పుట్టినరోజులనగానే మనలో చాలామంది స్నేహితులిచ్చి టాయ్స్ కోసం ఎదురుచూస్తుంటాం. అయితే, చెన్నైలో ఉంటున్న విద్యార్థిని అక్షయ (13) తన పుట్టినరోజు సంబరాన్ని కొత్తగా చేసుకుంది. ఎనిమిదో తరగతి చదువుతున్న ఈ బాలిక, తన పుట్టినరోజు నాడు మరో పేద బాలికకు భలే బహుమతిని ఇచ్చింది. ఆమెకు టాయ్‌లెట్ కట్టించి చక్కని కానుకను ఇచ్చింది. తన పుట్టినరోజున మరో బాలికకు ఇలాంటి సాయం చెయ్యాలని అక్షయ తన తండ్రి జయకాంతన్‌కు చెప్పగానే ఆయన ఎంతో సంతోషించారు. టాయ్‌లెట్ అవసరం ఉన్న ఒక పేద కుటుంబాన్ని గుర్తించాల్సిందిగా Centre for Sustainable Development అనే ఎన్జీవోను కోరారు. ఆ సంస్థ కడలూరు జిల్లాలోని భువనగిరి పట్టణానికి దగ్గర్లో ఉన్న పెరుమత్తూరు ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని ఆర్తి కుటుంబాన్ని లబ్ధిదారుగా గుర్తించింది. అక్షయ తండ్రి జయకాంతన్ ఆ ఎన్జీవోకు 25 వేలు పంపి ఎకోశాన్ టాయ్‌లెట్ ఏర్పాటు చేయించారు.
ఈ రకమైన టాయ్‌లెట్‌కు నీరు అవసరం లేదట. ఆర్తి కుటుంబంలో పిల్లలు పెద్దలు కలిపి ఏడుగురు మహిళలున్నారు. ఈ సాయం వారందరికీ ఉపయోగపడుతుంది. అక్షయ పుట్టినరోజైన జులై 22 కల్లా ఆర్తి కుటుంబానికి ఈ టాయ్‌లెట్ ఉండేలా సిద్ధం చేశారు. ఆ రోజున ఆర్తి కుటుంబంతోనే అక్షయ గడిపి వారి ఆశీర్వాదం తీసుకుంది. ఈ ఫోటోలో అక్షయ, ఆర్తిలను చూడండి...
Print this post
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment