Wednesday, March 22, 2006

రియల్ సన్... నెల్సన్

తమిళనాడులోని తిరునెల్వేలికి చెందిన 24 ఏళ్ల వికలాంగుడు నెల్సన్‌కు మూడు చక్రాల సైకిలే ఆధారం. క్షణకాలపు ఆవేశంతో దేశంలో ఎందరో ఎయిడ్స్ బారిన పడి జీవనాధారాన్ని కోల్పోతున్నారన్న నిజం అతన్ని ఊరకే ఉండనివ్వలేదు. వెంటనే తన మూడు చక్రాల సైకిల్‌నే ప్రచార రథంగా మార్చుకొని ఎయిడ్స్ పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు పర్యటన ప్రారంభించాడు. సుమారు 160 రోజులుగా దాదాపు 1600 కిలోమీటర్లకు పైగా వివిధ ప్రాంతాలలో పర్యటించి ఎందరో గ్రామీణ ప్రజలకు, అక్కడి పాఠశాల విద్యార్ధులకు ఎయిడ్స్ భూతం గురించి చెప్పి హెచ్చరించాడు. ముఖ్యంగా డ్రైవర్లకు ఈ వ్యాధి పట్ల అవగాహన లేక ఎక్కువగా ఎయిడ్స్ బారిన పడుతున్నారని తెలుసుకున్న నెల్సన్ వారిని ప్రధాన లక్ష్యంగా చేసుకొని విస్తృత ప్రచారం చేసాడు. ఇతని పట్టుదలకు మెచ్చుకున్న తమిళనాడు ఎయిడ్స్ నివారణ సంస్థ తగినంత చేయూతనిస్తోంది. ఈ ప్రచారంతో పలు జీవితాలను తీర్చిదిద్ది కొత్త కోణాలను ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నాడు మన నెల్సన్. Print this post

No comments: