Thursday, December 01, 2011

డాక్యుమెంటరీల పోలీస్..

గుంటూరు జిల్లా డిసిఆర్‌బిలో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్‌ కొట్టె శ్రీహరి స్టయిలే వేరు. సమాజంలో జరుగుతున్న నేరాలపట్ల ప్రజలకు అవగాహన కల్పించి వారిని అప్రమత్తం చేయడానికి వినూత్న శైలిని ఎంచుకున్నారీయన. రకరకాల నేరాలపై డాక్యుమెంటరీలు నిర్మించి వాటిని ప్రదర్శించడం ద్వారా శ్రీహరి పౌరుల్ని అప్రమత్తం చేస్తుంటారు. ఈక్రమంలోనే 2007 పౌరులారా పారాహుషార్, 2009లో బతుకు బతికించు అనే రెండు లఘు చిత్రాలు నిర్మించి నేరాల నిరోధానికి తన వంతు సేవలందిస్తున్నారు. నకిలీ బాబాలు, వ్యసనాలు, గొలుసు దొంగలు, ప్రేమ మోసాలు, దురలవాట్లు, ర్యాగింగ్, బిస్కెట్ గ్యాంగులు లాంటివి ఈయన నిర్మించే లఘు చిత్రాల ఇతివృత్తంగా ఉంటాయి. జర్నలిజంలో ఎం.ఎ చేసిన శ్రీహరి తన ఈ లఘుచిత్రాలకు గాను 2001లో హైదరాబాద్ పోలీస్ డ్యూటీ మీట్‌లో బంగారు పతకాన్ని కూడా సాధించారు. Print this post

No comments: