Thursday, March 16, 2006
ఇంటికీ, బస్సుకూ ఆమే డ్రైవర్
నిత్యం రద్దీతో ఉండే చెన్నైలోని వడపళని, పట్టినబాకం ప్రాంతాలను కలిపే మార్గం అది. ఆ దారిలో రోజూ వెళ్లే 12బి నెంబరు బస్ డ్రైవర్ (ఈ కథనం రాసే నాటికి) హమీదాబాను జీవితం మహిళా లోకానికి స్ఫూర్తి అనడం అతిశయోక్తి కాదేమో. చెన్నై సిటీబస్సుల నిర్వహణ సంస్థ మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పోరేషన్ (ఎమ్‌టిసి)లో స్థానం దక్కించుకున్న తొలి మహిళా డ్రైవర్ ఆమె. బస్సుతో పాటు ఇల్లాలుగా ఇంటినీ నడిపే హమీదా ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదివినా, ఆ స్థాయి ఉద్యోగమే కావాలని కూర్చోలేదు. విరామ సమయంలో లారీలు, బస్సుల మరమ్మతు విధానాలను నేర్చుకొని అందులో నిష్ణాతురాలయ్యారు. ముందు తాను చదివిన కారైకుడి (తమిళనాడు)లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ సంస్థ బస్సు డ్రైవరుగా విధులు నిర్వహించారు. విరామ సమయాల్లో టెక్నికల్ డ్రైవింగ్ తరగతులు నిర్వహిస్తూ యువతులకు ఆటో డ్రైవింగు నేర్పి తోటి మహిళలకు హమీదా ఆదర్శంగా నిలిచారు. డ్రైవర్ సీట్లో హమీదా ఉంటే ఇక భయమేలేదని ఆమె బస్సులోని ప్రయాణీకులు, సిబ్బంది ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంకేం కావాలి చెప్పండి.
Print this post
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment