Sunday, March 19, 2006

వికలాంగులా మజాకా

వికలాంగులే జ్యోతి ప్రజ్వలన గావించి, ప్రతిభాపాటవాలను ప్రదర్శించి, అన్నీ ఉన్న సమాజానికి తమ విజయగాథలను వినిపించి స్ఫూర్తినిచ్చిన అద్భుత కార్యక్రమం అది. నోటితో చిత్రాలు గీసే జనార్థన్, డ్రమ్స్ వాయించడంలో ఘనుడైన కేఆర్ ప్రసాద్, తమిళ సాహిత్యంలో డాక్టరేట్ అందుకున్న తొలి అంధుడు ఆర్.చంద్రన్... ఇలా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పాండిచ్చేరిల నుంచి వచ్చిన ప్రతిభావంతులైన వికలాంగులెందరో చెన్నై శివారు రెడ్‌హిల్స్ తిరువళ్లూర్ కూడలి వద్దగల శీనయ్యర్ నాడార్ రాజమ్మాళ్ల్ కళ్యాణ మండపానికి విచ్చేసి తమ సత్తా చాటారు. చెన్నై సమీపానగల పాడియనల్లూరులోని మదర్ థెరిసా పాఠశాల ప్రిన్సిపాల్, అంగవికలురకు చేయూతనిస్తూ ఆదుకుంటున్న సెల్వకూమార్ ఈ విశిష్ట కార్యక్రమానికి శ్రీకారం చుట్టి. వివిధ రంగాల్లో ప్రవీణులైన వికలాంగులను సత్కరించారు. విజయాలు సాధించడానికి అంగవైకల్యం ఎంతమాత్రం అడ్డుకాదని చాటే "ఇదుదాన్ ఆరంభం (ఇదే ఆరంభం)" అనే చలనచిత్రం చిత్రీకరణ ఈ సందర్భంగా ప్రారంభమైంది. Print this post

No comments: