Thursday, March 16, 2006

మడతపడిన సైకిల్...

తమిళనాడులోని కడలూర్ జిల్లా తెన్‌పాది గ్రామం.... అక్కడ చింతామణి అనే ఓ 80 (ఎనభయ్యే...) ఏళ్ల కుర్రాడు విరిగిన సైకిల్‌తో కనిపిస్తుంటాడు. కావలసినప్పుడు దాన్ని అతికించుకుని తొక్కుకుంటూ వెళిపోతుంటాడు. ఆ కుర్రాణ్ణి ఓసారి పలకరిస్తే... ఈ సైకిల్ కథ చెప్పాడు. అక్కర్లేనప్పుడు మడతపెట్టుకొని... అవసరమైనప్పుడు అమర్చుకొనే వీలుగల ఈ సైకిల్ దాదాపు 50 ఏళ్ల కంటే పాతదట. అప్పట్లో బ్రిటిష్ సైనికులు ఇలాంటి మడిచే సైకిళ్లను వేసుకొని హెలికాఫ్టర్‌లో ఆయా ప్రాంతాలకు చేరుకొనేవారట. హెలికాఫ్టర్లు వెళ్లలేని మారుమూల ప్రాంతాలకు ఈ సైకిళ్లపై వెళ్లి విధులు నిర్వహించేవారట. అలాంటి ఓ సైకిల్‌ను మన చింతామణిగారు సంపాదించి... నాటి నుంచి నేటి వరకూ దాన్నే ఉపయోగిస్తున్నారు. తిరుపతి, పళని, వేలాంగన్ని (క్రైస్తవ పుణ్యక్షేత్రం) వంటి ప్రముఖ క్షేత్రాలకు ఈ సైకిల్ పైనే వెళుతుంటారు. సైక్లింగ్ వల్ల ఆరోగ్యం బాగుంటుందని, దీనితో పాటు కాలుష్యానికి దూరంగా ఉంటూ జీవితంలో కొత్త కోణాలను ఆస్వాదించవచ్చనేది పదవీ విరమణ చేసిన ఈ ఉపాధ్యాయుని ఉవాచ. Print this post

No comments: