Friday, March 24, 2006

సమైక్యత కోసం ఆసనాలు

దేశ సమైక్యత దిశగా సమాజాన్ని ప్రేరేపించడానికి తన వంతు ఏం చేస్తే బాగుంటుంది ? మద్రాసు సమీపానగల పట్టాభిరాంలోని భారతీనగర్‌కు చెందిన సిద్ధ వైద్యులు, యోగాసనాల నిపుణులైన అన్బరసన్‌కు వచ్చిన ఆలోచన ఇది. తనకు తెలిసిన విద్యనే ఇందుకు సాధనంగా ఉపయోగించుకోవాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా గణతంత్ర దినోత్సవమైన జనవరి 26వ తేదీన జాతీయ పతాకాలను చేబూని, తలపై కూడా పతాకాన్ని ధరించి, వినూత్న రీతిలో అనేక రకాల అసనాలు వేసి జాతి సమైక్యత దిశగా జనావళిని ప్రేరేపించేందుకు పతాకస్థాయిలో ప్రయత్నం చేసి శభాష్ అనిపించుకున్నారు. ఇదొక్కటే కాదు ఏటా స్వాతంత్ర్య దినమైన ఆగష్టు 15వ తేదీన కూడా దేశ శాంతిని కోరుతూ ఇలాంటి భిన్నమైన కార్యక్రమాలను అన్బరసన్ నిర్వహిస్తున్నారు. గత 25 ఏళ్లకు పైగా ఆయన శిక్షణా శిబిరాలను ఏర్పాటు చేస్తూ విశిష్ట రీతిలో దేశమాతకు సేవలందిస్తున్నారు. ఇదీ ఆయన జీవితంలోని సరికొత్త కోణం. Print this post

No comments: