Saturday, April 15, 2006

సాహసంతో సావాసం

మేకుల మొనలు పైకి ఉండేలా దిగ్గొట్టి ఉన్న బల్లపై ఏమాత్రం సంకోచం లేకుండా వెల్లకిల్లా పడుకొని ఉండగా.... ఛాతీపై 10 నాపరాళ్లను పెట్టించుకొని పగులగొట్టించుకొనే శరీరం అది. చేతుల మీద నుంచి ఓ పాతిక ముప్పై కార్లు వెళ్లినా ఆ ముఖంపై చిరునవ్వు చెరగదు. తలపై, ఒంటిపై ఓ పదులకొద్దీ ట్యూబులైట్లను పగలగొడుతున్నా... అదే చిరునగవు. కళ్లకు గంతలు కట్టుకొని బులెట్ నడపడం, తాను పడుకొని తన పొట్టపై నుంచి ఇద్దరు కూర్చొని ఉన్న మొటార్ సైకిల్ వెళుతున్నా పెద్దగా పట్టించుకోకపోవడం.... ఇవండీ ఆ మనిషి చేసే పనుల్లో కొన్ని. పై విషయాలన్నీ వినగానే కండలు తిరిగిన గండర గండడు, మాయా మహేంద్రజాల విద్యలు తెలిసిన మాయగాడు గుర్తొస్తున్నాడు కదూ. ఈ సాహసి ఎవరో తెలుసా... 17 ఏళ్లకే అంతర్జాతీయ కరాటే పోటీల్లో స్వర్ణపతకాన్ని జయించిన ఖమ్మం వాసి కల్యాణి. ఈ పట్టణానికి చెందిన ఆర్ఎంపీ వైద్యుడు వెంకటనారాయణ, రాజ్యలక్ష్మిల కుమార్తె అయిన కల్యాణి కరాటేలో బ్లాక్ బెల్ట్ విజేత. పిన్న వయసుకే అన్ని రకాల వాహనాలూ నడపడం నేర్చుకుంది. తల్లి రాజ్యలక్ష్మి మూత్రపిండాల జబ్బుతో మంచాన పడగా ఆమెకు ఎప్పటికప్పుడు సేవలందిస్తూనే అన్ని విద్యల్లోనూ కల్యాణి నైపుణ్యం సాధించింది. ఇవన్నీ చూసుకుంటూనే పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన కల్యాణి అథ్లెటిక్స్, జిమ్నాస్టిక్స్, ఇతర ఆటలన్నిటిలోను రాణించి, బాలరత్న అవార్డు కూడా గెల్చుకొని, మార్షల్‌ఆర్ట్స్‌లో రెడ్‌బెల్ట్ దిశగా పయనం సాగిస్తోంది (ఈ వివరాలు అందేనాటికి) . కల్యాణికున్న పట్టుదలలో కొంతైనా మనకూ ఉంటే లోకకల్యాణమే. Print this post

7 comments:

వెంకట రమణ said...

మీ బ్లాగు చాలా బాగుందండి. మీరు ఇలానే మరిన్ని స్ఫూర్తి కల్గించే పోష్టులు చెయ్యాలని ఆశిస్తున్నాను.

Anonymous said...

QwwH0x The best blog you have!

Anonymous said...

yhrhnw actually, that's brilliant. Thank you. I'm going to pass that on to a couple of people.

Anonymous said...

Please write anything else!

Anonymous said...

rCklZj write more, thanks.

Anonymous said...

Thanks to author.

Anonymous said...

Please write anything else!