Thursday, October 06, 2011

వీరి పేరు ప్రకాశం.. మానవతకు నివాసం

విజయనగరం జిల్లా రామభద్రపురం మండలం కొట్టక్కి గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు ప్రకాశరావు మానవత్వానికి మారుపేరుగా నిలిచి ఉపాధ్యాయ వృత్తికే వన్నె తెచ్చారు. చుట్టుపక్కల గ్రామాల్లోని పాఠశాలల్లో మహాత్మా గాంధీ విగ్రహాల్ని తన స్వంత ఖర్చుతో నెలకొల్పి మహాత్ముని ఆదర్శాలను చాటి చెబుతుంటారు. ఇంతవరకూ ఈయన చేతుల మీదుగా 125కు పైగా గాంధీ విగ్రహాల్ని ఏర్పాటు చేయించారు. విగ్రహాల ఏర్పాటుకే పరిమితం కాకుండా పేద కుటుంబాలకు సైతం చేదోడువాదోడుగా నిలిచి వారిళ్ళల్లో పెళ్ళిళ్ళు, శుభకార్యాలకు ప్రకాశరావుగారు తన వంతు చేయూతనిస్తుంటారు. సేవా కార్యక్రమాలు, విద్యార్థులకు ఉచితంగా పుస్తకాల పంపిణీ ఇవన్నీ ఈ మా...స్టార్ గారికి నిత్యకృత్యాలే.. Print this post

No comments: