
అమెరికాలోని వర్జీనియా రాష్ట్రం నార్ఫోక్ ప్రాంతానికి చెందిన ఈ చిన్నారి 1000 బార్బీ డాల్స్ సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈమె పేరు గియానీ గ్రాహం (Gianni Graham) అవన్నీ తానొక్కత్తే ఆడుకోవడానికి కాదు. తనకి అలాంటి బొమ్మలు చాలానే ఉన్నాయి. కానీ, తనలాగా బొమ్మలతో ఆడుకునే భాగ్యం లేని నిరుపేద బాలికలకు పంచడానికి ఈ సేకరణ కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. ఆడుకునే తోడులేక ఒంటరిగా జీవించే బాలికలకు తానిచ్చే బొమ్మ ఒక స్నేహితురాలిగా ఉంటూ వారిలో నవ్వులు పూయిస్తుందని, అదే తనకు చాలని అంటోంది. తన ఈ కార్యక్రమానికి " ‘1K Barbiers For 1K Girls" అని నామకరణం చేసింది. ఇందుకోసం అదే పేరుతో ఒక వెబ్సైట్ కూడా ప్రారంభించింది. ఈ ఏడాది జనవరి నెల నాటికి 700 బొమ్మలు సేకరించింది. ఈ పాటికి మిగిలినవి కూడా సంపాదించే ఉంటుంది. మంచి పనులు చెయ్యడానికి డబ్బు మాత్రమే ఉండాల్సిన పనిలేదని చాటి చెప్పింది గియానీ...