Monday, July 26, 2010

మొక్కలు మొక్కే మనిషి

ఖమ్మం జిల్లావాసి దరిపల్లి రామయ్య ఎప్పుడు కనిపిస్తాడా.. ఆయనకు ఎప్పుడు మొక్కుదామా అని చెట్లన్నీ ఎదురు చూస్తున్నాయి. ఆయన్ని తమ కొమ్మలతో కావలించుకుని.. స్పృశించి తరించాలని తరులన్నీ ఆశపడుతుంటాయి. అయన తన తలకు "వృక్షో రక్షతి రక్షితః" అన్న నినాదం రాసి ఉన్న ఒక చక్రంలాంటి అట్టను తలకు ధరించి, మొక్కలతో సైకిల్ మీద ఊరూరూ తిరుగుతూ వాటిని పెంచమని అందరికీ పంచుతూ ఉంటాడు. మొక్కలు, చెట్లు... వాటి ఉపయోగాలపై చిన్నప్పుడెప్పుడో తన గురువుగారు చెప్పిన పాఠాన్ని గుర్తుంచుకుని ఈ సత్కార్యానికి పూనుకున్నారు రామయ్యగారు. మొక్కలు పంచడమేగాక వాటిని గురించి వనసూక్తులు, పాటలు రచించి గానం చేస్తుంటారు. తన జీవితకాలంలో కనీసం కోటి మొక్కలు నాటాలన్నది ఆయన లక్ష్యం. రామయ్యగారి కోరిక నెరవేరాలని మనమంతా కోటి దేవతల్ని వేడుకుందాం. ఇక రామయ్యగారి భార్యామణి (పేరు తెలియదు) కూలి పని చేసుకుంటూ తన భర్త ఉన్నతాశయానికి అండగా నిలుస్తున్నారు. Print this post

No comments: