Thursday, March 16, 2006

అంధుడు కాదు జ్ఞానపుత్రుడు

మెదక్ జిల్లాలోని ఓ మారుమూల గ్రామంలో పుట్టిన గంగారాం మూడో ఏటే మశూచి బారినపడ్డారు. నాటి నుంచీ అంధత్వంతోనే ఆయన బంధుత్వం నెరిపి, దృష్టిలేమినే ఆయుధంగా మలుచుకున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం ద్వారా తెలుగులో ఎం.ఎ పట్టా సాధించడమేగాక, పరిశోధన పత్రం సమర్పించి ఎం.ఫిల్ పట్టా కూడా దక్కించుకున్న తొలి అంధుడు గంగారాం. రాష్ట్ర ప్రభుత్వం అంధులకు ఇచ్చే అత్యుత్తమ సేవా పురస్కార గౌరవాన్ని పొందారు. ఇప్పుడు అంధుల పాఠ్యపుస్తకాలను ముద్రించే సంస్థలో గంగారాం సేవలందిస్తూ ఎందరికో సాయం చేస్తున్నారు. మన గంగారాం బంగారం కదూ. Print this post

No comments: