Thursday, March 23, 2006

అతను అన్నీ చేయగలడు...

అతను టీ కప్‌ను భుజంపై పెట్టుకొని తాగుతాడు. స్క్రూడ్రైవర్ పట్టుకొని రేడియో, టీవీ, సెల్‌ఫోన్... ఇలా ఏది పాడైనా బాగుచేస్తాడు. ఖాతాదార్లు కూడా ఎక్కువమందే. చూట్టానికి ముచ్చటేస్తుంది కూడా. ఇవి కాకుండా స్విచ్ వేస్తాడు, పుస్తకాలూ పట్టుకోగలడు. మొదట చెప్పిన విషయం తప్ప మిగిలినవి చాలామంది చేసేవేగా, కొత్తేముంది అంటారేమో.... ఆగండాగండి. ఇవన్నీ అతను కాళ్లతో లేదా నోటితోనే చేస్తాడు. ఎందుకంటే అతనికి పుట్టుకతోనే చేతుల్లేవు. చెన్నై సమీపాన గల విల్లివాక్కం ప్రాంతానికి చెందిన హాసిన్ గురించే మనం మాట్లాడుకుంటున్నాం. చేతుల్లేవన్న నిజం మొదట బాధ కల్గించినా, తల్లిదండ్రుల చేయూతతో చాలా పనులు కాళ్లతో లేదా నోటితోనే చేసుకోవడం నేర్చుకున్నాడు హాసిన్. అంతటితో హాసిన్ తన జీవితాన్ని సరిపెట్టుకోలేదు. తన మిత్రులు స్థాపించిన జీవన్ వెల్ఫేర్ సొసైటీ తరపున పలు సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకుంటూ ఎయిడ్స్ వ్యాధిపై సమాజానికి అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాడు. పదో తరగతే చదువుకున్నా హాసిన్ పది మందికీ ఎలా ఉపయోగపడుతూ జీవితంలోని కొత్త కోణాల్ని ఆస్వాదిస్తున్నాడో తెలుసుకున్నారుగా.... Print this post

10 comments:

చేతన_Chetana said...

చాలా బాగున్నాయి పోస్టులు, వాళ్ళందరూ సాధిస్తున్న కొత్త కోణాలు..!!

Anonymous said...

1iybVM The best blog you have!

Anonymous said...

nAWD0R Hello all!

Anonymous said...

Nice Article.

Anonymous said...

Nice Article.

Anonymous said...

Thanks to author.

Anonymous said...

PBP6c7 write more, thanks.

Anonymous said...

If ignorance is bliss, you must be orgasmic.

Anonymous said...

Give me ambiguity or give me something else.

Anonymous said...

I would like to post some of your ideas in my blog. Can I ,please take them? where to buy cialis