Thursday, March 16, 2006

పేదవాడి పట్టుదలతో తెరుచుకున్న గేట్

కడప కేఎస్సారెమ్ ఇంజనీరింగ్ కళాశాల మెకానికల్ విద్యార్థి ఆర్.ప్రసాద్. తిరుపతి బొమ్మగుంట వీధిలో ఉంటున్న అతని తండ్రి శివాజీ ఒక ప్రయివేటు ఎలక్ట్రీషియన్, తల్లి స్వర్ణ మహిళా సంఘంలో సభ్యురాలు. సంఘంలో అమ్మ చేసే అప్పులే ప్రసాద్ చదువుకు పెట్టుబడి. ఆ పెట్టుబడినే పట్టుదలగా మార్చుకున్నాడు ప్రసాద్. కష్టపడి చదువుకొని గేట్ (గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్) పరీక్షలో వెయ్యికి 758 మార్కులు సాధించి జాతీయస్థాయిలో మొదటి స్థానం పొందాడు. ఈ వార్తను నేను ఈనాడు పత్రికలో చదివాను. ప్రసాద్‌ను మన విద్యార్థులు ఆదర్శంగా తీసుకొని ముందడుగేయాలి. Print this post

No comments: