Saturday, May 31, 2014

చెట్టు కొడుకు..

మధ్యప్రదేశ్‌లో నివసించే శ్యామ్ లాల్ పతిదార్ తన కొడుక్కి ప్రతి ఏటా క్రమం తప్పకుండా పుట్టినరోజు వేడుక జరుపుతుంటాడు. కొడుకును ముద్దు పెట్టుకుని మురిసిపోతుంటాడు. ఇంట్లో తిండి గింజలు లేకపోయినా పట్టించుకోడు కానీ, తన చెట్టంత కొడుకు పుట్టినరోజున కేక్ కట్ చేసి, బుడగలు కట్టి నానా హడావుడి చేస్తాడు. ఇంతకీ ఆ కొడుకు అంత గొప్పవాడా.. అని మీరు అడగవచ్చు. అవును మరి. ఆ చెట్టంత కొడుకు మరెవరో కాదు. ఒక వేప చెట్టు. ఆ చెట్టునే తన కొడుకుగా భావించి పండుగ చేస్తుంటాడాయన. శామ్ లాల్‌ను అందరూ ఆదర్శంగా తీసుకుంటే పర్యావరణ సమస్యలే రావని మధ్యప్రదేశ్ అటవీ శాఖ అధికారులు ఆయన గురించి గొప్పగా చెబుతుంటారు. Print this post

No comments: