Thursday, July 30, 2015

ఖర్చు భరించి వైద్యం చేసిన డాక్టర్ గారు...

డాక్టర్లంటే రోగుల నుంచి ముక్కుపిండి డబ్బు వసూలు చేసేవారనే ముద్ర పడిపోయిన రోజులివి. కానీ వైద్య నారాయణులున్నారని నిరూపించారు హైదరాబాద్‌కి చెందిన డాక్టర్ ఉదయ్ కృష్ణ. ఒక లారీ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, కాలు నుజ్జునుజ్జయిపోయి, ఇన్ఫెక్షన్ సోకి గుండెలు అరచేతిలో పెట్టుకున్న ఒక రోగికి ఆపరేషన్ ఖర్చు 1.66 లక్షల రూపాయల్ని ఆయనే భరించారు. ఆ రోగి గుంటూరు జిల్లా వినుకొండకు చెందిన 42 ఏళ్ళ మహిళ కృష్ణకుమారి. యాక్సిడెంట్‌లో ఆమె కాలు విరిగిపోతే ఉన్న డబ్బంతా ఖర్చుచేసి ఆపరేషన్ చేయించుకున్నా ఫలితం లేకపోయింది. ఒక దశలో  ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారావిడ. అలాంటి పరిస్థితుల్లో తెలిసినవారి ద్వారా డాక్టర్ ఉదయ్ కృష్ణను కలుసుకున్నారు. కృష్ణకుమారికి ఆర్థిక సహాయం, వైద్య సహాయం చేసి తను చేస్తున్న వైద్య వృత్తికి సార్థకత చేకూర్చారు డాక్టర్ ఉదయ్ కృష్ణ. Print this post

No comments: