Sunday, December 12, 2010

వృద్ధులు పాటించారు... డాక్టర్ అనుసరించారు

తమిళనాడులోని తిరునెల్వేలికి చెందిన వృద్ధ దంపతులు ఎస్ ఎస్ పళనియప్పన్ (80), మీనమ్మాళ్ (74) ఒక రోజున తిరునెల్వేలి వైద్య కళాశాల ఆసుపత్రికి వచ్చారు.  మరణానంతరం అవయువదానంగా తమ దేహాల్ని ఈ ఆసుపత్రి వైద్య కళాశాల విద్యార్థుల పరిశోధనల నిమిత్తం సమర్పిస్తూ తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన పత్రాల్ని ఆసుపత్రి డీన్‌కు అందజేశారు.

పళనియప్పన్ గతంలో శంకరన్ కోవిల్ గ్రామంలో మెడికల్ స్టోర్ ఆపీసర్‌గా పనిచేసేవారు. మరణానంతరం వైద్య పరిశోధనల కోసం తమ దేహాల్ని దానంగా ఇవ్వాలని 40 ఏళ్ళ కిందటే నిర్ణయం తీసుకున్నామన్నారు. ఆయన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జీవితకాల సభ్యునిగానూ ఉన్నారు. అవయువదాన ప్రాధాన్యత గురించి తన భార్యతో చర్చించినప్పుడు ఆమెకూడా ఇందుకు సంతోషంగా ఒప్పుకుందని పళనియప్పన్ తెలిపారు. వీరి అభిమతాన్ని కుటుంబ సభ్యులంతా ఏ మాత్రం ప్రశ్నించక గౌరవించారట. ప్రచారం కోసం కాకుండా... అవయువదానం దిశగా మరిందరిని ప్రోత్సహించాలన్న ఆశయంతో తాము ఈ పని చేశామని వివరించారు.

ఇక పళనియప్పన్, మీనమ్మాళ్ దంపతుల ఔదార్యంతో చలించిపోయిన ఆసుపత్రి డీన్ ఎస్ రామగురు సైతం అప్పటికప్పుడే నిర్ణయం తీసుకుని తాను కూడా వారితోబాటే తమ ఆసుపత్రికి తన దేహాన్నీ మరణానంతరం అప్పగించేలా పత్రాలు సమర్పించేశారు. మరణించిన వ్యక్తుల నేత్రాలు, మూత్రపిండాలు, కాలేయం లాంటి అవయువాలు మరెందరికో జీవితాన్నిస్తాయని, సమాజంలో అవగాహన లేకపోవడంతో ఎందరో రోగులు వేదన చెందుతుండటం గురించి తనకు తెలుసని పేర్కొంటూ రామగురు ఆ వృద్ధుల్ని అనుసరించారు. Print this post

2 comments:

రవిశేఖర్ హృ(మ)ది లో said...

meeru cheppinadaanikanna chala baagundi mee site.manasuni kadilinche kathanalu. go ahead.
ravisekhar oddula
www.ravisekharo.blogspot.com

worthlife said...

ధన్యవాదాలండీ.. మీలాంటి వారి ప్రోత్సాహం ఉంటే చాలు..