Friday, August 14, 2009

మిస్టర్, మీరు జీససా?

కొన్నేళ్ళ కిందట న్యూయార్క్‌లో జరిగిన ఒక రీజియనల్ సేల్స్ కన్వెన్షన్‌కి షికాగో నగరం నుంచి కొందరు సేల్స్‌మెన్ హాజరయ్యారు. అదయ్యాక తిరిగి షికాగోకి వెళ్ళడానికి వారంతా వేన్‌లో ఎయిర్‌పోర్ట్‌కు బయలుదేరారు. ట్రాఫిక్ రద్దీ వల్ల వారు ఎయిర్‌పోర్ట్‌కి ఆలస్యంగా చేరుకున్నారు. ఫైనల్ బోర్డింగ్ కాల్ ప్రకటన కూడా వారు విని హడావిడిగా ఒక చేత్తో ఎయిర్ బ్యాగ్, మరొక చేత్తో టికెట్ పట్టుకుని లోనికి పరుగులు తీశారు. ఆ కంగారులో అక్కడున్న ఏపిల్స్ స్టాండ్‌కి వారిలో ఒకరి కాలు తగిలి ఆ పళ్ళన్నీ నేలపై చెల్లాచెదురుగా పడ్డాయి. సెల్స్‌మెన్ అంతా వెనక్కి తిరిగి చూడనైనా చూడకుండా కౌంటర్ వైపునకు పరిగెత్తారు. ఒక్కరు తప్ప.

అతను ఆగి తన మిత్రుల్లో ఒకరితో గట్టిగా చెప్పాడు. "ఫ్రాన్సిస్. షికాగో చేరగానే నువ్వు మా ఆవిడకు ఫోన్ చేసి నేను తర్వాతి ఫ్లయిట్‌లో వస్తున్నానని చెప్పు"

ఆ ఏపిల్ స్టాండ్ మేనేజ్ చేసే 16 ఏళ్ళ పిల్ల సన్నగా ఏడుస్తూ నేలపై పడిన పళ్ళు ఏరుకుంటోంది.

విమానంలో మిత్రులతో పాటు వెళ్ళకుండా ఆగిన ఆ వ్యక్తి గట్టిగా ఊపిరి తీసుకుని వదిలి, నేలపై చెల్లాచెదురుగా పడిన ఆఖరి ఏపిల్ కూడా ఏరి స్టాండ్‌లో ఉంచి చెప్పాడు. "ఏడవక. అన్నీ ఏరాను. దెబ్బ తిన్నవి వేరే ఉంచాను."

ఏడుస్తున్న ఆమె చేతిలో నలభై డాలర్ల నోట్లని ఉంచి చెప్పాడతను. "తీసుకో. ఇది నీకు జరిగిన నష్టానికి సరిపడే పరిహారం. నువ్వు దీని యజమానికి జవాబుదారీ అని నాకు తెలుసు."

ఆమె అతన్ని తడిమి చూస్తూ "మిస్టర్ మీరు జీససా?" అని అడిగింది.

ఆమె అతన్ని భావించినట్లుగా, మనల్ని ఎవరైనా దేవుడు అనుకునేలా, జీవితంలో ఒక్కసారైనా అలా నిస్వార్ధంగా ప్రవర్తించి ఉంటామా?

సౌజన్యం: శ్రీ మల్లాదిగారు. Print this post

14 comments:

చిలమకూరు విజయమోహన్ said...

ప్చ్.ఏమో !(నిస్వార్థంగా ప్రవర్తించి ఉంటామా?)
నిజంగా ఆయన జీసస్సే.

భావన said...

Good one.

ashok said...

nice

MURALI said...

పేజీలకు పేజీలు వ్యాసాలు వ్రాయకుండా, మూడే ముక్కల్లో మనిషి జీవితంలో ఎలా బ్రతకాలో ఎలా బ్రతికితే మానవుడు మహనీయుడు అవుతాడో మీ బ్లాగులో చెబుతున్నారు. అన్నయ్య నిజంగా బ్లాగు మొదల్యినప్పటినుండి ఇప్పటివరకూ ఎంతమందిచూస్తున్నారు, ఎంతమంది వ్యాఖ్యానిస్తున్నారు అనేవాటి గురించి తాపత్రయపడకుండా ఏం వ్రాయాలో అనేదానికి ఒక నియమం పెట్టుకుని నిబద్దతగా దానికే కట్టుబడి ఉన్న బ్లాగు మీది. బ్లాగుల్లో మీదొక విశిష్ట బ్లాగు. హ్యాట్సాఫ్.

Ramesh said...

మంచి సంఘటన. మీ బ్లాగు బాగుంది. మంచి మనసున్న మనిషే దేవుడు. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో అలాంటి ఒక కాంప్లిమెంట్ సంపాదిస్తే మంచి తనం విలువ అర్దం అవుతుంది.

శ్రీనివాసకుమార్ said...

మీ ఈ ప్రోత్సాహమే నాకు కొండంత బలం.

Vinay Chakravarthi.Gogineni said...

nenu cheppalanukunnadi already murali said...........excellentone.......

నండూరి వెంకట సుబ్బారావు said...

chaalaa manchi sanghTana. Ayithe Ee sanGhaTanaku Inkolaa kooda prathispandincha vachemo. sumaarugaa aa paLLaku jarigina NasHtaaniki Lekka kaTTi Ame Srama viluvatho kalipi, "ammaa nenu tondaralo unnaanu. Daya chesi ee Dabbulatho nee yajamaaniki lekkacheppu. Na valla/ naa snehitula valla jarina nashtaaniki chinthistunnaanu" ani chepte Flight miss kaavaalsina pani Undademo.

neokiranvenki@gmail.com said...

hai srinivas garu..how r u..?this is kiran(webdunia..chennai)..pls give me your mail id...

నీటి బొట్టు said...

good post

నండూరి వెంకట సుబ్బారావు said...

చాలా మంచి సంఘ్తన. అయితే ఈ సంఘటనకు ఇంకోలా కూడా ప్రతిస్పందించ వచేమో. సుమారుగా ఆ పళ్ళకు జరిగిన నష్టానికి లెక్క కట్టి ఆమె శ్రమ విలువతో కలిపి, "అమ్మా నేను తొందరలో ఉన్నాను. దయ చేసి ఈ డబ్బులతో నీ యజమానికి లెక్కచెప్పు. నా వల్ల/ నా స్నేహితుల వల్ల జారిన నష్టానికి చింతిస్తున్నాను" అని చెప్తే ఫ్లైట్ మిస్ కావాల్సిన పని ఉండదేమో.

Anonymous said...

Cool blog I enjoyed reading your information

[url=http://partyopedia.com]party supplies[/url]

Anonymous said...

Hi there,I enjoy reading through your article post, I wanted to write a little comment to support you and wish you a good continuation. All the best for all your blogging efforts.

Anonymous said...

Just keep posting good content.