Wednesday, May 30, 2012
పదేళ్ళ కుర్రాడు.. ప్లెయిన్ ఐస్‌క్రీం చాలన్నాడు..
ఈ సంఘటన అమెరికాలో జరిగింది. ఆ రోజుల్లో సన్డా ఐస్‌క్రీం వెల ఒకొక్కటి యాభై సెంట్లు. ఆ రోజుల్లో పిల్లలకు ఇది మహా ప్రాణమట. పెన్సిల్వేనియా రాష్ట్రంలోని హేరిస్బర్గ్ అనే ఊరిలో ఎప్పుటూ కిటకిటలాడే ఒక ఐస్‌క్రీం పార్లర్‌లోకి పదేళ్ళ కుర్రాడొకడు అడుగుపెట్టి టేబుల్ ముందు కూర్చున్నాడు. వెయిట్రెస్ వచ్చి గ్లాస్ మంచినీరు ఇచ్చి నిలబడింది...
ఐస్‌క్రీం సన్డా ఎంత ?.. అడిగాడు ఆ అబ్బాయి.
యాభై సెంట్లు.. చెప్పిందామె.
ఆ అబ్బాయి తన జేబులో ఉన్న నాణేల్ని లెక్కబెట్టుకుంటూ మళ్ళీ అడిగాడు.
మామూలు ఐస్‌క్రీం ఎంత ?..
అక్కడ చాలామంది కస్టమర్లు ఉండటంతో "ముప్ఫై ఐదు సెంట్లు.." అని విసుగ్గా చెప్పింది ఆ వెయిట్రెస్.
పిల్లవాడు తన దగ్గరున్న నాణేలన్నిటినీ లెక్కబెట్టుకుని చివరికి ఒక ప్లెయిన్ ఐస్‌క్రీం తెమ్మని అడిగాడు.
ఆమె ఐస్‌క్రీంతో పాటు బిల్ కూడా తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టేసి వెళ్ళింది. ఈ పిల్లవాడు దాన్ని తినేసి కౌంటర్లో డబ్బు చెల్లించి వెళ్ళిపోయాడు. కాసేపటికి ఈ వెయిట్రెస్ ఆ ఖాళీ కప్ తీసుకెళ్ళడానికి ఈ అబ్బాయి కూర్చున్న టేబుల్ దగ్గరికి వచ్చింది. ఖాళీ కప్ పక్కనే రెండు నికెల్స్, ఐదు పెన్నీ నాణేలు.. మొత్తం 15 పెన్నీలు కూడా కనిపించాయి. వెయిట్రెస్‌కు టిప్ ఇవ్వడం కోసం పిల్లలు ఎంతో ఇష్టపడే సన్డా ఐస్‌క్రీం వద్దనుకుని మరీ ఈ పిల్లవాడు మామూలు ఐస్‌క్రీం ఆర్డర్ చేసినట్లు ఆమె గ్రహించడానికి ఎంతోసేపు పట్టలేదు.
సౌజన్యం: శ్రీ మల్లాది కృష్ణమూర్తిగారు...
Print this post
Labels:
ఔన్నత్యం
Subscribe to:
Post Comments (Atom)
4 comments:
అక్కడ పిల్లల్లో చిన్నప్పటి నుండే ఇలాంటి సంస్కారాలు అలవడతాయి.
Nice :)
ఈ విషయం నిజ్జంగా నిజమైతే ఎంత బాగుండునో కదా.. కొన్ని కొన్ని కధలు కూడా స్పూర్తిగా ఉంటాయి, అటువంటి కోవలోకి ఇది రాకుండా ఉంటే బాగుండును అని నా అభిప్రాయం
చక్రవర్తిగారూ.. ఇది నిజంగా జరిగిన సంఘటనే. ఈ బ్లాగ్‌లో ఉన్నవన్నీ నిజ జీవిత ఘటనలే.. అలాంటివే నేను ఎంచుకుంటాను.
Post a Comment