Wednesday, March 15, 2006

సంచార దుకాణం - స్థిరమైన జీవితం

అతను ఎం.ఎ పట్టభద్రుడు. మొన్నటి నిరుపేద, నిన్నటి నిరుద్యోగి. నేడు.... నలుగురికి ఉపాధినిచ్చే యజమాని స్థాయి. అతనే పాండిచ్చేరికి చెందిన నెడుంజెళియన్. ఇదంతా ఎలా జరిగిందటారా ? అందరిలాగే ఉద్యోగాల కోసం ప్రయత్నించినవాడే. ఒక దశలో పాండిచ్చేరిలోని జిప్‌మెర్ ఆసుపత్రిలో వెల్డింగ్ కార్మికుడిగానూ తాత్కాలికంగా పని చేసాడు. బతుకు బండి సరిగ్గా నడవకపోవడంతో ఇల్లు తాకట్టుపెట్టి ఈ ఆసుపత్రి దగ్గరే ఒక బడ్డీకొట్టు పెట్టుకొని ఖాళీ సమయాల్లో దానినీ చూసుకుంటూ రేయింబవళ్లూ కష్టపడ్డాడు. పరిస్థితి మెరుగుపడటంలో అప్పుతీర్చి ఇంటిని తాకట్టు నుంచి విడిపించుకున్నాడు. తర్వాత సంచార దుకాణం నడిపితే ఎలాగుంటుందనే కొత్త ఆలోచనతో మారుతీవ్యాను కొనుక్కొని ఆసుపత్రి పరిసరాల్లో దానిని సంచార దుకాణంగా నిర్వహిస్తున్నాడు. ఇప్పుడు అతని స్థితి ఏమిటో తెలుసా ? మరో కొత్త ఇల్లు కొనుక్కున్నాడు. ఇంకో సంచార దుకాణం పెట్టుకున్నాడు. మరిందరికి ఉపాధినిచ్చే స్థాయికి ఎదిగాడు. ఉద్యోగం దొరకకపోతే దానికోసం చెప్పులరిగేలా తిరిగి సమయాన్ని వృధా చేసేకన్నా, కొంచెం కష్టపడేందుకు నేటి యువత ముందడుగేస్తే జీవితంలో హాయిగా స్థిరపడవచ్చని ఆత్మవిశ్వాసంతో చెబుతున్నాడు నెడుంజెళియన్. Print this post

9 comments:

Anonymous said...

x22w4R The best blog you have!

Anonymous said...

ULNsHK Hello all!

Anonymous said...

Please write anything else!

Anonymous said...

actually, that's brilliant. Thank you. I'm going to pass that on to a couple of people.

Anonymous said...

Wonderful blog.

Anonymous said...

sQae69 write more, thanks.

Anonymous said...

The gene pool could use a little chlorine.

Anonymous said...

Please write anything else!

Anonymous said...

I have read a lot of your posts and I think that you write very interesting things that may be of help for everybody. I'll certainly add your blog to my Favorites. opera mini