ ఫర్ ది హంగ్రీ " నలభై వేల డాలర్లని సేకరించి అనాథల పొట్టలని నింపగలిగింది.
మరో పిల్లవాడి కథ కూడా ఇలాంటిదే. ఆఫ్రికాలోని రోగగ్రస్థులైన బీదవాళ్ళ కోసం డాక్టర్ ఆల్బర్ట్ స్కైడ్జర్ కృషి చేస్తున్నాడని తెలిసిన పదమూడేళ్ళ జాన్ అమెరికన్ ఎయిర్ ఫోర్స్ ఓ ఉత్తరం రాశాడు. తన దగ్గరున్న డబ్బుతో ఒక ఏస్ప్రిన్ మాత్రల సీసా కొన్నానని, దాన్ని ఆఫ్రికాలోని డాక్టర్ ఆల్బర్ట్ స్కైడ్జర్ హాస్పిటల్‌లో పడేయగలరా అని అడిగాడు. ఓ లోకల్ రేడియో స్టేషన్‌కి ఈ సంగతి తెలియడంతో అది ఆ చిన్న పిల్లవాడి గొప్ప మనసు గురించి వార్తగా ప్రసారం చేసింది. అది విన్న ఎంతోమంది తగిన విధంగా స్పందించారు. దాంతో ప్రభుత్వం ఆ పిల్లవాణ్ణి, వేల మంది నుంచి ఉచితంగా వచ్చిన నాలుగు లక్షల డాలర్ల విలువ చేసే నాలుగున్నర టన్నుల మందులతో డాక్టర్ ఆల్బర్ట్ స్కైడ్జర్ నడిపే హాస్పిటల్‌కి విమానంలో పంపించింది.
ఆ పిల్లల్లోని నిజాయితీతో కూడుకున్న, బీదలకి సహాయం చేయాలనే తపనని చూసి దేవుడు వాళ్ళకి చేయాల్సిన సహాయాన్ని అనేకమంది మంచివాళ్ళని పరికరాలుగా వాడుకుని చేశాడు.
సౌజన్యం : గౌరవనీయులు శ్రీ మల్లాదిగారు.

Tuesday, March 17, 2009
కార్ల దొంగ
టర్కీలోని ఓ దొంగకి 16 ఏళ్ళ క్రితం తను చేసిన నాలుగు కారు దొంగతనాలకి పశ్చాత్తాపం కలిగింది. ఆ నాలుగు కార్లలోంచి తను దొంగిలించి అమ్ముకున్న టేప్ రికార్డర్ల ఖరీదు అయిన నాలుగు వందల యూరో డాలర్లని సెంట్రల్ టర్కీలోని కిరిక్కాలె అనే ఊరి పోలీస్ చీఫ్ సలీంకి పంపించాడు. 1992లో తన చేసిన ఆ నాలుగు దొంగతనాల వివరాలని కూడా పంపాడు. ఒకొక్కరికీ వంద యూరో డాలర్లని ఇవ్వమని, తన క్షమాపణలని కూడా తెలియచేయమని కోరాడు. ఆ దొంగ మాత్రం అజ్ఞాతంగానే ఉండిపోయాడు.
సౌజన్యం : గౌరవనీయులు శ్రీ మల్లాదిగారు.
సౌజన్యం : గౌరవనీయులు శ్రీ మల్లాదిగారు.
Thursday, March 12, 2009
ఓటర్ల కోసం గుంజీళ్ళ దీక్ష
తమిళనాట కోయంబత్తూరు జిల్లా పుదూర్ గ్రామానికి చెందిన వడ్రంగి 23 ఏళ్ళ రామనాథన్‌కు రాజకీయాలతో ఏ మాత్రం సంబంధం లేదు. తన రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే జనమంతా ఎన్నికల్లో పాల్గొని మంచి నేతలను ఎన్నుకోవాలని మాత్రం గ్రహించాడు. తన కోరిక ఫలించాలని కోరుతూ తన ఊరిలో ఉన్న ఆది వినాయకర్ ఆలయంలో మే 8, 2006వ తేదీ ఉదయం 6 గంటలకు సుముహూర్తం నిర్ణయించుకుని 14 నిమిషాల్లో 1008 గుంజీళ్ళు తీశాడు. ఈ గుంజీళ్ళు సరిగ్గా తీశాడా లేదో గమనించడానికి అక్కడి "యూత్ పవర్ ఫెడరేషన్" ప్రతినిధులు వచ్చి పర్యవేక్షించారు. తన గుంజీళ్ళ దీక్ష పూర్తయిన తర్వాత రామనాథన్ మాట్లాడుతూ మన ప్రజాస్వామిక దేశంలో ఓటు వేయడం ప్రజలందరి బాధ్యత అని, రాష్ట్ర భవిష్యత్తును మంచి బాటలో పయనింపజేయాల్సింది ఓటర్లే అయినందున అవినీతి, పక్షపాత వైఖరికి దూరంగా ఉండే నేతలను ఎన్నుకోవాలని విజ్ఞప్తి చేశాడు. రాజకీయాల్ని అసహ్యించుకొని ఓట్లేయడం మానకుండా మంచివారికి ఓటు వేయడం ద్వారా స్వలాభం కోసం పాకులాడేవారిని తరిమి కొట్టాలని పిలుపునిచ్చాడు. తన కోసం కాకుండా జనం బాగు కోసం గుంజీళ్ళు తీసిన రామనాథన్ లాంటి వ్యక్తులు రాజకీయాల్లోకి వస్తే ... జన జీవితంలో కొత్త కోణం ప్రకాశిస్తుంది.
పసివాడి హృదయం కరిగింది
"పిల్లలూ ఈ రోజు మీకో వీడియో చూపిస్తాం... అది చూచి మనకు తోచిన సాయం చేద్దాం" అని టొరంటోలోని ఒక స్కూలు ఉపాధ్యాయులు తమ విద్యార్థులకు ఆఫ్రికా ఖండంలోని అతి పేద దేశమైన మలావీలోని బాలల దుస్థితిని వీడియో ద్వారా చూపించారు. ఆ స్కూల్లోనే చదువుకుంటున్న తొమ్మిదేళ్ళ భారత సంతతి విద్యార్థి నీల్ అగర్వాల్ పసి హృదయం మలావీ చిన్నారుల కష్టాలు చూచి కరిగిపోయింది. వెంటనే తన కిడ్డీ బ్యాంక్‌లో దాచుకున్న 170 డాలర్ల మొత్తాన్ని (దాదాపు రూ.7,800) యునిసెఫ్‌కు విరాళంగా ఇచ్చేశాడు. నీల్ తండ్రి ప్రదీప్ అగర్వాల్ భారతీయుడు కాగా, తల్లి ఎలిజబెత్ కెనడాలో పుట్టి పెరిగిన ఇటలీ సంతతి మహిళ. ఇంత పెద్ద మొత్తం (ఆ కుర్రాడి వయసుకు ఇది పెద్ద మొత్తమే...) అలా ఎలా ఇచ్చేశావురా అని అడిగితే... నా వయసు పిల్లలు పేదరికంతో తిండి లేక పాఠశాలలకు కూడా వెళ్ళడం లేదని తెలిసి, ఆ డబ్బు నాకంటే వారికే ఎక్కువ అవసరమనిపించిందని బదులిచ్చాడు ఈ రెండవ బాల కర్ణుడు (ఇలాంటి మరో బాలుడి గురించి ఇంతకు ముందొక కథనం ఇచ్చాను అందుకే రెండవ బాల కర్ణుడు అన్నాను). ఈ ఘటన 2006లో జరిగింది.
Thursday, February 26, 2009
మాకు కరెంట్ వద్దు...
మన పొరుగున ఉన్న భూటాన్ మనకన్నా చిన్న దేశం. మనకన్నా పేద దేశం. కాని భూటాన్ ప్రజల మనసులు మాత్రం చాలా విశాలం. వారికి భూతదయ ఎంత ఎక్కువంటే, నదుల్లోని చేపలని పట్టరు. డబ్భై ఐదు శాతం అడవే అయినా జంతువుల్ని వేటాడి చంపరు. ఆ దేశంలోని ఫోబ్జికా లోయకు తరచూ కొంగలు వలస వస్తూంటాయి. ఆ లోయకి వచ్చే దారిలో ఉన్న ఓ ఊళ్ళోని కరెంటు తీగల మీద వాలి అవి మరణించడం గమనించిన ఆ ఊరి వాసులు విద్యుత్‌కు స్వస్తి చెప్పారు. సౌర శక్తితో తమ ఇళ్ళను వెలిగించుకుంటున్నారు. వారు బాగా సున్నిత మనస్కులు కాబట్టి హింసా ప్రవృత్తి గల రెజ్లింగ్ పోటీలను ప్రసారం చేసే పాశ్చాత్య ఛానెళ్ళకు అడ్డుకట్ట వేశారు. ఫ్యాషన్ టీవీ, టెన్ స్పోర్ట్స్, ఎంటీవీ లాంటి అర్ధనగ్న దృశ్యాలు ప్రసారం చేసే ఛానెళ్ళు కూడా భూటాన్‌లో ప్రసారం కావు. బహిరంగ ప్రదేశాల్లో సిగరెట్ తాగడాన్ని నిషేధించిన తొలి దేశం కూడా భూటానే. ప్రజలు ఇలాంటి మంచి పనులకు వ్యతిరేకతను తెలియచేయకపోవడం వారి సంస్కారాన్ని తెలియజేస్తుంది. సమున్నత సంస్కృతికి మారు పేరని చెప్పుకునే మన భారతీయులంతా భూటాన్‌ను అనుసరించాల్సిన అవసరముంది.
సౌజన్యం: గౌరవనీయులు శ్రీ మల్లాదిగారు
సౌజన్యం: గౌరవనీయులు శ్రీ మల్లాదిగారు
Wednesday, February 18, 2009
వీళ్ళు పే......ద్ద పిల్లలు
శత్రువులు పాలిట తూపాకీ తూటాలాంటివాడు తుఫాన్ కుమార్ అయితే... భారతీయ సైనికుల ధన్వంతరి భారతీ సింగ్. ఈ విద్యార్థులు సాధించిన ఘనతల గురించి చదివాక నేను పెట్టిన శీర్షిక నిజమేనని మీరు కూడా ఒప్పుకుంటారని నా నమ్మకం. నవంబర్ 26, 2008న ముంబైలో జరిగిన ఉగ్రవాద దాడుల్లో ఏటీఎస్ (ఉగ్రవాద వ్యతిరేక బృందం) అధిపతి హేమంత్ కర్కారే, అశోక్ కామ్టే తదితరులు ప్రాణాలను లెక్కచెయ్యకుండా పోరాడి అసువులు బాసిన సంగతి తెలిసిందే. వాళ్ళు వేసుకున్న బులెట్ ప్రూఫ్ జాకెట్లు నాసిరకం కావడమన్నది వీరి మరణానికి ఒక కారణమని ఆరోపణలు కూడా వచ్చాయి. దీనిని బట్టి ఉగ్రవాద నిర్మూలన పట్ల మన పాలనా వ్యవస్థలో ఎలాంటి లోపాలున్నాయనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వందలాది ప్రాణాలను బలిగొన్న ఆ నాటి దాడి తర్వాత మనం నేర్చుకున్న పాఠాల సంగతేమోగాని ఈ మధ్య మేఘాలయ రాష్ట్ర రాజధాని షిల్లాంగ్‌లో జరిగిన ఒక బాలల సైన్స్ సమావేశంలో ఉగ్రవాద నిరోధానికి సంబంధించిన ఆవిష్కరణలతో ముందుకొచ్చారు.
ఇందులో పాల్గొన్న భువనేశ్వర్ కేంద్రీయ విద్యాలయం విద్యార్థి తుఫాన్ కుమార్ సమాల్ తన వంతుగా... క్లోజ్డ్ సర్క్యూట్ కెమెరాల (సిసిటివి) పైన తుపాకులు అమర్చి కంట్రోల్ రూం నుంచి వాటిని పేల్చడం ద్వారా ఉగ్రవాదులను అంతమొందించే వ్యవస్థను రూపొందించాడు. దీనివల్ల సమయం వృథా కాదు... ప్రాణ నష్టం చాలా చాలా తగ్గుతుంది. పెద్ద పెద్ద హొటళ్ళలో తిరిగే (రివాల్వింగ్) కెమెరాలుంటాయి. వాటి సాయంతో ఉగ్రవాదుల కదలికల్ని చూస్తాం. మరో అడుగు ముందుకేసి వాటికి తుపాకులు అమర్చడం ద్వారా పని పూర్తి చెయ్యవచ్చట. తుఫాన్ కుమార్ తుఫాను వేగంతో కదిలే మానవరహిత ప్లాస్టిక్ విమానాన్ని కూడా తయరు చేశాడు. దీంతో శత్రు స్థావరాల్ని కచ్చితంగా కనిపెట్టడంతో పాటుగా తుఫానులు వచ్చి వరద బీభత్సం చోటు చేసుకున్నప్పుడు బాధితులకు సాయం కూడా చెయ్యవచ్చు...
ఉత్తరప్రదేశ్ నుంచి ఇదే సైన్స్ సమావేశంలో పాల్గొన్న 12వ తరగతి విద్యార్థిని, బరైలీ పబ్లిక్ స్కూల్‌కు చెందిన భారతీ సింగ్, నీటిలోని నాచును ఉపయోగించి సైనికులకు చికిత్స చేసే వ్యవస్థను రూపొందించింది. నాచు నుంచి ప్రొటీన్ తీసి యుద్ధ సమయాల్లో గాయపడిన సైనికులకు బాక్టీరియా వల్ల వ్యాధి వ్యాపించకుండా దీంతో చికిత్స చెయ్యవచ్చట. రెండవ ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు అప్పటి సైనికులు వ్యాధులు రాకుండా ఈ నాచును పైన పెట్టుకుని కాపాడుకున్నట్లు చరిత్ర పాఠాల ద్వారా తెలుసుకుని దీనిని తయారు చేసినట్లు భారతీ సింగ్ చెప్పింది. నాచులోని ప్రొటీన్‌ను బయటకు తీసి కొన్ని వైరస్‌లపై ప్రయోగించినప్పుడు మంచి ఫలితాలు వచ్చాయని ఆమె వెల్లడించింది. గడచిన డిసెంబర్ నెలలో తాను కనిపెట్టిన ఈ ఆవిష్కరణపై పేటెంట్ కూడా తీసుకుంది.

Wednesday, February 11, 2009
నస్రీన్ నుయ్యి తవ్వింది
అమ్మానాన్నలు ఎప్పుడు చస్తారా... ఓ గొయ్యి తవ్వి పారేద్దాం అనుకునే ఈ రోజుల్లో... నీళ్ళ కోసం తల్లి పడుతున్న కష్టం చూచి ఆవేదన చెందిన నస్రీన్ ఆమె కోసం ఒక నుయ్యి తవ్వింది. తన చెల్లాయిలు తోడుగా నస్రీన్ 20 రోజుల్లో 35 అడుగుల లోతు బావి తవ్వింది. ఇక నస్రీన్ ఎవరో తెలుసుకుందాం. మధ్యప్రదేశ్‌లోని ఖండ్వాలో ఉన్న మహా విద్యాలయం విద్యార్థిని అయిన నస్రీన్ పేద కుటుంబం నుంచి వచ్చింది. ఈమె తండ్రి రంజాన్ ఖాన్ ఆటో నడిపి కుటుంబాన్ని పోషిస్తుంటాడు. మరోవైపు నస్రీన్ పగలు కళాశాలకు వెళుతూ, విద్యార్థులకు ప్రయివేట్లు చెబుతూ తన వంతుగా నాలుగు రాళ్ళు సంపాదించి తల్లిదండ్రులకు చేదోడువాదుడుగా ఉండేది. ఈ ఇంట్లో దాహార్తి తీర్చుకోవాలంటే నస్రీన్ తల్లి మైళ్ళ దూరం నడిచి మంచి నీళ్ళు తీసుకురావాల్సిందే. కని పెంచిన తల్లి కష్టం చూడలేకపోయిన ఈ ధీశాలి అమ్మ కోసం ఏమైనా చేసి తీరాలని సంకల్పించుకుని ఇంట్లేనే నుయ్యి తవ్వాలని నిర్ణయించుకుంది. అయితే అందుకు అమ్మా నాన్నా ఒప్పుకోరు. చెల్లెళ్ళతో ఈ సంగతి మాట్లాడి అమ్మానాన్నలకు తెలియకుండా అందరూ కలిసి పలుగు పార పట్టుకొని 20 రోజుల్లో 35 అడుగుల లోతు బావి తవ్వేశారు. పని పూర్తయ్యాక అమ్మానాన్నల ఆనందానికి పట్టపగ్గాలు లేకుండా పోయాయి. ఇక మహావిద్యాలయ ప్రిన్సిపాల్ ఆర్ కె పాటిల్ గారైతే నస్రీన్‌ను నోరారా పోగిడి కుట్టుమిషన్ బహుమతిగా ఇచ్చారు. ఇంకా డబ్బు సాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ఘటన జరిగి రెండేళ్లయినా ఆ వివరాలు నాకు ఇప్పుడు దొరికాయి.
ఇదంతా చూస్తుంటే లక్క ఇంటి నుంచి తన తల్లి, సోదరుల్ని కాపాడుకోవడానికి రాత్రి వేళల్లో నిద్ర మానుకొని సొరంగం తవ్విన పాండవ మధ్యముడు భీముడు గుర్తుకు రావడం లేదూ...! భీమసేనుణ్ణి మనం చూడలేకపోయాం గానీ ఈ యుగంలో నస్రీన్ మన కళ్ళముందుంది. ఈ నస్రీన్ భారతంలోని భీముని తలపించింది. ఎందుకంటే సందర్భాలు, పరిస్థితులు వేరైనా దృఢ సంకల్పం ఒక్కటేగా...

Saturday, February 07, 2009
హిజ్రాలు కాదు మానవతా వజ్రాలు
హిజ్రాలు లేదా నపుంసకులనగానే ఈ (అ)సభ్య సమాజానికి గుర్తుకొచ్చేది వయ్యారమొలకబొసి, చప్పట్లు కొడుతూ నాట్యాలు చేస్తూ డబ్బులడుక్కుంటున్న దృశ్యం. హిజ్రాలు ఎక్కువగా ఉన్న తమిళనాడులోని విల్లుపురం జిల్లాలో విలేఖరిని దత్తత తీసుకున్న ఈ నిజ సంఘటన గురించి తెలుసుకుంటే వారు మంచోళ్ళకంటే మంచోళ్ళన్న అభిప్రాయానికి రాక తప్పదు. మామూలు మనుషుల కొచ్చే కష్టాలనే పట్టించుకోని ప్రభుత్వం మామూలుగానే వీరి సంక్షేమాన్ని కూడా పట్టించుకోలేదు. అందుకే దేవుడనేవాడు వీరి కోసం విల్లుపురంలో ఒక మనిషిని పుట్టించాడు. అతనే రామ్మూర్తి. ఈ ఊరిలోనే అర్చకుడిగా పనిచేస్తున్న రామ్మూర్తి (40 ఏళ్ళు) పత్రికా విలేఖరిగా కూడా సమాచార సేవలందిస్తుంటారు. ఈయన వార్తలు సేకరించడంతో ఆగిపోకుండా ఈ హిజ్రాలకు రేషన్ కార్డులు, వృద్ధాప్య పింఛన్లు ఇప్పించారు. వారి హక్కుల కోసం పోరాడుతూ వారి హృదయాల్లో సుస్థిర స్థానం పొందారు.
తమకేమీ కాని రామ్మూర్తి తమ సంక్షేమం కోసం ఇంతగా శ్రమించడం ఆ హిజ్రాల మనసును కరిగించేసింది. వెంటనే రామ్మూర్తిని తమ కుమారునిగా దత్తత తీసుకోవాలని జిల్లా నపుంసకుల సంఘం ఒక నిర్ణయం తీసుకుంది. అనుకున్నదే తడవుగా 2005 డిసెంబర్ 31న శాస్త్రబద్ధంగా దత్తత స్వీకార కార్యక్రమం నిర్వహించారు. నపుంసకులను శ్రీకృష్ణుని ప్రతిరూపంగా భావించే హిజ్రాలు తనను దత్తత చేసుకోవడం ఎంతో ఆనందంగాను, గర్వంగాను ఉందని రామ్మూర్తి పారవశ్యంతో చెప్పారు. ఈ మానవతా వజ్రాలను ఎన్ని పొగడ్తలతో ప్రశంసిస్తే సరిపోతుంది చెప్పండి.

Monday, January 26, 2009
పెళ్ళా... తమ్ముడా...
చివరికి తమ్ముడే తన ప్రాణమంది లక్నో యువతి 21 సంవత్సరాల దివ్య. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని బాద్ షా నగర్‌కు చెందిన సుభాష్ కుమార్తె దివ్యకు పెళ్ళీడు రావడంతో పెద్దలు మంచి సంబంధం కుదిర్చారు. డిసెంబర్ 6, 2008న పెళ్ళి జరగాల్సి ఉంది. సరిగ్గా అదే సమయానికి ఆమె తమ్ముడు అపూర్వ మూత్రపిండాల సమస్యతో అనారోగ్యం పాలయ్యాడు. దాత ఎవరైనా మూత్రపిండం ఇస్తే తప్ప అతను బతకడని అక్కడి "సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్" వైద్యులు తేల్చి చెప్పారు. తోడబుట్టినవాడి పరిస్థితిని అర్థం చేసుకున్న దివ్య తన మూత్రపిండం తమ్ముడికి ఇవ్వాలని నిర్ణయించుకుంది. అలా చేస్తే పెళ్ళి మానుకుంటామని మగపెళ్ళివారు హెచ్చరించారు. ఆ పెళ్ళి కోడుకుతో "వెళ్ళవయ్యా వెళ్ళు" అని కరాఖండిగా చెప్పి తన తమ్ముడికే అండగా ఉండాలన్న దృఢ నిశ్చయానికి వచ్చింది. నిజంగా ఆమెది "దివ్య"మైన మనసు కదూ...
Friday, January 23, 2009
నాకు పింఛనొద్దు మొర్రో...
అధికారిక దాఖలాల ప్రకారం ఒరిస్సాలోని జగత్‌సింగ్‌పూర్ జిల్లా సాలిజంగ గ్రామానికి చెందిన బంధుదాస్ వయసు 100 ఏళ్ళు దాటింది. బంధుదాస్ పేదవాడైనా అందరికీ ఆత్మబంధువులా మెలుగుతూ తన పనులు తానే చేసుకుంటాడు. ఆ మధ్య కొందరు ప్రభుత్వాధికారులు ఈయన దగ్గరికొచ్చి "అన్నట్టు మీకింకా పింఛన్ అందడంలేదని తెలిసిందండీ... ఇప్పించాలని నిర్ణయించుకున్నాం" అని చెప్పారట. దాంతో చిర్రెత్తుకొచ్చిన బంధుదాస్ "పనులు చేసుకోలేనివాళ్ళు, కష్టాల్లో ఉన్నవాళ్ళకు ప్రభుత్వం సాయం చెయ్యాలి గానీ కాళ్ళూ చేతులు ఆడుతున్నవాళ్ళకు కాదురా బాబు. పింఛనిచ్చి నన్ను ముసలోణ్ణి చెయ్యొద్దు. నాకు పింఛనొద్దు మొర్రో..." అని వాళ్ళను వచ్చినదారినే పంపించేశాడు.
బంధుదాస్ దినచర్యను పరిశీలిస్తే... ఉదయమే 5 గంటలకల్లా లేస్తాడు. కొద్దిగా పాలు, మరమరాలు అల్పాహారంగా తీసుకుని తన ఆవులకు గ్రాసం కోసం తన గ్రామానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న పొలాలకెళతాడు. తన కోసం ఓ నాలుగు తమలపాకులు తెచ్చుకుంటాడు. పశువులకు తన చేత్తో స్వయంగా తినిపిస్తాడు. అప్పుడప్పుడూ పొలంపనుల్లో ఓ చెయ్యి వేస్తాడని గ్రామస్తులు చెప్పారు.
గ్రామ కార్యక్రమాల్లో పాల్గొని జానపద గీతాలు ఆలపించే బంధుదాస్‌ను రోగాలేవీ సమీపించడం తాము చూడలేదని, ఇప్పటికీ ఆయన వద్ద కళ్ళజోడు లేదని కోడలు లత చెప్పింది. దాసు గారికి ఇద్దరబ్బాయిలు, ఇద్దరమ్మాయిలు కాగా, భార్య లబానీకి 90 ఏళ్ళు. అయితే, దురదృష్టవశాత్తు ఆమె పక్షవాతంతో మంచం పట్టింది. తన ఆహారంలో భాగంగా స్వచ్ఛమైన పాలు, పాల ఉత్పత్తులు, నెయ్యి తీసుకుంటానని దాస్ చెప్పారు. ఈ ప్రాంత ప్రజలందరికీ బంధుదాస్ మార్గదర్శకునిగా, స్ఫూర్తి ప్రదాతగా నిలిచారని పొరుగున ఉన్న బలన్సా గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త సంతోష్ సాహు అన్నారు.

Saturday, December 27, 2008
వీడేరా పోలీస్...
నాన్నా అని పిలిపించుకోవడానికి పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాల్సిన పనిలేదు. మరి అక్రమ సంబంధం ద్వారా పిల్లల్ని కంటేనో... అంటారా ? అలాంటి వాళ్లకు తల్లిదండ్రులుగా చెప్పుకునే అర్హత అంతకన్నా ఉండదు. ఆత్మీయతను అందుకోవడానికీ, అనురాగాన్ని పంచుకోవడానికీ ఉన్న మరో మార్గం మానవత్వం. అదే ఒక పోలీస్‌ను నాన్నా అనిపించింది. ఇది వరంగల్ జిల్లాలోని మరిపెడలో చాలాకాలం కిందట జరిగిన సంఘటనే అయినా ఇప్పుడే నా దృష్టికి వచ్చింది. ఇక నేరుగా విషయంలోకి వచ్చేద్దాం...
ఈ జిల్లాలోని మరిపెడ గ్రామానికి 1997 ప్రాంతంలో 27 ఏళ్ల వయసుగల మతి స్థిమితం లేని ఒక యువతి ఎక్కడి నుంచో వచ్చింది. ఆమెకు తెలుగు తెలియదు. ఊళ్లో వాళ్లు మాత్రం ఆమెను సత్యవతి అని పిలిచేవారు. మనం కూడా అలాగే పిలుద్దాం. సత్యవతి ఆ ఊళ్లో చెట్లు చేమల వెంట, బస్టాండ్ పరిసరాల్లోనూ తిరుగుతూ అడుక్కుంటూ ఉండేది. వయసులో ఉన్న యువతి పట్ల ఓ కామాంధుడి ప్రవర్తన కారణంగా పాపం ఆమె గర్భం దాల్చింది. తనకేమయిందో కూడా తెలియని స్థితిలో సత్యవతి అలాగే ఊరంతా తిరుగుతూ ఉండేది. రోజులు గడుస్తుండగా ఆమె ఒక రోజున ప్రసవవేదన పడుతుంటే అక్కడివారు ఆటో ఎక్కించి ఆసుపత్రికి పంపిస్తున్న తరుణంలో ఆటోలోనే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. జరిగిందేంటో కూడా తెలియక ఆ పిచ్చితల్లి బిడ్డను కన్న వెంటనే రోడ్డెక్కి అడుక్కోవడానికి వెళ్లిపోయింది. బస్టాండ్‌లో ఆ పసిగుడ్డు అలాగే పడి ఉంది.
మరిపెడలోని పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న రామరాజు సాంబయ్య ఈ విషయం తెలుసుకుని ఆ పసిబిడ్డను అక్కున చేర్చుకున్నారు. బిడ్డకు వేద శాస్త్రోక్తంగా సాయికిరణ్ అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేస్తున్నారు. అక్కడి లిటిల్ ఫ్లవర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో సాయికిరణ్‌ను చేర్చగా ఈ చిచ్చరపిడుగు అతని ఆశలు నెరవేర్చుతూ నూటికి నూరు మార్కులు సంపాదించి చల్ మోహనరంగా అంటున్నాడు. ప్రతి ఏటా డిసెంబర్ 10వ తేదీన ఈ దేవుడిచ్చిన బిడ్డకు రామరాజు ఘనంగా పుట్టినరోజు జరుపుతుంటారు. అంతేకాదు, ఈ చిన్నారి జీవితంలో కొత్త కోణాన్ని ఆవిష్కరించేందుకు ప్రతి నెలా రూ.2 వేల చొప్పున అక్కడి తపాలా కార్యాలయంలో జమ చేస్తూ వస్తున్నారు. నన్నడిగితే... వీడేరా పోలీస్ అంటాను.

Friday, December 26, 2008
సునామీ... షాజన్ ఉన్నాడు సుమీ!
జీవితాల్ని నాశనం చెయ్యడం నీకు తెలిస్తే... దాన్ని కాపాడుకోవడం ఎలాగో నాకు తెలుసు. సునామీ... నేనున్నాను సుమీ అంటూ నాలుగేళ్ల కిందట ఇదే రోజున (డిసెంబర్ 26, 2004) చోటుచేసుకున్న జలప్రళయం బారిన పడకుండా నాలుగు నిండు జీవితాల్ని కాపాడాడు తమిళనాట కన్యాకుమారి జిల్లాలో కడియపట్టణానికి చెందిన షాజన్. ఈ ఘటన జరిగినప్పుడు ఎనిమిదవ తరగతి చదువుతున్న షాజన్ సాహసాన్ని ప్రభుత్వం గుర్తించగా రాష్ట్ర ముఖ్యమంత్రి కరుణానిధి ఇతనికి 'జీవన్‌రక్ష' పురస్కారమిచ్చి గౌరవించారు. అసలేం జరిగిందో తెలుసుకుందాం.
ఇక్కడి సెయింట్ పీటర్ మాథ్యమిక పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న షాజన్ డిసెంబర్ 26, 2004వ తేదీ ఉదయం 9.30 గంటల సమయంలో ఆడుకోవడానికి ఇంటికి దగ్గర్లో ఉన్న సముద్ర తీరానికి వెళ్ళాడు. ఎగసిపడుతున్న అలల్ని చూచి కేరింతలు కొడుతున్నాడు. అంతలో ఓ భారీ కెరటం షాజన్‌ను కొట్టుకుంటూ తీసుకుపోగా అతని ఒక ఇంటి పై కప్పుమీదకెళ్ళి పడ్డాడు. అది శేఖరాజన్ అనే వ్యక్తి ఇల్లు. ఆ ఇంట్లో కూడా పూర్తిగా నీరు చేరింది. పై కప్పు మీద ఉన్న షాజన్‌కు ఆ ఇంట్లోంచి ఏడుపు వినిపించింది. ఆ ఇంటివారిని అప్రమత్తం చేసిన షాజన్‌ను చూచి కాపాడమంటూ తన మూడు నెలల పసికందును కింద ఉన్న శేఖరాజన్ అతనికి అందించాడు. ఆ బిడ్డను జాగ్రత్తగా పొదివి పట్టుకున్న షాజన్ పక్కింటి కప్పుపై సురక్షితంగా ఉన్న వృద్ధుని చేతిలో పెట్టాడు.
అప్పుడే ఛార్లెస్ అనే వ్యక్తి ఇంట్లోంచి ఏడుపులు, పెడబొబ్బలు వినిపించగా షాజన్ ఆ ఇంటి పైకప్పు ఎక్కి పైనున్న పెంకులు తొలగించి చూశాడు. అందులో తన మిత్రుడు విన్‌బ్రాండో, అతని చెల్లెలు నీటిలో చిక్కుకుని కనిపించారు. షాజన్ వారికి పైనుంచి తన చెయ్యి అందించి సినిమాల్లో చూపించే దృశ్యాల్లోలా వారిని పైకి లాగేందుకు ప్రయత్నించాడు. పట్టు జారిపోతున్నప్పటికీ పట్టు విడువక వారిని ఉడుం పట్టుతో విజయవంతంగా పైకి లాగి కాపాడాడు. అదే సమయంలో విద్యుత్ స్తంబానికి వేలాడుతూ కనిపించిన ఆంటోని శ్యామల అనే మహిళను కూడా షాజన్ రక్షించాడు. కిందకు దిగడానికి వీల్లేనంతగా సముద్రపు నీరు ఉండగా నేర్పరితనంతో ఇళ్ల పైకప్పులెక్కుతూ వారికి ప్రాణదానం చేశాడు ఈ జాలరి బిడ్డ. మరొకరైతే తాను బయటపడినందుకు బతుకు జీవుడా అంటూ తలదాచుకునేవారే తప్ప షాజన్‌లాగా స్పందించేవారా.

సునామీ నువ్వెంత?
సునామీ బాధితులైన ఆ చిన్నారులంతా చెన్నైలోని అన్నైసత్య అనాథ శరణాలయంలో ఆశ్రయం పొందుతున్నారు. సర్వం కోల్పోయి అనాథలుగా మిగిలారు. వారు కుమిలిపోలేదు సరికదా బాధల్ని నమిలి మింగేసి, తమలాంటి మరిందరిని ఆదుకునేందుకు సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని కష్టాల అంధకారంలో కాంతి పుంజాల్లా కదులుతున్నారు. వీళ్లు చేపట్టిన కొన్ని కార్యక్రమాల గురించి తెలుసుకుందాం. సునామీ సంభవించి ఏడాది పూర్తయిన సందర్భంగా 2005 డిసెంబర్ నెలలో 66 మంది చిన్నారులు 20 నిమిషాల వ్యవధిలో 72 అడుగుల పొడవైన భారీ చిత్రకళాఖండాన్ని రూపొందించారు. దీంతో అప్పటి వరకూ ఉన్న 43 అడుగుల పొడవైన కళాఖండం రికార్డు చెరిగిపోయింది. మరో సందర్భంలో వీరంతా కలసి 24 గంటల సమయంలో 35 ఎకరాల స్థలంలో 1.74 లక్షల మొక్కలు నాటి గిన్నిస్ బుక్ రికార్డులకెక్కారు. తమ సర్వస్వాన్నీ దూరం చేసిన సునామీని వెక్కిరిస్తూ విజయాలు సాధించుకుంటూ పోతున్న ఈ చిట్టి మనసుల ముందు ఓ సునామీ... నువ్వెంత?
అన్నట్టు మరో విషయం సు(నా)మీ... మా ప్రభుత్వాలది కూడా నీలా కరడుగట్టిన హృదయమే. అయితే, ప్రజలది మాత్రం మంచి మనసే. దాయాది దేశమైన పాకిస్థాన్‌లోని లాహోర్ నగరంలో చదువుకుంటున్న విద్యార్థినులు కొందరు భారత సునామీ బాధితులకు చేయూతనిచ్చేందుకు వెయ్యి డాలర్ల నిధిని చెక్కు రూపంలో భారత ప్రధానమంత్రికి అందించారు. భారత్‌లో సునామీ వస్తే పాకిస్థాన్ జనం సంతోషిస్తారనుకున్నావు కదూ. వెర్రి సునామీ... జనాన్ని విడదీద్దామనుకున్నావు. నీ పాచికలు పారవులే.

Saturday, December 13, 2008
రక్త సంబంధం ఎన్టీఆర్, సావిత్రి...
ఇది రక్తసంబంధం సినిమాలో అన్నా చెల్లెళ్లుగా నటించిన ఎన్టీఆర్, సావిత్రి గురించి కాదుగానీ... అంతకంటే గొప్ప నిజజీవిత పాత్రల గురించి. కాకపోతే ఈ నిజ జీవితగాథలో ఇద్దరికీ పెళ్లి కాలేదు, వీళ్లు డబ్బున్నోళ్లు కాదు. అదే తేడా. ఇక సిద్ధయ్య వయసు 50 ఏళ్ల పైమాటే... అతని చెల్లెలి వయసు బహుశా 40 పైన ఉండొచ్చు. అయినా అతనికి ఆమె "చిట్టి" చెల్లెలే. ఎందుకంటే ఆమెకు పాపం మూర్ఛరోగమట. తాను పెళ్లి చేసుకుంటే తన భార్య, పిల్లల మధ్య ఆమెను పట్టించుకోగలనో లేదో అన్న అనుమానంతో సిద్ధయ్య పెళ్లే చేసుకోలేదు. వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ మండలంలోని తాటికొండ గ్రామానికి చెందిన సిద్ధయ్య తల్లిదండ్రులు వీరి చిన్న వయసులోనే గతించారు. అప్పట్నుంచీ చెల్లెలు లచ్చవ్వకు అన్నీ సిద్ధయ్యే. తన జీవితాన్ని చెల్లెలి సేవకు అంకితం చేసేశాడు. ఆస్తి పాస్తులేమీ లేకపోవడంతో గత కొన్నేళ్లుగా అడవికెళ్లి కట్టెలు కొట్టి వాటిని అమ్మగా వచ్చిన డబ్బుతో ఏ రోజుకారోజు బియ్యం కొనుక్కుని చెల్లెలికి వంట చేసిపెట్టి తానూ తింటాడు. ఊరిలో ఎవరి ఇల్లయినా ఖాళీగా ఉంటే వీరు అందులో నివసిస్తుంటారు. వయసు మీదపడిన కొద్దీ శరీరం సహకరించడం లేదని బాధపడుతుంటాడు సిద్ధయ్య. అనుబంధాలు అడుగంటిపోతున్న ఈ రోజుల్లో చెల్లెలి సుఖమే తన జీవితంగా భావించే సిద్ధయ్య లాంటి మనుషులు ఇంకా మన మధ్య ఉన్నారనేది నిజంగా నిజం.
సరోజ చేతిలో ఎర్రజెండా
గడచిన పాతికేళ్లుగా వేలూర్‌లోని వళ్లలార్ బస్టాండ్ గుండా వెళ్లే చెన్నై - బెంగళూర్ జాతీయ రహదారి ప్రాంతంలో చిన్న ప్రమాదం కూడా జరగలేదు. ఇక్కడేదో అదనపు ట్రాఫిక్ పోలీస్ పికెట్ గానీ, ప్రత్యేకంగా సిగ్నలింగ్ వ్యవస్థ గానీ ఉందనుకోకండి. అందుకు కారణం దాదాపు 70 ఏళ్ల పిల్ల (ఆమె చురుకుదనం చూచి నాకైతే ఇలాగే అనాలనిపిస్తోంది) సరోజ చేతిలో ఉండే ఎర్ర జెండా. అందరూ మామీ అని పిలిచే సరోజ ఆ రహదారిపై నిలబడి ఎర్రజెండా చూపిస్తే సైకిల్ నుంచి పంజాబ్ లారీ వరకూ వాహనాలన్నీ ఆగిపోవాల్సిందే. అప్పుడామె తన దగ్గర గుంపుగా నిలుచున్న పిల్లలు, విద్యార్థులు, మహిళలు, వృద్ధుల్ని రోడ్డు దాటిస్తుంది. అవతలకెళ్లి ఎర్రజెండా దించాకే ఆ వాహనాలన్నీ కదుల్తాయి. ఇక ఈమె చరిత్ర తెలుసుకుందాం.
సరోజ ఈ ప్రాంతంలోని పర్వతమలై అనే కొండ దిగువన పోరంబోకు స్థలంలో పాత గుడిసెలో నివాసముంటుంది. ఒకప్పుడు స్థానిక గణపతి ఆలయంలో పూజారిగా పనిచేసే ఈమె భర్త వెంకటరామ అయ్యర్ కామెర్ల వ్యాధితో 20 ఏళ్ల కిందటే మరణించారు. అప్పట్నుంచీ పేదరికంతో బాధపడుతున్న సరోజకు 1982లో వంటమనిషిగా ఉద్యోగమిచ్చారు. 1997లో పదవీ విరమణ వయసు రావడంతో ఆ పని కాస్తా పోయింది. కూతుళ్లిద్దరున్నా వారికి పెళ్లిళ్లు కావడంతో వారికి బరువు కాకూడదని ఈమె గుడిసెలోనే ఉంటూ వస్తోంది. ఈ నేపథ్యంలో సమాజానికి తనకు తోచిన, తాను చేయగల్గిన ఏదో ఒక సహాయం చెయ్యాలన్న తపనతో ఎర్రజెండా చేతబూని పిల్లలు, విద్యార్థులు, మహిళలు, వృద్ధుల్ని రోడ్డు దాటించి సహకరిస్తోంది. ఉదయం 8 గంటలకు మొదలయ్యే ఈ సేవ సాయంత్రం 5 గంటలకు పాఠశాల ముగియడంతో పూర్తవుతుంది. సరోజ సామాజిక స్పృహకు మెచ్చిన పాఠశాల యాజమాన్యం నెలకు రూ.200, ప్రభుత్వం ఇచ్చే నెలవారీ వృద్ధుల పింఛన్ మరో 200 రూపాయలు, పాఠశాల ఉపాధ్యాయులు వ్యక్తిగతంగా ఇచ్చేవి ఈమెకు జీవనాధారం. ముదిమిలోనూ మానవసేవతో జీవితంలో కొత్త కోణాన్ని ఆస్వాదిస్తున్న సరోజ మనందరికీ స్ఫూర్తిదాయకమే కదూ...

Friday, November 21, 2008
చీపురు పట్టాడు ఉద్యోగం కొట్టాడు
అక్కడ బోలెడు చెత్త కనిపిస్తోంది. ఉన్నతాధికారులు, పనివాళ్లు అటూ ఇటూ తిరుగుతున్నారు గానీ ఆ చెత్తను తొలగించాలన్న ఇంగితం ఒక్కరికీ కలగలేదు. అదే సమయానికి ప్రభుత్వ శాఖల్లో తాత్కాలిక ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూకు వచ్చిన వాళ్లతో ఆ ప్రాంగళం కిటకిటలాడుతోంది. ఇంటర్వ్యూకోసం సూటు బూటు వేసుకుని వచ్చిన 26 ఏళ్ల వికలాంగుడు గోపికన్నన్ పరిస్థితిని గమనించాడు. ఇక ఏమీ ఆలోచించలేదు. వెంటనే అక్కడున్న చీపురు కట్ట తీసుకున్న ఊడ్చడం మొదలు పెట్టి పని పూర్తి చేశాడు. ఇతను ఊడ్చుతున్నప్పుడు అక్కడే ఉన్న పత్రికా ఫోటోగ్రాఫర్లు విలేఖరులు, గోపీకన్నన్ చొరవను ప్రశంసిస్తూ మర్నాడు పత్రికల్లో ప్రశంసిస్తూ వార్తలు వేసారు. ఈ విషయం రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న జయలలిత దృష్టికి వెళ్లడంతో వెంటనే మదురై మార్కెటింగ్ కాంప్లెక్స్‌లో సెక్యూరిటీ గార్డుగా ఉద్యోగమిస్తూ ఉత్తర్వులిచ్చారు.
అసలు విషయం మీకు ఇంకా చెప్పలేదుగా... రాష్ట్రం మొత్తాన్ని పరిపాలించే ముఖ్యమంత్రి కార్యాలయానికి వేదికైన చెన్నైలోని సచివాలయంలో 2003 జులై నెలలో ఈ సంఘటన జరిగింది. గోపికన్నన్ వికలాంగుడే అయినా విద్యార్హతలతోబాటు జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొని పతకాలు సాధించిన మొనగాడు. మదురైలోని సుబ్రమణ్యపుర టీచర్స్ కాలనీ ఇతని నివాసం.

పద్యంతో మద్యం మాయం
అది పశ్చిమగోదావరి జిల్లా కొత్త తలారివాని పాలెం గ్రామం. మద్యం చుక్క పడందే నిద్రపట్టని గంగరాజు పూటుగా తాగి రాత్రి 9 గంటలకు ఇంటికొచ్చాడు. ఐదో తరగతి చదువుతున్న ఇతని కొడుకు పడాల మహలక్ష్మినాయుడు ఆ రోజే తన పాఠశాలలో జరిగిన ఒక కార్యక్రమంలో అద్భుతంగా పద్యాలు పాడి ఒక స్టీల్ కంచం బహుమతిగా అందుకున్నాడు. తండ్రికి ఈ బహుమతి చూపించాలన్న ఆరాటంలో తను సాధించిన బహుమతిని అతనికి చూపించాడు ఆ చిన్నారి. మందు పుచ్చుకున్న మత్తులో ఉన్న గంగరాజు దాన్ని విసిరికొట్టాడు. పాపం ఆ కొడుకు హృదయం గాయపడి నిద్రపోయాడు. కాసేపటికి మత్తుదిగిన గంగరాజు ఆ కంచం ఎప్పుడు కొన్నావని భార్యను అడిగాడు. ఆవిడ జరిగిన సంగతంతా చెప్పింది. తన ప్రవర్తనకు బాధపడిన గంగరాజు వెంటనే కొడుకును నిద్రలేపి పద్యాలు పాడమన్నాడు. తండ్రి అలా అడగటమే మహాభాగ్యంగా తలచిన ఆ కొడుకు వెంటనే రెండు పద్యాలు పాడి వాటి అర్థాలు వివరించాడు. గంగరాజు హృదయం గంగలా ఉప్పొంగింది. స్టీల్ కంచంకంటే పెద్ద బహుమతే ఇస్తాను ఏం కావాలో కోరుకోమని కొడుకుతో అన్నాడు. అందివచ్చిన అవకాశాన్ని జారవిడుచుకోని ఆ కొడుకు ఇక ఏనాడు తాగరాదని తండ్రిని కోరాడు. ఊహ తెలిసినప్పటి నుంచి మద్యంతోనే పెరిగిన గంగరాజు కొడుక్కి మాట ఇచ్చి నిలబెట్టుకున్నాడు.
ఇక దీని మూలానికొద్దాం. మహాలక్ష్మి నాయుడు చదువుతున్న పాఠశాలలోని అతని గురువు పీలా బాబ్జీ ఈ బాలుడికి పద్య పఠనం నేర్పారు. అనకాపల్లిలో జరిగిన వివి రమణ వర్థంతి సభ సందర్భంగా బాబ్జీ తన గురువైన డాక్టర్ మెరుగుమిల్లి వెంకటేశ్వరరావు సమక్షంలో మిగతా పిల్లలతోబాడు నాయుడుచేత కూడా పద్యాలు పాడించారు. రసరమ్యంగా ఉన్న నాయుడి ఆలాపనకు ముగ్ధులై ఈ కంచం బహుమతిగా ఇచ్చారు. ఆ పద్యమే ఆ తండ్రిచేత మద్యం మాన్పించింది. గంగరాజు భార్య సన్యాసమ్మ ఎన్నోమార్లు భర్తచేత తాగుడు మాన్పించాలని ప్రయత్నించింది. తాగనని గంగరాజు మాట ఇచ్చి మళ్లీ అదే బాట పట్టేవాడు. కానీ కొడుకు పద్యం వారి జీవితానికి కొత్త కోణాన్ని చూపించింది.

