ఫ్రెంచ్ మొరాకోలో దర్శకుడు హెన్రీ తన "ది బ్లాక్ రోజ్" సినిమా తీస్తున్న రోజులవి. ఆ ప్రాంతంలో హథవే కెయిడ్ ఇబ్రహీం అనే వ్యక్తికి చెందిన ఒక అద్భుతమైన ప్యాలెస్ ఉంది. అందులో తన సినిమా షూటింగ్ కోసం ఇబ్రహీం అనుమతి కోసం హెన్రీ వచ్చాడు. తన ప్యాలెస్‌లో షూటింగ్ చేసుకోమని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే, ప్యాలెస్ ఆవరణలోకి కెమెరాలు, క్రేన్‌లు, భారీ లైట్లు, ఇతర సామాను తీసుకురావడానికి చెట్లు అడ్డు వస్తున్నాయి. ఇక ఆ చెట్లు కొట్టించడానికి అంగీకరించాలంటూ ఇబ్రహీంని కలిశాడు హెన్రీ.
చెట్లు కొట్టించవద్దు. కావాలంటే గోడ పడగొట్టుకోండి.. అన్నాడు ప్యాలెస్ యజమాని ఇబ్రహీం
చెట్లు కొట్టించడం చాలా తక్కువ ఖర్చుతో అయిపోతుంది. గోడ కూల్చడం, మళ్లీ కట్టించడం చాలా ఖర్చు వ్యవహారం కదా.. అన్నాడు దర్శకుడు హెన్రీ..
నాకున్న డబ్బుతో అలాంటి గోడలు ఎన్నయినా క్షణాల్లో కట్టిస్తాను. కానీ, చెట్లు పడగొడితే తిరిగి మొలిపించే శక్తి నాకు లేదు.. అంటూ గోడను కూల్చడానికే మొగ్గు చూపాడు పర్యావరణ ప్రేమికుడైన ఇబ్రహీం...
భారత పాలకులారా.. మీకు అర్థమయిందనుకుంటాను.
సౌజన్యం: శ్రీ మల్లాదిగారు..
Print this post
Friday, December 30, 2011
Subscribe to:
Post Comments (Atom)
3 comments:
no, never
సార్! మన పాలకులకు అర్థమవుతుందో లేదో కానీ మీ కథనంలోని సంకల్పం మాకైతే బాగా అర్థమైంది. మీ బ్లాగ్‌కు ప్రస్తుతం ఇక్కడ ఒక అభిమాని ఉన్నాడనుకోండి. అయితే, ఈ అభిమాని ఇలాంటి కథనాలను చాలా ఎక్కువగా ఎదురుచూస్తున్నాడు. తద్వారా ఎక్కువ మంది అభిమానులను మీ బ్లాగ్‌కు తీసుకురావాలనుకుంటున్నాడు. మేము ఏర్పాటు చేసే వేదికకు అధికారిక బ్లాగ్లలో దీనిని కూడా చేర్చాలనుకుంటున్నాడు. మీ మా వేదిక అంబాసిడర్ గా మాకు ఈ సాయం చేసిపెట్టగలరని ఆశిస్తున్నాం.
ధన్యవాదాలు.
తప్పకుండా సోదరా.. ఇకపై మరింత ఎక్కువగా ఇలాంటి వాస్తవాలను మీముందు ఉంచడానికి ప్రయత్నిస్తాను.
Post a Comment