Friday, March 17, 2006
నిన్న బెదిరినా... నేడు అదరగొడుతోంది
చెన్నైశివారు ప్రాంతమైన అలమాదికి చెందిన సంగీత అందరిలాంటి మామూలు ఆడపిల్ల. తండ్రి నటరాజన్ ఓ మామూలు ఉపాధ్యాయుడు. సంగీత రోజూ పాఠశాల నుంచి ఇంటికొస్తూంటే తన వెంటపడే అల్లరిమూకల వేధింపులకు ప్రతిరాత్రీ బాధపడేది. వెంటనే దీనికి ముగింపు పలకాలని నిర్ణయించుకుంది. ఇంటిదగ్గరుండే స్నేహితుని సాయంతో ఓ రోజు కరాటే తరగతుల్లో చేరింది. ఇప్పుడామె సాధించిన విజయాలేంటో తెలుసా ? ధర్మపురిలో జరిగిన దక్షిణభారత కరాటేపోటీల్లోను, చెన్నై జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో జరిగిన జాతీయ కరాటే పోటీల్లో ప్రథమస్థానం దక్కించుకుంది. అలా సాగిన జైత్రయాత్ర ఆమెకు ఇంకెన్నో గౌరవాలను అందించింది. ఇప్పుడు తన ఇంటివద్ద సుమారు 150 మందికి కరాటే శిక్షణనిస్తున్నారు. ఈమె శిష్యుల్లో 70 మంది గృహిణులు కూడా ఉన్నారు తెలుసా. అమ్మాయిలూ.... సంగీతను స్ఫూర్తిగా తీసుకొని సంగీతంతో పాటు యుద్ధ కళల్ని కూడా నేర్చుకోండి మరి.
Print this post
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment