Tuesday, March 28, 2006
ఉద్యోగం చిన్నదే.... హృదయం పెద్దది
ఈయన రాజకీయ నాయకుడో, వ్యాపారవేత్తో లేదా పారిశ్రామిక వేత్తో కాదు. కడప జిల్లాలోని పులివెందుల ఫైర్ స్టేషన్ డ్రైవర్ నారాయణ జీవితం ఇది. ప్రతినెలా తన జీతంలోంచి కనీసం 500 రూపాయలను సమాజసేవకే వినియోగిస్తారు. తాను పనిచేస్తున్న ఫైర్ స్టేషన్ ఆవరణలో రూ.35 వేల ఖర్చుతో నీటి ట్యాంక్ ఏర్పాటు చేయడమేగాక ఫైరింజన్‌కు 2 వేల రూపాయల ఖర్చుతో రంగు వేయించారు. ప్రభుత్వ ఖర్చుతో జరగాల్సిన ఎన్నో మంచి పనులకు తన సొంత డబ్బును ఖర్చు చేసారు. తన కార్యాలయానికే గాక సమీపాన గల గాంధీనగర్ పాఠశాలకు నారాయణ అందించిన తోడ్పాటు అంతా ఇంతా కాదు. ఈ పాఠశాలకు బీరువా, జెండా దిమ్మె, క్రీడా పరికరాలు, ప్లాస్టిక్ నీటి ట్యాంకు, గడియారం ఇంకా ఎన్నెన్నో నారాయణ జీతంలోంచి సమకూరాయి. ఇంతేగాక ఈ ఊరిలోని పలు ప్రభుత్వ, ప్రయివేటు కార్యాలయాల్లో నారాయణ అందించిన గడియారాలు అతని సేవా తత్పరతకు ప్రతీకగా నిలుస్తాయి. అవి మోగించే ఘంటికలు జీవితకాలపు విలువను చెప్పకనే చెబుతుంటాయి. పదవీ విరమణాతరం తనకు వచ్చే పింఛను మొత్తాన్ని సేవాశ్రమ నిర్మాణానికి ఉపయోగించాలన్నది నారాయణ లక్ష్యం.
Print this post
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment