Thursday, March 16, 2006

పరీక్షలో విజేత 82 ఏళ్ల బామ్మ

మలేసియాలోని సిక్కు కుటుంబంలో పుట్టిన 82 ఏళ్ల మొహిందర్ కౌర్‌కు 11 మంది మనుమలు, మనుమరాళ్లు కూడా ఉన్నారు. వారితో ఆటపాటలను కొనసాగిస్తూనే నవంబర్ 2005లో మలేసియా దేశవ్యాప్తంగా జరిగిన పంజాబీ పరీక్షకు హాజరై ప్రధమస్థానం పొందారు. గత 30 ఏళ్లుగా ఆమె అక్కడి పాఠశాలల్లో పంజాబీ ఉపాధ్యాయురాలిగా పని చేసారు. అయితే, ఈవిడ ఈ పరీక్షలో ఉత్తీర్ణురాలవడంలో గొప్పేముందని అనుకోవచ్చు. ఇక్కడి విషయం అది కాదు. బాధ్యతలన్నీ ముగిశాక ఊసుబోలు కబుర్లతో కాలక్షేపం చేయకుండా ఏదో ఒకటి సాధించాలన్న తపనతో ఆమె ముందడుగేసింది. ఈ పరీక్షలో అగ్రస్థానంలో నిలిచి జీవితంలోని ఓ కొత్తకోణాన్ని ఆస్వాదించింది. వయసు కాదు, కృషి ముఖ్యమని చాటింది. Print this post

No comments: