సవీతా టీచర్ ఇంటికి వెళితే ఇనుప వలల మధ్య భద్రంగా ఉన్న ఒక స్కూటర్ కనిపిస్తుంది. అదేదో కేరళ మహారాజులు ఉపయోగించిన స్కూటర్ అనుకోకండి. దాని మీద వాలే హక్కును కేవలం పిచ్చుకలకు మాత్రమే ఇచ్చారు ఆ టీచర్. ఆ ఊరి వాళ్ళు రోజూ వచ్చి ఆ స్కూటర్‌ని ఓసారి చూసి పోతున్నారు. కొద్ది రోజుల్లో ఈ సీన్ మారి మళ్ళీ ఆ స్కూటర్‌ని ఆవిడ వాడుకుంటారనుకోండి. అది వేరే విషయం ఇంతకీ అసలేం జరిగిందంటే...
ఉపాధ్యాయురాలైన సవీతా మహేంద్రన్ కేరళలోని సత్యమంగళం ప్రాంతంలో ఉన్న అరియప్పంపాళ్యం గ్రామంలో నివసిస్తుంటారు. ఆ మధ్య పని ఉండి ఓ వారం రోజులు సెలవు పెట్టి ఎక్కడికో వెళ్లి వచ్చారు. ఇంటికి వచ్చే సరికి తన స్కూటర్‌ని పిచ్చుకలు ఉపయోగించుకోవడం ఆమె చూశారు. కాళ్ళు పెట్టుకునే చోట పిచ్చుకలు గూడు కట్టుకుని గుడ్లు పెట్టాయి. ఓ రెండు రోజులయ్యాక వెళ్ళిపోతాయిలే... అనుకున్నారు కానీ అదేం జరగలేదు.
పిచ్చుకల గూడులోని మూడు గుడ్లలో రెండిటి నుంచి పిల్లలు బయటకొచ్చాయి. మరొకటి కూడా పగిలి పిచ్చుక పిల్ల బయటకు వచ్చి, అవన్నీ స్వేచ్ఛగా ఎగిరే వరకూ ఆ స్కూటర్‌ని తాను ఎక్కకూడదని సవీత నిర్ణయించుకున్నారు. తమ వల్ల పిచ్చుకలకు ఇబ్బంది కలగకూడదని, అటు ఎవ్వరూ వెళ్ళకుండా స్కూటర్ చుట్టూ ఇనుప వలలు కట్టించారు.
ఆ పిచ్చుకలు ఎగిరాకే... ఈ బండి చక్రం కదిలేది.
Monday, August 06, 2018
Wednesday, February 28, 2018
రాజు కోడి అక్కడుంటే జాగ్రత్తగా వెళ్ళాలి మరి...
కోడి పేరెత్తగానే ఎప్పుడు కూరొండుకుని తినేద్దామా అనుకుంటారు చాలామంది. అయితే తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లో ఉన్న ఓ కోడిపుంజు ఇంటికి కాపలా కాస్తూ విశ్వాసాన్ని చూపిస్తోంది. మామూలుగా అయితే, మనుషులు దగ్గరకు రాగానే కోళ్లు పరుగులు తీస్తాయి. కానీ సుల్తానాబాదులోని అమృతమ్మ ఇంటి దగ్గర కొత్తవాళ్ళు కనిపిస్తే కోడి వెంటనే దాడి చేస్తుంది. వెంటపడి, తరిమికొడుతుంది. ఈ పుంజు పిల్లగా ఉన్నప్పుడు దానిని ఓ కుక్క నోట కరుచుకుని తీసుకెళుతుండగా... అమృతమ్మ ఆ కుక్కను తరిమేసి కోడిపిల్లను రక్షించింది. చావు బతుకుల్లో ఉన్న ఆ కోడిపిల్లకు చికిత్స చేయించి చక్కగా పెంచి రాజు అని పేరు కూడా పెట్టింది. అప్పటి నుంచి అమృతమ్మకు ఈ కోడి పుంజుతో విడదీయలేని బంధం ఏర్పడింది. ఒంటరిగా ఉంటున్న అమృతమ్మకు ఈ కోడి పుంజు రక్షణ కల్పిస్తోంది. తన యజమానురాలి అనుమతి లేకుండా ఇంటి వస్తే మీద పడి పొడుస్తుంది. అమృతమ్మ ఆజ్ఞలను అక్షరాలా అనుసరిస్తుంది. ఇంటికి వచ్చినవారిపై ఆ పుంజు దాడి చేసినప్పుడు వద్దని అమృతమ్మ చెబితే చాలు వెంటనే ఆగిపోతుంది. జంతువులు, పక్షులను అందరూ చాలా చిన్నచూపు చూస్తారు. ఈ కోడిపుంజులాంటి చురుకైన పశుపక్ష్యాదులు ఈ సృష్టిలో చాలా ఉన్నాయి.
Wednesday, November 01, 2017
అందరూ అనుకుంటారు... ఇతను ఆచరించాడు
అవును... పేదోళ్ళకు ఎంతో సాయం చెయ్యాలని ఎందరో అనుకుంటారు. కానీ, జేబులోంచి డబ్బులు తీయాలనేసరికి 'తర్వాత ఎప్పుడైనా తీరిక ఉన్నప్పుడు చూద్దాం లే..' అనుకుని జీవితకాలం పాటు వాయిదా వేసుకుంటూ పోతారు. కానీ, హైదరాబాదు వాసి అయిన ఓ మల్టీ నేషనల్ కంపెనీ ఉద్యోగి గౌతమ్ కుమార్ మాత్రం తనకు ఆలోచన వచ్చిందే తడవుగా 'సర్వ్ నీడీ' (అవసరార్థులకు సేవ) అనే సంస్థను ప్రారంభించి ఎందరికో అండగా నిలిచాడు. గ్రామాలు, నగరాల్లోని రోడ్లు, ఫుట్ పాత్‌ల మీద కాస్తంత సాయం కోసం ఎదురు చూసి ఆలసిసొలసి పడి ఉండే ఎందరెందరో ఆభాగ్యులకు చూసిన గౌతమ్, వారికి ఎలాగైనా సాయమందించాలని తపనపడి ఈ మహత్కార్యానికి పూనుకున్నాడు. 'సర్వ్ నీడీ'కి అనుబంధంగా మొబైల్ మెడికల్ క్యాంపులు, లాస్ట్ రైట్స్ (అనాథ శవాలకు అంత్యక్రియలు) లాంటి ఎన్నెన్నో సేవా కార్యక్రమాల్ని చేపట్టి ఇందులో మరెందరినో భాగస్వాముల్ని చేశాడు. గౌతం సర్వ్ నీడీకి వందనం, సలాం, సెల్యూట్...
Monday, August 07, 2017
టీచర్ రంగయ్య... మీలా ఉంటే స్కూలు బాగయ్య !
తెలంగాణ రాష్ట్రం కుమరం భీం జిల్లా కెరమెరి మండలంలో ఉన్న సావర్‌ఖేడ్ గ్రామానికి వెళితే ఉపాధ్యాయులనేవారు ఎలా ఉండాలో తెలుస్తుంది. ఉపాధ్యాయ వృత్తిలో చేరాలనుకునేవారంతా ఈ గ్రామంలోని ప్రభుత్వ ఉపాధ్యాయుడు రంగయ్యను కలిస్తే ఈ వృత్తికున్న పవిత్రత ఏమిటో అర్థమవుతుంది. తాను పనిచేస్తున్న ఈ పాఠశాలలోని విద్యార్థులకు స్వంత డబ్బుతో డిజిటల్ పాఠాలు చెబుతున్నారు రంగయ్య. ఇది తెలుగు మీడియం పాఠశాల అయినా ఇంగ్లీష్ మీడియంను కూడా మొదలుపెట్టారు.
రంగయ్య అంతటితో ఆగలేదు. ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయులు సైతం తమ పిల్లలను ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్ళలో చేర్చుతుండగా ఆయన మాత్రం తన కూతురు అక్షరను ఇదే పాఠశాలలో చేర్పించి గ్రామస్థులకు, తోటి ఉపాధ్యాయులకు ఆదర్శంగా నిలిచారు. గ్రామ ప్రజలందరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని కోరుతున్నారు.
విద్యార్థులకు జాతీయ నాయకులు, సంఘ సంస్కర్తలు గుర్తుండేలా పాఠశాల గోడలపై మహత్మజ్యోతిబా ఫూలే, సావిత్రిబాయి ఫూలే, డాక్టర్ బీఆర్ అంబేద్కర్, మహాత్మాగాంధీ, సర్వేపల్లి రాధాకృష్ణ తదితరుల చిత్రాలతో పాటు దేశ, రాష్ట్ర చిహ్నాలు, భారతదేశ, ప్రపంచ చిత్రపటాలను వేయించారు. అలాగే విద్యార్థులకు సులువుగా అర్థమయ్యేలా గుణింతాలు, ఇంగ్లీష్, తెలుగు అక్షరమాలతో పాటు అంకెలను రాయించారు.
సావర్‌ఖేడ్ ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న ఆరుగురు విద్యార్థులు ఈ మధ్యనే తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గురుకుల పాఠశాలలకు ఎంపికయ్యారు. మరో విద్యార్థి చుక్కా రామయ్య పీపుల్స్ ప్రొగ్రెస్ టెస్ట్‌కు ఎంపికయ్యాడు. ఉపాధ్యాయుడు రంగయ్య కృషిని విద్యార్థుల తల్లిదండ్రులు ఎంతగానో ప్రశంసిస్తున్నారు.
ఉపాధ్యాయుడు రంగయ్య కృషి వల్ల సావర్‌ఖేడ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య బాగా పెరిగింది. ప్రభుత్వ పాఠశాల అయినప్పటికీ ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ఉపాధ్యాయుడు విద్యాబోధన కొనసాగిస్తుండడంతో గ్రామ ప్రజలు తమ పిల్లలను ఇతర పాఠశాలలకు పంపించకుండా ఈ ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు.
రంగయ్య అంతటితో ఆగలేదు. ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయులు సైతం తమ పిల్లలను ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్ళలో చేర్చుతుండగా ఆయన మాత్రం తన కూతురు అక్షరను ఇదే పాఠశాలలో చేర్పించి గ్రామస్థులకు, తోటి ఉపాధ్యాయులకు ఆదర్శంగా నిలిచారు. గ్రామ ప్రజలందరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని కోరుతున్నారు.
విద్యార్థులకు జాతీయ నాయకులు, సంఘ సంస్కర్తలు గుర్తుండేలా పాఠశాల గోడలపై మహత్మజ్యోతిబా ఫూలే, సావిత్రిబాయి ఫూలే, డాక్టర్ బీఆర్ అంబేద్కర్, మహాత్మాగాంధీ, సర్వేపల్లి రాధాకృష్ణ తదితరుల చిత్రాలతో పాటు దేశ, రాష్ట్ర చిహ్నాలు, భారతదేశ, ప్రపంచ చిత్రపటాలను వేయించారు. అలాగే విద్యార్థులకు సులువుగా అర్థమయ్యేలా గుణింతాలు, ఇంగ్లీష్, తెలుగు అక్షరమాలతో పాటు అంకెలను రాయించారు.
సావర్‌ఖేడ్ ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న ఆరుగురు విద్యార్థులు ఈ మధ్యనే తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గురుకుల పాఠశాలలకు ఎంపికయ్యారు. మరో విద్యార్థి చుక్కా రామయ్య పీపుల్స్ ప్రొగ్రెస్ టెస్ట్‌కు ఎంపికయ్యాడు. ఉపాధ్యాయుడు రంగయ్య కృషిని విద్యార్థుల తల్లిదండ్రులు ఎంతగానో ప్రశంసిస్తున్నారు.
ఉపాధ్యాయుడు రంగయ్య కృషి వల్ల సావర్‌ఖేడ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య బాగా పెరిగింది. ప్రభుత్వ పాఠశాల అయినప్పటికీ ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ఉపాధ్యాయుడు విద్యాబోధన కొనసాగిస్తుండడంతో గ్రామ ప్రజలు తమ పిల్లలను ఇతర పాఠశాలలకు పంపించకుండా ఈ ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు.
Friday, March 31, 2017
క్యాన్సర్ రోగుల కోసం ఐదు లక్షలిచ్చిన విద్యార్థినులు
హైదరాబాదులో ఐదుగురు విద్యార్థినులు సౌమ్య, సంయుక్త, అద్వితీయ, అనూష, సాత్విక అపూర్వమైన కార్యక్రమాన్ని నిర్వహించారు. క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల కోసం ఫిబ్రవరి 5న నోవాటెల్ హోటల్‌లో పాటలు పాడి డబ్బు సేకరించారు. సమాజానికి తమవంతు సేవ చేయాలని భావించిన ఈ విద్యార్థినులు ఒక బృందంగా ఏర్పడి సుమారు మూడు గంటలకు పైగా పాటలు పాడారు. మొత్తం 5 లక్షల రూపాయలు సేకరించి ‘గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్’కు అందజేశారు. హైదరాబాదులోని బేగంపేట పర్యాటకభవన్‌లో మార్చి 26న గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ వితరణ కార్యక్రమం జరిగింది. విద్యార్థులు సేకరించిన ఈ డబ్బును కృష్ణా జిల్లా కూచిపూడి గ్రామంలోని క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు అందజేస్తామని గ్రేస్ క్యాన్సర్ కో ఫౌండర్ డాక్టర్ చిన్నబాబు సుంకవల్లి తెలిపారు.
విద్యార్థిని సౌమ్య మాట్లాడుతూ తాను క్యాన్సర్ రోగులను చూశానని, వారికి ఏదైనా చేయాలని అనిపించేదని తెలిపింది. క్యాన్సర్ రోగులకోసం డబ్బు సేకరించేందుకు ఆరు నెలల క్రితమే కార్యాచరణ రూపొందించామని, లక్ష్మణచారి సంగీత కళాశాలకు చెందిన శశికళస్వామి ప్రోత్సాహంతో అనుకున్నది సాధించామని ఇందులో పాల్గొన్న సంయుక్త అనే ఇంటర్మీడియట్ విద్యార్థిని చెప్పింది. రోగులను ఆదుకునేందుకు ముందుకురావాలని వీరు పిలుపునిచ్చారు.
విద్యార్థిని సౌమ్య మాట్లాడుతూ తాను క్యాన్సర్ రోగులను చూశానని, వారికి ఏదైనా చేయాలని అనిపించేదని తెలిపింది. క్యాన్సర్ రోగులకోసం డబ్బు సేకరించేందుకు ఆరు నెలల క్రితమే కార్యాచరణ రూపొందించామని, లక్ష్మణచారి సంగీత కళాశాలకు చెందిన శశికళస్వామి ప్రోత్సాహంతో అనుకున్నది సాధించామని ఇందులో పాల్గొన్న సంయుక్త అనే ఇంటర్మీడియట్ విద్యార్థిని చెప్పింది. రోగులను ఆదుకునేందుకు ముందుకురావాలని వీరు పిలుపునిచ్చారు.
Tuesday, February 28, 2017
గోవు మెడలో గంట వద్దు... మహిళ ఉద్యమం
స్విట్జర్లాండ్ నివాసి నాన్సీ హోల్టన్ (42) గోవు మెడలో గంట వద్దంటూ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. నెదర్లాండ్‌లో జన్మించిన ఈమె తన ఎనిమిదేళ్ల వయసు నుంచి స్విట్జర్లాండ్‌లోనే నివసిస్తున్నారు. అవుల మెడలో తగిలించే గంటలు బరువుగా ఉంటాయని, అవి ఆవు చర్మానికి రాసుకుపోయి గాయాలు చేస్తుంటాయని నాన్సీ ఆవేదన చెందుతున్నారు. 100 డెసిబుల్స్ శబ్దం చేసే ఇలాంటి గంటలను మన కంఠంలో చెవులకు దగ్గరగా ఉంచుకోగలమా?’’ అని నాన్సీ నిలదీస్తారు. గోవు మెడలో గంటలు వద్దని ఆమె ప్రచార కార్యక్రమాలు చేపట్టారు. ఇదంతా ఒక ఎత్తయితే, నాన్సీ ఉద్యమం నచ్చని స్విస్ ప్రభుత్వం ఆమెకు పాస్‌పోర్ట్ ఇచ్చేందుకు నిరాకరించింది. జంతు హక్కుల కోసం పోరాడే నాన్సీ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా, మోడల్‌గా పనిచేస్తున్నారు.
Saturday, December 31, 2016
పుస్తక ప్రియులకు, స్టాల్స్‌కు పిల్లలే చిల్లర ఇచ్చారు...
భారత ప్రభుత్వం పెద్ద నోట్లు రద్దు చేసిన సందర్భంలో ప్రజల్ని చిల్లర సమస్య ఎంతగా వేధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జనం చిన్న చిన్న అవసరాల కోసం ఏం కొనాలన్నా, వ్యాపారులు అమ్మాలన్నా ఎన్ని తిప్పలు పడ్డారో మనకు తెలియంది కాదు. ఈ పరిస్థితుల్లో డిసెంబర్ నెలలో జరిగిన హైదరాబాద్ పుస్తక ప్రదర్శనకు కూడా ఇబ్బందులు తప్పవనే అనుకున్నారు కానీ.... పుస్తక ప్రియులకు చిల్లర సమస్య ఉండరాదని భావించారు ఘట్‌కేసర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పాఠశాల విద్యార్థులు. వరుసగా మూడు రోజుల పాటు రోజుకు రూ.10 వేల చొప్పున బుక్ స్టాల్స్ నిర్వాహకులకు చిల్లర పంచారు. కాస్తంత చిల్లర కోసం జనం ఏటీఎంల దగ్గర క్యూలు కడుతున్నారు. చాలామంది అనారోగ్యం పాలయ్యారు కూడాను. ఈ పరిస్థితుల్లో ఆ చిన్నారులు రూ.40 వేల విలువైన చిల్లరను అందించడమంటే మామూలు విషయం కాదు ! భళా.. అంటూ ఈ పిల్లలను పుస్తక ప్రియులు నోరారా మెచ్చుకుంటున్నారని ఆ పాఠశాల డైరెక్టర్ ఉన్నికృష్ణన్ గర్వంగా చెప్పారు. తల్లిదండ్రులు, బంధువులు బహుమతిగా ఇచ్చిన చిల్లర డబ్బులను కిడ్డీ బ్యాంకుల్లో దాచుకున్న ఈ పిల్లలు వాటి ద్వారా పుస్తక ప్రియులకు సాయపడ్డారు. పుస్తక ప్రదర్శనలో ఈ పిల్లలను చూసిన పెద్దలందరూ బ్యాంకుల కన్నా ఈ చిన్నారులే మంచి సేవ చేశారని తెగ పొగిడారు.
Wednesday, November 30, 2016
వ్యాపారే గానీ మనసున్నోడు...
వెయ్యి, 500 నోట్ల రద్దయిన ప్రస్తుత పరిస్థితుల్లో చిల్లర కోసం జనం రోడ్ల మీదకు పరుగులు పెడుతున్నారు. స్త్రీలు, వృద్ధులు, పిల్లలు ఇలా వయో, లింగ భేదాలతో సంబంధం లేకుండా ఏటీఎంలు, బ్యాంకుల వద్ద రేయింబవళ్ళు పడిగాపులు కాస్తున్నారు. పెద్ద నోట్ల రద్దుతో జనం పడుతున్న కష్టాలు, బ్యాంకులు, ఏటీఎంల దగ్గర పెరుగుతున్న క్యూలను చూసిన ఓ వ్యాపారి వారి కష్టాలు తీర్చడానికి పెద్దమనసుతో ముందుకొచ్చాడు. తన దగ్గరున్న చిల్లర నోట్లు, నాణేలను బ్యాంకులో జమచేసి చిల్లర కష్టాలు తీర్చడానికి తనవంతు ప్రయత్నం చేశాడు. ఆయన పేరు చెందిన అవదేశ్ గుప్తా. ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌కు చెందిన ఈయన, బ్యాంకులో రూ.1.55 లక్షల మొత్తాన్ని చిల్లర రూపంలో జమచేశాడు. రూ.10, రూ.50, రూ.100 నోట్ల రూపంలో ప్రజల కోసం చిల్లరను జమ చేయడం విశేషం. ఒక వ్యాపారస్తుడైన అవదేశ్‌కు చిల్లర ఎంతో ముఖ్యం. ఆయన వద్ద చిల్లర ఉంటేనే వ్యాపారం బాగా సాగుతుంది. అయితే, చిల్లర డబ్బుల కోసం బ్యాంకుల వద్ద జనం పడుతున్న పాట్లను తొలగించాలనే సదుద్దేశంతో అవదేశ్ ముందుకొచ్చారు. లాభాపేక్షను పక్కన పెట్టి తక్కువ విలువ కలిగిన నోట్లను జమచేశారు. నవంబర్ 8వ తేదీన రూ.1000, రూ.500 నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రధానమంత్రి మోదీ స్వయంగా ప్రకటించారు. ఆ క్షణం నుంచే చిల్లర సమస్యలు చుట్టుముట్టాయి. అవదేశ్ లాంటివారు మరికొందరు ముందుకొస్తే దేశవ్యాప్తంగా చిల్లర సమస్య కొంతలో కొంతయినా పరిష్కారమవుతుంది.
Sunday, July 31, 2016
తెలియని స్నేహితురాలికి గిఫ్ట్‌గా టాయ్‌లెట్...
పుట్టినరోజులనగానే మనలో చాలామంది స్నేహితులిచ్చి టాయ్స్ కోసం ఎదురుచూస్తుంటాం. అయితే, చెన్నైలో ఉంటున్న విద్యార్థిని అక్షయ (13) తన పుట్టినరోజు సంబరాన్ని కొత్తగా చేసుకుంది. ఎనిమిదో తరగతి చదువుతున్న ఈ బాలిక, తన పుట్టినరోజు నాడు మరో పేద బాలికకు భలే బహుమతిని ఇచ్చింది. ఆమెకు టాయ్‌లెట్ కట్టించి చక్కని కానుకను ఇచ్చింది. తన పుట్టినరోజున మరో బాలికకు ఇలాంటి సాయం చెయ్యాలని అక్షయ తన తండ్రి జయకాంతన్‌కు చెప్పగానే ఆయన ఎంతో సంతోషించారు. టాయ్‌లెట్ అవసరం ఉన్న ఒక పేద కుటుంబాన్ని గుర్తించాల్సిందిగా Centre for Sustainable Development అనే ఎన్జీవోను కోరారు. ఆ సంస్థ కడలూరు జిల్లాలోని భువనగిరి పట్టణానికి దగ్గర్లో ఉన్న పెరుమత్తూరు ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని ఆర్తి కుటుంబాన్ని లబ్ధిదారుగా గుర్తించింది. అక్షయ తండ్రి జయకాంతన్ ఆ ఎన్జీవోకు 25 వేలు పంపి ఎకోశాన్ టాయ్‌లెట్ ఏర్పాటు చేయించారు.
ఈ రకమైన టాయ్‌లెట్‌కు నీరు అవసరం లేదట. ఆర్తి కుటుంబంలో పిల్లలు పెద్దలు కలిపి ఏడుగురు మహిళలున్నారు. ఈ సాయం వారందరికీ ఉపయోగపడుతుంది. అక్షయ పుట్టినరోజైన జులై 22 కల్లా ఆర్తి కుటుంబానికి ఈ టాయ్‌లెట్ ఉండేలా సిద్ధం చేశారు. ఆ రోజున ఆర్తి కుటుంబంతోనే అక్షయ గడిపి వారి ఆశీర్వాదం తీసుకుంది. ఈ ఫోటోలో అక్షయ, ఆర్తిలను చూడండి...
ఈ రకమైన టాయ్‌లెట్‌కు నీరు అవసరం లేదట. ఆర్తి కుటుంబంలో పిల్లలు పెద్దలు కలిపి ఏడుగురు మహిళలున్నారు. ఈ సాయం వారందరికీ ఉపయోగపడుతుంది. అక్షయ పుట్టినరోజైన జులై 22 కల్లా ఆర్తి కుటుంబానికి ఈ టాయ్‌లెట్ ఉండేలా సిద్ధం చేశారు. ఆ రోజున ఆర్తి కుటుంబంతోనే అక్షయ గడిపి వారి ఆశీర్వాదం తీసుకుంది. ఈ ఫోటోలో అక్షయ, ఆర్తిలను చూడండి...
Saturday, April 30, 2016
బాలికలకు అపురూపం... మీనమ్మ కానుక !
మీనా మెహతా... ఈ పేరు వింటే సూరత్, ఆ చుట్టుపక్కల పరిసరాల్లో ఉన్న బాలికలందరికీ ఒక ఆరాధనా భావం కలుగుతుంది. ఎందుకంటే, మీనా ఆ బాలికలకు అందిస్తున్న సాయం మిగతా దాతలకంటే భిన్నమైంది కనుక. సాధారణంగా పేద బాలబాలికలకు స్కూల్ యూనిఫారాలు, పుస్తకాలు, పెన్సిళ్లు, ఒక పూట భోజనం లాంటివి దాతలు అందిస్తుంటారు. కానీ, మీనా మెహతా రూటే సపరేటు. ఈమే ఆ విద్యార్థినుల ఆరోగ్యంపై దృష్టి పెట్టారు. స్కూళ్ళలోని బాలికలకు హైజీన్ కిట్స్, శానిటరీ నాప్‌కిన్స్ ఇచ్చి ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరాన్ని తెలియజెపుతుంటారు. ఈ హైజీన్ కిట్స్‌లో శానిటరీ నాప్‌కిన్స్‌తో పాటు లోదుస్తులు, షాంపూ ప్యాకెట్లు, సబ్బులు ఉంటాయి. సూరత్ పరిసరాల్లోని 22 మున్సిపల్ పాఠశాలలు, అంగవికలురకు ఉద్దేశించిన బడులలో మీనా ఈ కిట్స్ పంచుతుంటారు. ఇప్పుడామే విద్యార్థినులకే కాకుండా పేద మహిళలకు కూడా ఈ కిట్స్‌ని ఇస్తున్నారు. మీనా భర్త అతుల్ కూడా ఈ యజ్ఞంలో పాల్గొని తన వల్ల చెయ్యగల్గినదంతా చేస్తుంటారు.
Thursday, March 31, 2016
1000 బార్బీ బొమ్మలు ఊరికే ఇచ్చేస్తా...
అమెరికాలోని వర్జీనియా రాష్ట్రం నార్‌ఫోక్ ప్రాంతానికి చెందిన ఈ చిన్నారి 1000 బార్బీ డాల్స్ సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈమె పేరు గియానీ గ్రాహం (Gianni Graham) అవన్నీ తానొక్కత్తే ఆడుకోవడానికి కాదు. తనకి అలాంటి బొమ్మలు చాలానే ఉన్నాయి. కానీ, తనలాగా బొమ్మలతో ఆడుకునే భాగ్యం లేని నిరుపేద బాలికలకు పంచడానికి ఈ సేకరణ కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. ఆడుకునే తోడులేక ఒంటరిగా జీవించే బాలికలకు తానిచ్చే బొమ్మ ఒక స్నేహితురాలిగా ఉంటూ వారిలో నవ్వులు పూయిస్తుందని, అదే తనకు చాలని అంటోంది. తన ఈ కార్యక్రమానికి " ‘1K Barbiers For 1K Girls" అని నామకరణం చేసింది. ఇందుకోసం అదే పేరుతో ఒక వెబ్‌సైట్ కూడా ప్రారంభించింది. ఈ ఏడాది జనవరి నెల నాటికి 700 బొమ్మలు సేకరించింది. ఈ పాటికి మిగిలినవి కూడా సంపాదించే ఉంటుంది. మంచి పనులు చెయ్యడానికి డబ్బు మాత్రమే ఉండాల్సిన పనిలేదని చాటి చెప్పింది గియానీ...
Sunday, January 31, 2016
పిల్లల కోసం ముంబై కుర్రాడి వెదురు వంతెన
ప్రభుత్వాలు చెయ్యని (చెయ్యగలిగినవే...) పని 17 ఏళ్ల కుర్రాడు పూర్తి చేసి నేటి తరానికి, భావి తరాలకు ఆదర్శంగా నిలిచాడు. ముంబై నగరంలోని సాతే నగర్ ప్రాంతంలో బడికి వెళ్లడానికి రోజూ మురికి కాలువను దాటుతూ నానా అవస్థలు పడుతుండేవారు. ఆ చిన్నారుల అగచాట్లను గమనించిన ఎషాన్ బాల్‌బలే వారి కోసం తాత్కాలికంగా సాతేనగర్ నుంచి పీజీఎంపీ కాలనీ వరకు 100 అడుగుల మేర వెదురుతో ఒక వంతెన నిర్మించాడు. ఇప్పుడిది ఆ చిన్నారులకు విద్యా వరప్రదాయినిగా మారింది. ఈ కుర్రాడు థానేలోని బెడేకర్ కాలేజీలో ప్లస్ 2 చదువుతున్నాడు. ఈ వంతెన 4 అడుగుల వెడల్పుతో ఒకేసారి 50 మంది బరువును మోయగలదట. ఈ కుర్రాడి వంతెన వల్ల అక్కడ స్కూల్ డ్రాప్ అవుట్స్ తగ్గాయి. ఆ చిన్నారుల జీవితంలో కొత్త కోణాన్ని ఆవిష్కరించిన ఎషాన్‌ని మనసారా ఆశీర్వదిద్దాం...
Thursday, October 29, 2015
ఉచితంగా చెప్పులు, గొడుగులు కుట్టి ఇవ్వబడును
సాయం చెయ్యాలన్న మనసుండాలి గానీ, అందుకు చేతి నిండా డబ్బుండాల్సిన పనిలేదని నిరూపించాడు నెల్లూరు వాసి చాట్ల వెంకటరత్నం. ఈ పట్టణంలో మెయిన్ రోడ్డు వెంబడి ఉన్న విద్యుత్‌భవన్ ఆఫీసు ప్రహరీగోడకు ఆనుకుని కనిపిస్తుంది ఒక చిన్నపాక. అందులో రోజూ చెప్పులు కుడుతూ కనిపించే వ్యక్తే వెంకటరత్నం. అక్కడికొచ్చి చెప్పులు బాగు చేయించుకునే వారికి ఒక బోర్డు కనిపిస్తుంది. అది చదివితే చాలు.. వెంకటరత్నం దయాగుణం ఏంటో తెలుస్తుంది. ‘అనాధ బాలబాలికలకు, వికలాంగులకు, కుష్టువారికి, అంధులకు ఉచితంగా చెప్పులు, గొడుగులు కుట్టి ఇవ్వబడును’ అని ఆ పాకకు తగిలించిన చిన్న బోర్డు మీద రాసి ఉంది.
నిజానికి వెంకటరత్నం సేవలు ఇంతటితో ఆగలేదు. సంక్షేమ హాస్టల్స్‌లో ఉంటున్న విద్యార్థుల చెప్పులు, బ్యాగులు డబ్బు తీసుకోకుండా కుట్టిస్తాడు. డబ్బున్నవారు వాడి పడేసిన బ్యాగులు, చెప్పులు, గొడుగులను సంపాదించి వాటిని బాగుచేసి పైసా ఆశించకుండా పేద విద్యార్థులకు ఇస్తాడు. చిత్తు కాగితాలు ఏరుకునే వాళ్ల నుంచి కూడా ఏదో ఒక రేటుకు చెప్పులు, షూలు తీసుకుని వీలైనంత వరకూ సరిచేసి ఉచితంగా ఇచ్చేస్తాడు. ఆయన గురించి ఇంతకంటే ఇంకేం చెప్పాలి?
వెంకటరత్నం తండ్రి వెంకటగిరిలో చెప్పులు కుట్టుకునే వృత్తిలోనే ఉండేవారట. అదే ఊరిలోని సాంఘిక సంక్షేమశాఖ వసతిగృహంలో వెంకటరత్నం పదోతరగతి వరకు చదివాడు. అక్కడ తనతో ఉన్న స్నేహితుల బాధలను చూసి చలించిపోయాడు. వారి తల్లిదండ్రులు ఇచ్చే రూపాయి, అర్ధరూపాయి ఆ పిల్లలకు ఒక్కరోజు ఖర్చుకు కూడా చాలేవి కావు. ఆ విద్యార్థుల బ్యాగులు, చెప్పులు పాడైతే వాటిని తన తండ్రి దగ్గరకు తీసుకెళ్ళి కుట్టించేవాడు వెంకటరత్నం. తన తండ్రి మరణించడంతో కుటుంబ బాధ్యతలు వెంకటరత్నం మీద పడ్డాయి. నెల్లూరు చేరుకుని చెప్పులు కుట్టే దుకాణం పెట్టుకున్నాడు. నాటి నుంచి నేటి వరకూ హాస్టల్స్‌లో ఉంటూ చదువుకునే విద్యార్థుల బ్యాగులు, చెప్పులను డబ్బులు తీసుకోకుండా బాగు చేస్తూ సేవలందిస్తున్నాడు.
నెల్లూరులోని రైల్వేట్రాక్ పక్కనే ఒక పూరిపాకలో వెంకటరత్నం నివసిస్తుంటాడు. ముగ్గురు అమ్మాయిలు, ముగ్గురు అబ్బాయిలు అతని సంతానం. కుటుంబసభ్యులు వెంకటరత్నం సేవకు తోడుగా ఉన్నారు.
నిజానికి వెంకటరత్నం సేవలు ఇంతటితో ఆగలేదు. సంక్షేమ హాస్టల్స్‌లో ఉంటున్న విద్యార్థుల చెప్పులు, బ్యాగులు డబ్బు తీసుకోకుండా కుట్టిస్తాడు. డబ్బున్నవారు వాడి పడేసిన బ్యాగులు, చెప్పులు, గొడుగులను సంపాదించి వాటిని బాగుచేసి పైసా ఆశించకుండా పేద విద్యార్థులకు ఇస్తాడు. చిత్తు కాగితాలు ఏరుకునే వాళ్ల నుంచి కూడా ఏదో ఒక రేటుకు చెప్పులు, షూలు తీసుకుని వీలైనంత వరకూ సరిచేసి ఉచితంగా ఇచ్చేస్తాడు. ఆయన గురించి ఇంతకంటే ఇంకేం చెప్పాలి?
వెంకటరత్నం తండ్రి వెంకటగిరిలో చెప్పులు కుట్టుకునే వృత్తిలోనే ఉండేవారట. అదే ఊరిలోని సాంఘిక సంక్షేమశాఖ వసతిగృహంలో వెంకటరత్నం పదోతరగతి వరకు చదివాడు. అక్కడ తనతో ఉన్న స్నేహితుల బాధలను చూసి చలించిపోయాడు. వారి తల్లిదండ్రులు ఇచ్చే రూపాయి, అర్ధరూపాయి ఆ పిల్లలకు ఒక్కరోజు ఖర్చుకు కూడా చాలేవి కావు. ఆ విద్యార్థుల బ్యాగులు, చెప్పులు పాడైతే వాటిని తన తండ్రి దగ్గరకు తీసుకెళ్ళి కుట్టించేవాడు వెంకటరత్నం. తన తండ్రి మరణించడంతో కుటుంబ బాధ్యతలు వెంకటరత్నం మీద పడ్డాయి. నెల్లూరు చేరుకుని చెప్పులు కుట్టే దుకాణం పెట్టుకున్నాడు. నాటి నుంచి నేటి వరకూ హాస్టల్స్‌లో ఉంటూ చదువుకునే విద్యార్థుల బ్యాగులు, చెప్పులను డబ్బులు తీసుకోకుండా బాగు చేస్తూ సేవలందిస్తున్నాడు.
నెల్లూరులోని రైల్వేట్రాక్ పక్కనే ఒక పూరిపాకలో వెంకటరత్నం నివసిస్తుంటాడు. ముగ్గురు అమ్మాయిలు, ముగ్గురు అబ్బాయిలు అతని సంతానం. కుటుంబసభ్యులు వెంకటరత్నం సేవకు తోడుగా ఉన్నారు.
Thursday, July 30, 2015
ఖర్చు భరించి వైద్యం చేసిన డాక్టర్ గారు...
డాక్టర్లంటే రోగుల నుంచి ముక్కుపిండి డబ్బు వసూలు చేసేవారనే ముద్ర పడిపోయిన రోజులివి. కానీ వైద్య నారాయణులున్నారని నిరూపించారు హైదరాబాద్‌కి చెందిన డాక్టర్ ఉదయ్ కృష్ణ. ఒక లారీ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, కాలు నుజ్జునుజ్జయిపోయి, ఇన్ఫెక్షన్ సోకి గుండెలు అరచేతిలో పెట్టుకున్న ఒక రోగికి ఆపరేషన్ ఖర్చు 1.66 లక్షల రూపాయల్ని ఆయనే భరించారు. ఆ రోగి గుంటూరు జిల్లా వినుకొండకు చెందిన 42 ఏళ్ళ మహిళ కృష్ణకుమారి. యాక్సిడెంట్‌లో ఆమె కాలు విరిగిపోతే ఉన్న డబ్బంతా ఖర్చుచేసి ఆపరేషన్ చేయించుకున్నా ఫలితం లేకపోయింది. ఒక దశలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారావిడ. అలాంటి పరిస్థితుల్లో తెలిసినవారి ద్వారా డాక్టర్ ఉదయ్ కృష్ణను కలుసుకున్నారు. కృష్ణకుమారికి ఆర్థిక సహాయం, వైద్య సహాయం చేసి తను చేస్తున్న వైద్య వృత్తికి సార్థకత చేకూర్చారు డాక్టర్ ఉదయ్ కృష్ణ.
Thursday, April 30, 2015
దోపిడీ విద్యాసంస్థలు ఉమను చూసి సిగ్గు తెచ్చుకోవాలి..
తమిళనాడులోని తిరువల్లూర్ జిల్లాకు చెందిన ఉమ ఒక మామూలు గృహిణి. కానీ వీధి బాలల కోసం ఆమె చేసిన విద్యా సేవలు చూస్తే ప్రమాణాలు దిగజారిన మన విద్యావ్యవస్థ సిగ్గుతో తల దించుకోవాల్సిందే. రైల్వేస్టేషన్లు, బస్ స్టాండ్ల పరిసరాల్లో చదువూ సంధ్య లేకుండా తిరిగే వీధి బాలల కోసం ఏదో ఒకటి నిశ్చయించుకుని 2003లో సిరాగూ మాంటిస్సోరీ స్కూలును ఏర్పాటుచేశారామె. బిచ్చగాళ్ల పిల్లలు, వీధి బాలలు ఆ బడిలో చేరేలా ఆమె రోడ్లపై తిరిగి ప్రచారం చేశారు. ఆ పిల్లలకు ఐసిఎస్‌ఇ సిలబస్‌లో విద్యా బోధన చేశారు. అక్కడితో ఆగలేదు. జీవన్ విద్య పేరిట ఐఐటి కోచింగ్ కూడా అందజేస్తున్నారు. ప్రాథమిక విద్య పూర్తి చేసుకుని ఉన్నత విద్యకు వచ్చిన పిల్లలకు వ్యవసాయం, ఆరోగ్యం, వంటలు, ఎలక్ట్రికల్, కంప్యూటర్ రంగాల్లో తర్ఫీదు ఇచ్చి భవిష్యత్తులో వారి అభిరుచికి తగిన రంగాన్ని ఉపాధి కోసం ఎంచుకునేలా తయారు చేస్తున్నారు. తన సేవల్ని అంతటితో ఆపలేదు... సూయం చారిటబుల్ ట్రస్ట్, భారతమాత స్కూలు, కన్నిమేరీ నర్సరీ స్కూలు వంటి మరెన్నో సంస్థల్ని నడుపుతున్నారామె. తిరువల్లూరు, కన్యాకుమారి, నాగపట్నం లాంటి చోట్ల వైద్య శిబిరాలు, విద్యా సంబంధమైన అవగాహన శిబిరాలను నిర్వహిస్తున్నారు.
Saturday, January 31, 2015
అతనికి జ్ఞానం ఉంది... అందుకే...
ఆ రైతు పేరు జ్ఞాన్ సింగ్. స్కూలు పాఠాల జ్ఞానమైతే ఆయనకు లేదు గానీ, తన సమాజానికేం చెయ్యాలో మాత్రం తెలిసిన జ్ఞాని ఆయన. బరేలా అనే గిరిజన జాతికి చెందిన జ్ఞాన్ సింగ్, మధ్యప్రదేశ్‌లోని బర్వానీ జిల్లా మెల్ ఫాలియా గ్రామంలో ఉంటారాయన. ఒకసారి అనుకోకుండా ప్రమాదం జరిగితే, పాపం ఆయన కదలలేక... ఏ పనీ చేసుకోలేని అవస్థకు గురయ్యాడు. వైద్యం చేయించుకోవాలంటే, తమ ఊరికి అడ్డుగా ఉన్న ఒక కొండను దాటుకుని వెళ్లాలి. చివరికి ఆ ఊరివాళ్లు నలుగురు జ్ఞాన్ సింగ్‌ని అతి కష్టం మీద మోసుకుని వెళ్లారు. చికిత్స చేయించుకున్నాక కోలుకున్న జ్ఞాన్ సింగ్, తనేం చెయ్యాలో నిర్ణయించుకున్నారు. కత్తి, సుత్తి, గునపం లాంటి సామాగ్రిని సిద్ధం చేసుకుని... ఆ కొండ మధ్యగా దారి ఏర్పాటు చెయ్యడానికి నిర్ణయించుకున్నారు. మొదట్లో ఆయన సోదరులు, భార్య సలు బాయ్ తోడుగా వచ్చారు. ఏం జరగబోతోందో గ్రహించిన గ్రామస్తులు కూడా వారి నుంచి స్ఫూర్తి తీసుకుని రోడ్డు నిర్మాణం కోసం నడుం బిగించారు. ఇప్పుడు మెల్ ఫాలియా గ్రామ ప్రజలు మన దేశంలోని సోమరులందరికీ స్ఫూర్తిదాతలయ్యారు.
Friday, November 28, 2014
తాళిబొట్టు అమ్మేసింది... టాయిలెట్ కోసం..
ఎవరైనా సరే... ఆస్తులు, నగలు ఎప్పుడు అమ్ముకుంటారు? అప్పులు గాని, అనారోగ్య సమస్యలు గాని, పిల్లల చదువుల కోసమో... సొంతిల్లు కట్టుకునేందుకోవడానికో అమ్ముతారు. కానీ మరాఠీ గ్రామీణ మహిళ సంగీత అహాల్వే తన మంగళసూత్రంతో సహా నగలన్నీ అమ్మేసింది. మహారాష్ట్రలోని వషీం జిల్లా పరిధిలో ఉన్న సాయిఖేదా గ్రామ వాసి సంగీత అహ్వాలే. నగల కంటే మరుగుదొడ్డే తన కుటుంబానికి మేలు చేస్తుందని భావించింది. అందుకోసం తన నగలన్నీ అమ్మేసింది. భారతీయ మహిళలు ప్రాణం కంటే మిన్నగా భావించే మంగళసూత్రం కూడా! ఈ సంగతి సర్కారు దృష్టికి వచ్చింది. సంగీతను రాష్ట్ర మంత్రి పంకజ ముండే ప్రభుత్వం తరపున తన కార్యాలయంలో సత్కరించారు. సంగీత స్పందిస్తూ, మరుగుదొడ్డి అనేది ప్రాథమిక అవసరమని, అందుకే నగలమ్మానని తెలిపింది. మంత్రి పంకజ మాట్లాడుతూ, ప్రజాప్రతినిధిగా తనకు వచ్చే నిధుల్లో 25 శాతం మరుగుదొడ్లు కట్టించేందుకు ఖర్చు చేస్తానన్నారు.
Monday, September 01, 2014
గంగా పుత్రుడు...
అతని పేరు అరుణ్ కృష్ణమూర్తి. 26 ఏళ్ళ వయసు వచ్చేసరికి అతను సాధించిన ఘనత ఏంటో తెలుసా.. దేశంలోని 6 సరస్సులకు జలకళ తీసుకొచ్చాడు. ప్రకృతి మాత మనకు వరంగా ప్రసాదించిన జలవనరులను కాపాడుతున్నాడు. ప్రభుత్వాలు చెయ్యాల్సిన పని తానే చేస్తున్నాడు. గూగుల్ కంపెనీలో ఉద్యోగం వదిలేసి మరీ స్వచ్ఛంద సంస్థ స్థాపించి దేశ ప్రజల దాహార్తి తీర్చుతున్నాడు. అత్యంత ప్రతిష్టాత్మకమైన రోలెక్స్ అవార్డు అందుకున్నాడు. యువత దేశానికి ఏం చెయ్యాలన్నది ఉపన్యాసాలు ఇవ్వడం కాకుండా చేసి చూపిస్తున్నాడు. ఎన్విరానమెంటలిస్ట్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా... ఇఎఫ్‌ఐ స్థాపించి సరస్సుల పునరుద్ధరణకు నడుం బిగించాడు ఈ గంగా పుత్రుడు.
Thursday, July 31, 2014
91 ఏళ్ళు + క్యాన్సర్ + నిధుల సేకరణ
ఒక పక్క క్యాన్సర్‌కు ట్రీట్‌మెంట్ తీసుకుంటూ.. 91 సంవత్సరాల వయసులో 42 కిలోమీటర్ల దూరాన్ని 7గంటల 7నిమిషాల 42 సెకండ్లలో పూర్తి చేశారు బామ్మగారు హారియట్ థాంప్సన్. పైగా ఇదేదో రికార్డు కోసం కాదు. ఈ వయసులోనూ సమాజానికి ఏదో ఒకటి చెయ్యాలన్న తపనే ఆమెను పరుగు తీయించింది. తన స్నేహితురాలు నిర్వహిస్తున్న లుకేమియా లింఫోమియా సొసైటీ కోసం నిధుల సేకరణకు బామ్మ పరుగు పెట్టి ఏకంగా 90 వేల డాలర్లను సొసైటీకి ఇచ్చి సత్తా చాటారావిడ. ఈ మారథాన్ పరుగుకు 4 వారాల ముందు హారియట్ 11 రోజుల పాటు రేడియేషన్ చికిత్స తీసుకున్నారు. దాని వల్ల రెండు కాళ్లకూ విపరీతంగా గాయాలయ్యాయి. వాటికి బ్యాండేజిలు కట్టుకుని మరీ పరుగు తీసింది మన బామ్మ. బామ్మగారి 55 ఏళ్ల కొడుకు బ్రెన్నెమన్ కూడా తల్లితో పరిగెత్తి, సాయం చేశాడు. ఇంత పెద్ద మారథాన్ పూర్తి చేసిన రెండో బామ్మగా అమెరికా చరిత్రలో రికార్డులకెక్కారు. అందరూ బామ్మ మాట బంగారు మాట అంటుంటారు... బామ్మ బాట కూడా బంగారు బాటేనని ఈ బామ్మగారు రుజువు చేశారు.
Monday, June 30, 2014
గ్రేస్‌కు ఇంజనీరింగ్ సీటొచ్చింది..
హిజ్రాలంటే ఏహ్య భావంతో చూసే సమాజం ఇది. కానీ, తమిళనాడులో గ్రేస్ బాను అనే హిజ్రా తనకు ఎదురైన అవహేళనల్ని తట్టుకుని ఇంజనీరింగ్ కాలేజీలో సీటు సంపాదించింది. అన్నా యూనివర్శిటీ కౌన్సిలింగ్ ద్వారా అరక్కోణంలోని శ్రీకృష్ణా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో ట్రిపుల్ ఇ (ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇంజనీరింగ్) కోర్సులో చోటు దక్కించుకుంది. పాలిటెక్నిక్‌లో గ్రేస్ 94 శాతం మార్కులతో సంపాదించింది. గ్రేస్ ట్రాన్స్‌జెండర్ కావడంతో ప్లస్ టూలో ఉండగానే తల్లిదండ్రులు వదిలేశారు. అప్పటి నుంచీ ఎంతో కష్టపడి ఇంజనీరింగ్ వరకూ వచ్చింది.
Subscribe to:
Posts (Atom)








