Thursday, March 23, 2006

వీళ్ల ముందు మా సేవలెంత...

పై మాటలన్నది ఆ జిల్లా కలెక్టర్ రాధాకృష్ణన్. ఎందుకో తెలుసుకోవాలంటే ఇది చదవండి. వాళ్ల ముగ్గురు పిల్లలతో పాటు ఇంటికొచ్చిన ఏడుగురు బంధువుల్నీ సునామీ రూపంలో ఎగసిన సముద్రం మింగేసింది. అదికూడా ఆ ఇంటి పెద్ద పుట్టిన రోజున. తమిళనాట నాగపట్టణంలో ఓఎన్‌జీసీ ఉద్యోగి పరమేశ్వరన్, అక్కడే పనిచేస్తున్న ఎల్ఐసీ ఉద్యోగిని చూడామణి దంపతుల వ్యధాభరిత కథ ఇది. ఆ తర్వాత వీళ్లిద్దరూ ఏం చేసారో తెలుసా? దైన్యంతో మూల కూర్చోలేదు. ధైర్యంగా ముందడుగేసి తమలాంటి బాధితులను ఆదుకోవాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా కన్యాకుమారి నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశంజిల్లా వరకూ ప్రయాణించి తమలాంటి బాధితులకు ఊరటనిచ్చే ప్రయత్నం చేసారు. అంతటితో ఆగలేదు. నంబిక్కై (నమ్మకం) పేరిట సేవా సంస్థను ప్రారంభించారు. సునామీ విలయతాండవంలో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మిగిలిన బాలలను చేరదీసి, వారి జీవితంలో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తూ వసుధైక కుటుంబానికి శ్రీకారం చుట్టారు. ఇటీవల ఈ ప్రాంతానికి వచ్చిన అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ ఈ దంపతులను కలుసుకొని ఈ కథలాంటి ఈ నిజాన్ని ప్రతి చోటా చెబుతానన్నారు. Print this post

9 comments:

Anonymous said...

Keep going sir, these stories inspires the peoples to achieve some more hights in there life.

Anonymous said...

hjmJps The best blog you have!

Anonymous said...

lki3Gi Good job!

Anonymous said...

Wonderful blog.

Anonymous said...

Please write anything else!

Anonymous said...

CDafNC write more, thanks.

Anonymous said...

Friends help you move. Real friends help you move bodies.

Anonymous said...

Good post and this fill someone in on helped me alot in my college assignement. Thank you seeking your information.

Anonymous said...

Keep writing such interesting and amazing things. kamagra