Friday, November 21, 2008

చీపురు పట్టాడు ఉద్యోగం కొట్టాడు

అక్కడ బోలెడు చెత్త కనిపిస్తోంది. ఉన్నతాధికారులు, పనివాళ్లు అటూ ఇటూ తిరుగుతున్నారు గానీ ఆ చెత్తను తొలగించాలన్న ఇంగితం ఒక్కరికీ కలగలేదు. అదే సమయానికి ప్రభుత్వ శాఖల్లో తాత్కాలిక ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూకు వచ్చిన వాళ్లతో ఆ ప్రాంగళం కిటకిటలాడుతోంది. ఇంటర్వ్యూకోసం సూటు బూటు వేసుకుని వచ్చిన 26 ఏళ్ల వికలాంగుడు గోపికన్నన్ పరిస్థితిని గమనించాడు. ఇక ఏమీ ఆలోచించలేదు. వెంటనే అక్కడున్న చీపురు కట్ట తీసుకున్న ఊడ్చడం మొదలు పెట్టి పని పూర్తి చేశాడు. ఇతను ఊడ్చుతున్నప్పుడు అక్కడే ఉన్న పత్రికా ఫోటోగ్రాఫర్లు విలేఖరులు, గోపీకన్నన్ చొరవను ప్రశంసిస్తూ మర్నాడు పత్రికల్లో ప్రశంసిస్తూ వార్తలు వేసారు. ఈ విషయం రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న జయలలిత దృష్టికి వెళ్లడంతో వెంటనే మదురై మార్కెటింగ్ కాంప్లెక్స్‌లో సెక్యూరిటీ గార్డుగా ఉద్యోగమిస్తూ ఉత్తర్వులిచ్చారు.

అసలు విషయం మీకు ఇంకా చెప్పలేదుగా... రాష్ట్రం మొత్తాన్ని పరిపాలించే ముఖ్యమంత్రి కార్యాలయానికి వేదికైన చెన్నైలోని సచివాలయంలో 2003 జులై నెలలో ఈ సంఘటన జరిగింది. గోపికన్నన్ వికలాంగుడే అయినా విద్యార్హతలతోబాటు జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొని పతకాలు సాధించిన మొనగాడు. మదురైలోని సుబ్రమణ్యపుర టీచర్స్ కాలనీ ఇతని నివాసం. Print this post

4 comments:

రాధిక said...

మంచి స్పూర్తినిచ్చే విషయం చెప్పారు.

Anonymous said...

చాలాస్ఫూర్తిదయకమైన విషయం చెప్పారు. ధన్యవాదములు.

చిలమకూరు విజయమోహన్ said...

మీ టపా చదివాక కొద్ది సంవత్సరాలక్రితం జరిగిన ఒక సంఘటన గుర్తొస్తోంది.పుట్టపర్తికి నేను ఒకసారి వెళ్ళినప్పుదు అక్కడ ఒక బ్యాంక్ కు వెళ్ళాను.అక్కడ మన భారతీయుడు ఒకాయన transaction చేసి పేపర్ చించి అక్కడ వేస్తే బ్యాంక్ కు వచ్చిన ఒక విదేశీ మహిళ ఆ చించిన పేపర్లు తీసుకుని చెత్తబుట్టలో వేసింది.

worthlife said...

స్పందించిన మీ చల్లని హృదయాలకు వందనాలు... ఈ ప్రోత్సాహంతో ఇంకా ఇలాంటివి సేకరిస్తాను.