Thursday, October 06, 2011

మంచితనపు సిరులు... సిరియా పౌరులు

సిరియాలోని నియంత ప్రభుత్వం తమ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటున్న పౌరులపై కత్తిగట్టింది. ప్రత్యేకించి యువతులపై "రేప్" ఆయుధాన్ని ప్రయోగిస్తోంది. దీంతో జీవితకాలపు అవమానభారాన్ని మోయలేక కుంగిపోతున్న ఈ బాధితురాళ్ళను పెళ్ళి చేసుకుని అండగా నిలుస్తామని సిరియా యువకులు ముందుకొచ్చి తమలోని నిజమైన మానవత్వాన్ని చాటుకున్నారు.

సిరియాలోని క్రూర ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన షబియా మిలిషియా వర్గం ఆ దేశ మహిళలపై అత్యాచారాలకు ఒడిగడుతుండటంతో గౌరవంగా బతుకుతున్న కుటుంబాలు ఈ మహళలను పరువు హత్యలకు గురిచేస్తున్నాయి. సిరియా - టర్కీ సరిహద్దులో ఉన్న Jisr al-Shughur లాంటి పలు పట్టణాల్లో వేధింపులు, అత్యాచారాలకు గురైన 10 వేలమందికి పైగా సిరియా యువతులు టర్కీలోని శరణార్థి శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్నారు.

ఈ దారుణమైన పరిణామాల మధ్య సుమేరియా పట్టణంలో రేప్‌కు గురైన నలుగురు అక్కాచెల్లెళ్ళు టర్కీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. షుగౌర్ ప్రాంతానికి చెందిన ఇబ్రహీం కాయిస్ అనే వ్యక్తి ఇచ్చిన స్ఫూర్తితో మరికొందరు యువకులు ఇలాంటి యువతుల తెలుసుకుని కొత్త జీవితాన్ని అందించడానికి ముందుకొచ్చారు.

సిరియాలో ప్రభుత్వ అకృత్యాల గురించి ఇంతకంటే ఎక్కువ రాయలేను. ఆక్కడి పరిస్థితులపై మీకు ఆసక్తి ఉంటే ఈ లింక్ పైన క్లిక్ చేసి తెలుసుకోండి.. Print this post