Friday, October 10, 2008
దానవీరశూర బాల కర్ణ
నాన్నా, ఈ కుర్రాడెవరు ? అని వార్తాపత్రిక చదువుతున్న తన తండ్రిని అందులో ఉన్న ఫొటో గురించి అడిగాడు ఐదేళ్ల సంజీవ్ కుమార్.
"అతనికి గుండె జబ్బు బాబూ. సాయం చెయ్యమని అడుగుతున్నారు. ఆపరేషన్ చెయ్యకపోతే చచ్చిపోతాట్ట" అని బదులిచ్చాడు తండ్రి వేణుగోపాల్.
"ఆ సాయం మనం చెయ్యలేమా నాన్నా ?" అడిగాడు సంజీవ్.
"అంత డబ్బు మన దగ్గర లేదుగా..." బదులిచ్చాడు నాన్న.
"సరేగానీ, నాకు ఈ దీపావళికి ఎన్ని రూపాయల బాణసంచా కొనిస్తావ్?" చెప్పు అనడిగాడు ఈ చిన్నారి.
తండ్రికి ఈ ప్రశ్న ఎందుకో అర్థం కాకపోయినా... "ఓ 2,500 రూపాయలవి కొంటా" అని చెప్పాడు నాన్న.
"అయితే, ఆ డబ్బు ఆ అబ్బాయికిచ్చి సాయం చేద్దాం." అని సంజీవ్ చెప్పగానే ఒక్కసారి ఆ కన్న తండ్రికి ఒళ్లు పులకరించి గగుర్పొడిచింది. చిన్న పిల్లాడికి వచ్చిన ఆలోచన తనకు రాకపోవడం పట్ల సిగ్గుపడ్డాడు కూడా.
ఈ సంఘటన 2003లో జరిగింది. ఆ రోజు మొదలుకొని చిన్నారి సంజీవ్ తన తండ్రి ఇచ్చే పాకెట్ మనీతో ఓ 50 మందికి పైగా ఆపన్నులను ఆదుకున్నాడు. ఈ సాయాన్ని అతను పోస్ట్ ద్వారా పంపిస్తాడు. సాయమందుకున్నవారు కృతజ్ఞతతో రాసే ఉత్తరాల్ని చూచి పరమానందం పొందుతుంటాడు ఈ చెన్నై చిన్నారి.
హాకీ వీరుడుకూడా అయిన ఈ బాలకర్ణుడు స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ అథారిటీ ద్వారా తమిళనాడు తరఫున పలు అంతర్ రాష్ట్ర పోటీల్లో పాల్గొన్నాడు. మంచి హాకీ క్రీడాకారునిగా ఎదిగి ఆ డబ్బుతో తన సేవలను కొనసాగిస్తాట్ట. ఈ బుల్లి కర్ణుడి ఆశయం ఎన్నో జీవితాలకు కోత్త కోణాల్ని చూపించాలని ఆశిద్దాం.

Sunday, September 21, 2008
కుక్కపిల్ల ఉచితం
ఎవరైనా వికలాంగులను పెళ్లి చేసుకున్న విషయం ఆమె చెవినబడితే చాలు. వెంటనే వివరాలు తెలుసుకుని వీవీఐపీల ద్వారా వారికి కావలసిన సామగ్రి అందచేయడం తమిళనాడులోని నామక్కల్ పట్టణంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సహాయకురాలిగా పనిచేస్తున్న మలర్ విళి అలవాటు. ఆవిడ అంతటితో ఆగిపోదు. అవయువాలన్నీ సక్రమంగా ఉన్న మనుషులకే నేటి సమాజంలో ఒంటరి పోరాటం తప్పడంలేదు. అందుకే ఆపత్సమయంలో అండగా ఉండేందుకు వికలాంగులకు ఒక కుక్కపిల్లను కూడా కొనిస్తారీమె. తాను కూడా వికలాంగురాలు కావడంతో వికలాంగుల బాధలు ఎలా ఉంటాయో మలర్ విళికి బాగా తెలుసు. వికలాంగులకు ప్రయివేటు సంస్థల్లో ఉద్యోగాలు కల్పించేందుకు ఈమె కృషి చేస్తూ వారి సమస్యల పరిష్కారం కోసం జిల్లా కలెక్టర్‌తో చర్చలు జరుపుతారు.
తన తల్లిదండ్రుల ఎనిమిది మంది సంతానంలో ఒకరైన మలర్ విళి చరిత్రలో ఎం.ఎ పట్టా అందుకున్నారు. గృహిణిగా, ఉద్యోగినిగా, సామాజిక సేవకురాలిగా ఎన్నో బాధ్యతలు విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఈమె గురించి తెలిసేనాటికి ఈవిడ నామక్కల్‌లో పనిచేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగినిగా ఎక్కడికి బదిలీ అయితే ఆ ప్రాంతంలో తన సేవలు కొనసాగిస్తుంటారు.

Sunday, August 17, 2008
మనసున్న మెకానిక్
చెన్నై జాఫర్‌ఖాన్ పేటలో ఉంటున్న సెంథిల్ (ఇతని గురించి తెలిసేనాటికి ఇతని వయసు 30) కార్ల మెకానిక్, పెద్దగా చదువుకోలేదు. ఇతని స్నేహితుడు విశాకన్‌కు పాపం పోలియో వల్ల ఎడమకాలు, కుడి చెయ్యి సరిగ్గా పనిచెయ్యవు. తన మిత్రుడికి ఎలాగైనా సహాయపడాలన్నది సెంథిల్ కోరిక. వెంటనే రంగంలోకి దిగి వికలాంగులు అవలీలగా నడపడానికి వీలుగా విశాకన్ వాహనంలో మార్పులు చేశాడు. అందులోని సీట్లు, యాక్సిలేటర్, బ్రేకులు వంటి భాగాలను ఎలాంటి ఇబ్బందీ లేకుండా వికలాంగులు ఉపయోగించుకునేలా రూపొందించాడు. హెడ్‌లైట్లు, హారన్ వంటివి పనిచెయ్యడానికి ఒకే స్విచ్ ఉండేలా సెంథిల్ ఏర్పాట్లు చేశాడు. సెంథిల్ తన స్నేహితుడు కావడం గర్వకారణమంటున్న విశాకన్ ఒకప్పుడు తన వాహనంలో కొంత దూరం వెళ్లడానికి కూడా చాలా కష్టపడాల్సి వచ్చేదని, ఇప్పుడు 50 కిలోమీటర్లకు మించి స్వయంగా ప్రయాణిస్తున్నట్లు చెప్పాడు. ఈ స్నేహితుల గురించి తెలుసుకున్న చాలామంది వికలాంగులు ఇప్పుడు తమ కార్లతో సెంథిల్ షెడ్ వద్ద బార్లు తీరుతున్నారు.
Subscribe to:
Posts (Atom)