Wednesday, March 15, 2006

నేల మీద కాగితం .... కాలితో కలం

ఖమ్మం జిల్లా అశ్వాపురం మండలంలోని అటవీప్రాంత గ్రామమైన కుమ్మరిగూడెం వాసి పర్శిక రాజు ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థి (ఈ కథనం రాసే నాటికి). చిన్నతనంలో జరిగిన విద్యుత్ ప్రమాదంలో రెండు చేతులూ పోయాయి. రోజూ అడవిమార్గంలో నడచి మణుగూరులోని జూనియర్ కళాశాలలో జరిగే తరగతులకు వస్తుంటాడు. మరి పాఠ్యాంశాలు ఎలా రాసుకుంటాడనేగా మీ సందేహం ? విజేతకు ఎప్పుడూ ద్వారాలు తెరిచే ఉంటాయి. పట్టుదలను కలగలిపి కాలితోనే కలం పట్టి రాయడం నేర్చుకున్నాడు. చక్కని దస్తూరిని అలవరుచుకున్నాడు. ఉజ్వల భవిత దిశగా అడుగులేస్తుంటాడు. Print this post

No comments: