Wednesday, March 15, 2006
నిన్న కూలీ .... నేడు అదర్శనారి
నాగ శిరోమణి చదివింది 5వ తరగతే. అయినా పనిలో మణిపూసే. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా దెందులూరులో మొన్న వ్యవసాయకూలీగా, నిన్న డ్వాక్రా మహిళగా ఎదిగి మదర్ థెరిసా సొసైటీకి నేతృత్వం వహించారు. విధి నిర్వహణలో చూపిన పట్టుదలతో అధికారుల దృష్టిలో పడి జాతీయ సమాచార సంస్థ ద్వారా కంప్యూటర్ శిక్షణనందుకున్నారు. రాయితీతో కూడిన రుణం పొంది, తన ఊరిలో సొసైటీ బృందం అండగా ఈ-సేవ కేంద్రాన్ని తెరిచి విజయవంతంగా నిర్వహిస్తున్నారు. మరి నేడో.... అంతర్జాతీయ సంస్థ స్కాచ్ ఛాలెంజర్ ఇచ్చే గ్రాస్ రూట్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ పురస్కారానికి చేరువయ్యారు. మన మహిళా లోకానికి ఈమె స్ఫూర్తిదాయకం కదూ...
Print this post
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment