Thursday, October 06, 2011

పేరుకే అంధులు.. సేద్యంలో వీరులు

వరంగల్ జిల్లా నెక్కొండ మండలం రెడ్లవాడకు వెళ్ళి ఆ ఊరిలో ఆదర్శ జీవనం గడుపుతున్న రామనాథం, దశరథం సోదరుల్ని మనిషి జన్మ ఎత్తిన ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా కలుసుకోవాల్సిందే. 60 ఏళ్ళ పైబడిన ఈ ఇద్దరూ గుడ్డివారే. అయినప్పటికీ ఒకరికొకరు తోడుగా గత 35 సంవత్సరాలుగా రామలక్ష్మణుల్లా కలసిమెలసి వ్యవసాయం చేసుకుంటూ దిగుబడిలో ఆదర్శరైతులకే ఆదర్శంగా నిలుస్తున్నారు. తమ పొలంలోని సుమారు 30 గుంటల్లో ధాన్యం, పత్తి, పసుపు పంటలు వేసి మంచి దిగుబడి సాధించారు. పొలానికి నీరు పట్టడం, నాగలితో దున్నడం, బర్రెల్ని తోలుకెళ్ళడం, బస్తాల్లో ధాన్యం నింపడం, పొద్దుపోయాక మోటారు వేయడం లాంటి పనుల్ని చిన్నవయసులోనే తండ్రి ద్వారా నేర్చుకున్నారు. వీరికి ఎనిమిదేళ్ళ వయసున్నప్పుడు జ్వరం వచ్చింది. సరైన వైద్యం అందక దృష్టిని కోల్పోయారు. కళ్ళు లేకపోయినా చేతి వేళ్ళతో లోతు కొలిచి పంటకు ఇంకెంత నీరు కావాలో చెప్పగల సామర్థ్యం వీరి సొంతం. మరి ప్రభుత్వం వీరికి ఆదర్శ రైతు పురస్కారాల్ని ఎప్పుడిస్తుందో కదా.. Print this post

No comments: