Wednesday, May 21, 2008
వేడినీళ్ల దానం
తమిళనాడులోని ప్రముఖ పట్టణం సేలం పేరు విననివారుండరు. ఇక్కడున్న ప్రభుత్వాసుపత్రి దగ్గర ఒక పేద మహిళ ఫుట్‌పాత్ పైనే టిఫిన్ దుకాణం నడుపుకుంటుంది. ఆమె టిఫిన్‌కు మాత్రమే డబ్బు తీసుకుంటుంది కానీ వేడి నీళ్లు మాత్రం ఎన్ని కావాలంటే అన్నీ ఉచితం. ముఖ్యంగా ఆసుపత్రికి జ్వరాలతో వచ్చే పేదలు రోగులందరికీ వేడినీళ్లు, కాచి చల్లార్చిన నీళ్లు మత్రమే తాగాలని వైద్యులు సూచిస్తుంటారు. ప్రభుత్వాసుపత్రుల్లో "మంచి" మంచినీళ్లకే కరవుగా ఉంటే ఇక వేణ్ణీళ్లు ఎక్కడుంటాయి. ఈ సమస్యను గ్రహించిన ఆ ఫుట్‌పాత్ హొటల్ యజమానురాలు ఉచితంగా వేణ్ణీళ్ల సరఫరా ప్రారంభించింది. మరో విషయం.. వేణ్ణీళ్లతోబాటు వాటిని పట్టుకెళ్లడానికి క్యాన్లు కూడా ఉచితమేనండోయ్.
Print this post
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment