Wednesday, March 22, 2006

వైకల్యమున్నా.... ఆటల్లో మేటి

చెన్నై సమీపాన అరక్కోణానికి చెందిన అరవిందరాజ్ నిజంగా హీరోనే. ఇతని కథేంటో తెలుసా ? తొమ్మిది నెలల వయసుకే పోలియో రావడంతో రెండు కాళ్లూ వైకల్యానికి గురయ్యాయి. ఆ వైకల్యాన్నే ఆయుధంగా మార్చుకొని అరవిందరాజ్ సాధించిన విజయాల పరంపర, ఇతని జీవితంలోని కొత్త కోణాల గురించి తెలుసుకోండి మరి. 1998, 2000 సంవత్సరాల్లో జరిగిన టేబిల్ టెన్నిస్ రాష్ట్ర స్థాయి పోటీల్లో విజేత ఇతనే. గవర్నమెంట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రిహేబిలిటేషన్ చెన్నైలో నిర్వహించిన జిల్లా స్థాయి క్యారమ్స్ పోటీల్లో ఛాంపియన్‌గా నిలిచాడు. 2002 సంవత్సరంలో బెంగళూరులో జరిగిన జాతీయ అథ్లెటిక్ పోటీల్లో షాట్‌పుట్, డిస్కస్‌త్రో విభాగాల్లో స్వర్ణాలు, జావెలిన్‌త్రో విభాగంలో రజతాన్నీ కైవశం చేసుకున్నాడు. ఆ తర్వాత 2004, 2006 సంవత్సరాల్లో బెంగళూరులోనే జరిగిన జాతీయ వికలాంగుల క్రీడల్లోనూ పాల్గొని టేబుల్ టెన్నిస్, వీల్ ఛైర్ బ్యాడ్మింటన్ పోటీల్లో స్వర్ణ, కాంస్య పతకాలు చేజిక్కించుకున్నాడు. ప్రస్తుతం అరక్కోణంలోని రైల్వే ఇన్‌స్టిట్యూట్ టేబుల్ టెన్నిస్ కోచ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న అరవిందరాజ్ గతంలో కొరియాలో జరిగిన భూసన్ ఫెస్పిక్ గేమ్స్, చైనాలో జరిగిన నాలుగో ఫెస్పిక్ గేమ్స్‌కు అర్హత సాధించినా ఆర్థిక సమస్యల కారణంగా వెళ్లలేకపోయాడు. ఇప్పుడు మలేసియాలో జరిగే ఏసియన్ గేమ్స్‌లో పాల్గోనేందుకు అర్హత సాధించి సాయమందించే దాతల కోసం ఎదురు చూస్తూ ముందడుగేస్తున్నాడు. Print this post

No comments: